జీబ్రానిక్స్ నుంచి మూడు సరికొత్త స్పీకర్ సిస్టంలు

Posted By: Super

జీబ్రానిక్స్ నుంచి మూడు సరికొత్త స్పీకర్ సిస్టంలు

 

జీబ్రానిక్స్ మూడు శక్తివంతమైన స్పీకర్ సిస్టంలను అందుబాటులోకి తెచ్చింది. మాన్స్‌టర్ టవర్ స్పీకర్‌లుగా డిజైన్ కాబడిన ఈ ఆడియో స్పీకర్ సిస్టంలను ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ ఐన్ఫోట్రానిక్స్ రూపొందించి జీబ్రానిక్స్ బ్రాండ్ క్రింద విక్రయిస్తోంది. జడ్ఈబిటీ7500ఆర్ యూసీఎఫ్, జడ్‌ఈబి-టీ9500ఆర్ యూసీఎఫ్, జడ్‌ఈబి-టీ8500ఆర్ యూసీఎఫ్ మోడళ్లలో లభ్యంకానున్న ఈ స్పీకర్లు 100వాట్ ఆర్ఎమ్ఎస్ సౌండ్‌ను విడుదల చేయగలవు. ఉత్తమ క్వాలిటీ సౌండ్ ఫ్రీక్వెన్సీ కోసం 8,4,1 అంగుళాల వేరియంట్‌లో రెండేసి డ్రైవర్లను స్పీకర్‌ల‌లో నిక్షిప్తం చేశారు. యూఎస్బీ ఇంకా ఎస్డీ‌కార్డ్‌ స్లాట్‌లను ఈ స్పీకర్ సిస్టంలలో ఏర్పాటు చేశారు. ఎఫ్ఎమ్ రేడియో రిసీవర్ వ్యవస్థ మరో ప్రత్యేకత. ఈ స్పీకర్ సిస్టంలను పెద్ద టీవీలతో పాటు మొబైల్ ఫోన్‌లు, మీడియా ప్లేయర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

ధరలు:

జడ్ఈబి - టీ7500ఆర్ యూసీఎఫ్ - రూ.6,799.

జడ్‌ఈబి-టీ9500ఆర్ యూసీఎఫ్ - రూ.9,999.

జడ్‌ఈబి-టీ8500ఆర్ యూసీఎఫ్ - రూ.7,499.

దూకుడుమీదున్న… మహేష్, నాగ్, ఎన్‌టీఆర్!

 

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot