మ్యూజిక్ మీ ఒక్కరికే వినబడుతుంది!

Posted By: Staff

మ్యూజిక్ మీ ఒక్కరికే వినబడుతుంది!

 

కొంత మందికి మ్యూజిక్ వింటేగాని నిద్రరాదు.. మరికొందరికి మ్యూజిక్ వింటే అసలు నిద్రపట్టదు. ఇలా వేరు వేరు అభిరుచుల కలిగిన ఇద్దర వ్యక్తులు ఒకే చోట ఉండాల్సి వస్తే..? ఇలాంటి పరిస్థితులను సానుకూలంగా చక్కదిద్దేందుకు సీఈఎస్ 2013 కొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది. ‘స్లీప్ ఫోన్’ పేరుతో సరికొత్త బ్లూటూత్ ఆధారిత సాఫ్ట్ హెడ్‌బ్యాండ్‌ను సీఈఎస్ 2013 ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఈ బ్లూటూత్ ఆధారిత  హెడ్‌బ్యాండ్‌ను బ్లూటూత్ మ్యూజిక్ డివైజ్‌కు కనెక్ట్ చేసి మీ చెవులకు పెట్టుకున్నట్లియితే ఆడియో మీ ఒక్కరికే వినబడుతుంది. ఏప్రిల్ నుంచి ఈ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. రిటైల్ మార్కెట్ ధర  $80.

ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

ఎల్‌జీ సరికొత్త ఎయిర్‌ప్లే డాకింగ్ స్పీకర్ ‘ఎన్‌డి8520’!

యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ ఎల్‌జి(LG) సోమవారం ఎన్‌డి8520 మోడల్‌లో సరికొత్త ఎయిర్‌ప్లే డాకింగ్ స్పీకర్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. 80వాట్ల శక్తితో కూడిన 2.1 ఛానల్ ఆడియో అనుభూతులను ఈ డాకింగ్ స్పీకర్ అందిస్తుంది. ఆపిల్ డివైజ్‌లనే కాకుండే ఇతర యూఎస్బీ, ఎంపీ3, డబ్ల్యూఎమ్ఏ ఫార్మాట్‌లను ఈ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ఎమ్ రేడియో, ఆలారమ్ క్లాక్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ డాకింగ్ స్పీకర్ ఒదిగి ఉంది. ఎల్‌జీ బ్లూటూత్ కంట్రోల్ అప్లికేషన్ ద్వారా వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ డాకింగ్ స్పీకర్ ధర రూ.20,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot