ఆధార్ ఇస్తామంటూ ఎన్నో ఫేక్ సైట్లు, ఓ కన్నేయండి

Written By:

ఆధార్ సేవలను చట్ట వ్యతిరేకంగా అందిస్తూ ప్రజల వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఏజజెన్సీలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యూఐడీఐ ఉక్కుపాదం మోపింది. ఈ తరహాలో అనధికారికంగా సేవలందిస్తున్న 12 వెబ్‌సైట్లతో పాటు, గూగుల్‌ ప్లేస్టోర్‌లోని 12 మొబైల్‌ యాప్‌లను మూయించింది.

BSNL మరో బంపరాఫర్, 8జిబి డేటా

ఆధార్ ఇస్తామంటూ ఎన్నో ఫేక్ సైట్లు, ఓ కన్నేయండి

అదే విధంగా మరో 26 మోసపూరిత, చట్టవ్యతిరేక వెబ్‌సైట్లు, మొబైల్‌ అప్లికేషన్లను మూతవేయించాల్సిందిగా సంబంధిత అధికార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ కార్డు లేదా సంబంధిత సేవలను అందిస్తామని చెబుతూ ప్రజల నుంచి ప్రాథమిక సమాచారాన్ని పొందే కొన్ని వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లను గుర్తించాం. వీటిపై చర్యలు తీసుకున్నామని యూఐడీఏఐ సీఈఓ అజయ్‌ భూషణ్‌ పాండే పేర్కొన్నారు.

రూ. 2,999కే మోటో ఎమ్ ( షరతులు వర్తిస్తాయ్ )

ఆధార్ ఇస్తామంటూ ఎన్నో ఫేక్ సైట్లు, ఓ కన్నేయండి

ఇటువంటి వెబ్‌సైట్లపై మా నిఘా కొనసాగుతుంది. మా దృష్టికి ఏవైనా వస్తే వెంటనే వాటిని మూసివేయడంతో పాటు మరిన్ని కఠిన చర్యలూ తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ అధికారిక వెబ్‌సైట్‌ అయిన www.uidai.gov.in ద్వారా లేదంటే అధీకృత సేవా కేంద్రాలు లేదా ఆధార్‌ శాశ్వత నమోదు కేంద్రాల ద్వారా మాత్రమే ఆధార్‌ సంబంధిత సేవలను పొందాలని ఆయన సూచించారు.

English summary
Fake Sites and App Giving Aadhaar Services Shut Down by UIDAI read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot