అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో మైక్రోమాక్స్ యుఫోరియా స్మార్ట్‌ఫోన్

|
మైక్రోమాక్స్ యుఫోరియా

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ ‘యు' (Yu), శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే తన యురేకా ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా యుఫోరియా (Yuphoria) పేరుతో సరికొత్త శ్యానోజెన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రకటించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,999. స్టీరియో తరహా సౌండ్ ఆడియో, మెటల్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లు ఉన్నాయి. (ఇంకా చదవండి: హైదరాబాద్‌లో అదిపెద్ద గూగుల్ క్యాంపస్)

మైక్రోమాక్స్ యుఫోరియా

మైక్రోమాక్స్ వెల్లడించిన వివరాల మేరకు యుఫోరియా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ మే 28న ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే సదరు రిటైలర్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది.

మైక్రోమాక్స్ యుఫోరియా

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.

Best Mobiles in India

English summary
Yu Yuphoria with 5-inch Display, 4G Connectivity Launched at Rs 6,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X