Home
News

జియోకి ఊహించని షాక్:రూ.40కి పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటా

By Hazarath

జియోతో టెక్ దిగ్గజాలను హడలెత్తిస్తున్న ముకేష్ అంబానికి ఇప్పుడు అనుకోని షాక్ తగిలింది. అంబానికి పోటీగా మరో కొత్త టెలికందారుడు దూసుకొచ్చాడు. ఇంకా చెప్పాలంటే రిలయన్స్ కు సొంతింటి పోరు మొదలైంది.. అవును ఇప్పటిదాకా ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ వోడాఫోన్, ఐడియాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న అంబానికి తమ్ముడు అనిల్ అంబాని రూపంలో పెద్ద సంక్షోభం ఎదురుకానుంది. అదెలాగో ఓ సారి చూద్దాం.

మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...?

#1

#1

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు 4జీ సేవలు అందిస్తామంటూ టెలికం మార్కెట్లోకి సునామి ఎంట్రీ ఇచ్చిన ముకేష్ అంబానికి ఇప్పుడు తమ్ముడు అనిల్ అంబాని కంపెనీ రిలయన్స్. కాం రూపంలో పెద్ద తలనొప్పి అలాగే పోటీ ఎదురుకానుంది.

#2

#2

రిలయన్స్. కాం తన చందాదారుల కోసం ఇప్పుడు ఓ కొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది. అదేంటంటే మీరు 40 రూపాయల రీఛార్జ్ తో పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటాను ఉచితంగా పొందవచ్చు.

#3

#3

ఈ ఆఫర్ మీకు 28 రోజుల వ్యాటిడిటీతో లభిస్తుంది. అంటే మీరు 28 రోజుల పాటు పుల్ టాక్ టైంతో పాటు 1జీబి డేటాను ఎంజాయ్ చేయవచ్చు.

#4

#4

గతంలో వినియోగదారులు రూ 40. రీఛార్జ్ రూ 32 టాక్టైమ్ వచ్చేది. అయితే ఈ తాజా ఆఫర్ లో ఓ మెలిక కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

#5

#5

మీకు ఇప్పుడు వచ్చే ఈ అదనపు ఎనిమిది రూపాయల టాక్ టైం ను మీరు రీచార్జ్ చేసుకున్న పదిరోజుల లోపు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ టాక్ టైం మీకు ఉండదు.

#6

#6

ఇదిలా ఉంటే తమ అన్మదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల ముకేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించిన కొద్ది రోజులకే తమ్ముడు పెద్ద సవాల్ తో ముందుకు దూసుకువచ్చాడు.

#7

#7

డాటా టారిఫ్ యుద్ధంలో రిలయన్స్ జియోకి అనిల్ రూపంలో కొత్త పోటీదారుడు ఎదురయ్యాడని ఇప్పుడు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ముందు ముందు అన్నకు తమ్ముడు పోటీదారునిగా రానున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

#8

#8

ఇలాంటి ఆఫర్‌ని ప్రకటించిన తొలి సంస్థ ఆర్ కామ్ కావడం ఓ విశేషం. ఇక జియోకి పోటీగా అనిల్ ప్రకటించిన ఈ ఆఫర్ పై మొబైల్ వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Best Mobiles in India

English summary
Reliance Jio has a new competitor! On recharge of Rs 40 get full talk time plus 1GB data read more gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X