జెన్ నుంచి బడ్జెట్ ధరలో అదిరే ఫోన్

Written By:

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ తన కొత్త స్మార్ట్ ఫోన్ అడ్మైర్ స్టార్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.3,290గా కంపెనీ నిర్ణయించింది. జెన్ మొబైల్స్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎడిషన్‌ను ధరకు అనువైన రీతిలో ఫీచర్లను ఆఫర్ చేసినట్టు విశ్వసిస్తున్నామని కంపెనీ సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ముందుగా సూచించిన ఐదు నెంబర్లకు యూజర్ల లొకేషన్ వివరాలను పంపించేందుకు వీలుగా ఎస్ఓఎస్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. ఫీచర్ల ఈ కింది విధంగా ఉన్నాయి.

జియోకి ఊహించని షాక్:రూ.40కి పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

4.5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్ ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.

#2

512 ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నెల్ మెమరీ, 32 జీబీ విస్తరణ మెమెరీతో ఫోన్ వస్తోంది.

#3

కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ రియర్ కెమెరాతో పాటు 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

#4

ఎస్ఓఎస్ ఫీచర్తో వస్తున్న ఈ మొబైల్ 2000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

#5

జెన్ యాప్ క్లౌడ్, లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్ నెక్స్ జెన్ టీవీ, వీడియో ప్లేయర్ ఉలివ్ వంటి వాటిని ఈ ఫోన్లో ప్రీలోడెడ్‌గా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Zen Mobile launches Admire Star smartphone at Rs 3,290 Read more gizbot telugu..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot