ప్రారంభమైన యూ యురేకా బ్లాక్ సేల్
4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో విడుదలైన యురేకా బ్లాక్ ధర రూ.8,999గా ఉంది.
మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యుూ టెలీవెంచర్స్, తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Yu Yureka Blackను కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ మంగళవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో విడుదలైన యురేకా బ్లాక్ ధర రూ.8,999గా ఉంది.

యు యురేకా బ్లాక్ ప్రత్యేకతలు... మెటల్ బాడీ డిజైన్, 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్),2.5డి కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్చ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3000mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications