హైదరాబాద్‌లో అదిపెద్ద గూగుల్ క్యాంపస్
హైదరాబాద్‌లో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో కూడిన క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ క్యాంపస్‌ను 2 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద క్యాంపస్ కానుందట.

సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, గూగుల్ వెస్‌ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్‌క్లిఫ్‌లు ఎంవోయూ పై సంతకాలు చేసారు. ఈ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఫ్రస్తుతం ఉన్న గూగుల్ సిబ్బందిని 6500 నుంచి 13 వేల వరకు పెంచనునున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.
(ఇంకా చదవండి: 10 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు)
తెలంగాణ రాష్ట్రంలో పెట్టబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 5న యూఎస్ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే అమెరికాలోని పలు కంపెనీలు సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతున్నారు.


Click it and Unblock the Notifications








