భారీ బ్యాటరీతో జెడ్‌టీఈ బ్లేడ్ A2 Plus
ఈ బడ్జెట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీతో వస్తోంది.ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్టులో దీన్ని విక్రయించనున్నారు.
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ జెడ్‌టీఈ తన లేటెస్ట్ మొబైల్‌ను ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జెట్‌టీఈ బ్లేడ్ ఎ2 ప్లస్ పేరుతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీతో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ మార్కెట్లోకి దిగింది. ఫిబ్రవరి 6 నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్టులో దీన్ని విక్రయించనున్నారు. సిల్వర్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ధరను కంపెనీ రూ. 11,999గా నిర్ణయించింది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ఆధార్ ఇస్తామంటూ ఎన్నో ఫేక్ సైట్లు, ఓ కన్నేయండి

డిస్‌ప్లే
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5 డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 లాంటివి అదనపు పీచర్లు.

ప్రాసెసర్
ప్రాసెసర్ విషయానికొస్తే 1.5 గిగాహెడ్జ్ 64-బిట్మీడియాటెక్ ఎంటి6750ఎంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం.

ర్యామ్
3జీబీ, 4జీబీ ర్యామ్ లతో రెండు వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. సిల్వర్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఇండియాలో 4జీబీ వేరియంట్లో లభించనుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది.

కెమెరా
కెమెరా విషయానికొస్తే వెనుకభాగంలో 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను పొందుపరిచారు. ముందర బాగంలో 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచారు.

అతి భారీ బ్యాట
అతి భారీ బ్యాటరీ సామర్ధ్యంతో, వేగవంతమైన ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ హైలైట్ అని కంపెనీ చెబుతోంది. 22 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుందని తెలిపింది. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్.


Click it and Unblock the Notifications








