రూ.9,499కే డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్

Zopo Mobile తన మొట్టమొదటి డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. Speed X పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.9.499.

ఇంకా చదవండి : డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్ని వెబ్‌సైట్‌లలో దొరుకుతోంది..

అన్ని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోన్ దొరుకుతోంది. చార్‌కోల్ బ్లాక్, ఆర్చిడ్ గోల్డ్, రాయల్ గోల్డ్ ఇంకా స్పేస్‌గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెెమెరా

ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ సెన్సార్‌ల కాంభినేషన్‌లో ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరాను సెటప్ చేసారు. అన్ని రకాల ఆధునిక ఫోటోగ్రఫీ సౌకర్యాలు ఈ కెమెరాలో ఉన్నాయి.

Zopo Speed X స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 

ర్యామ్, ప్రాసెసర్, స్టోరేజ్

64 బిట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6753 ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి డీడీఆర్3 ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి స్టోరేజ్ వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు...

13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 2,680mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్.

ప్రీ-ఇన్ స్టాల్డ్ యాప్స్‌, 25 ప్రాంతీయ భాషల సపోర్ట్..

Zopo World, Zopo Care వంటి ప్రీ-ఇన్ స్టాల్డ్ యాప్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ 25 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. మల్టీ విండో వ్యూ, స్మార్ట్‌స్ర్కీన్ స్ప్ల్లిట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Zopo's first dual camera smartphone Speed X goes on sale for Rs 9,499. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting