అంతరిక్షంలో జంతువుల హడావుడి

Written By:

మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాలని ఎప్పటి నుంచో కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నాడు..అసలు పైన వాతావరణం ఎలా ఉంటుంది.మనం ఎలా జీవిస్తాము అనే దానిపై ఇప్పటికీ అనేక రకాలు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అంతరిక్షంలో అడుగుపెట్టి అక్కడ మానవ మనుగడకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే అందరికీ అంతరిక్షంలోకి వెళ్లాలని కోరిక ఉన్నా కాని అది నెరవేరాలంటే కష్టంతో కూడుకున్నదే. కాని ఈ జంతువులు మాత్రం మీ కన్నా మేమే ముందు అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాం చూడమంటూ సవాల్ విసురుతున్నాయి. మరి సవాల్ విసురుతున్న ఆ జంతువులను చూడండి.

Read more: మార్స్ మీద మంకీ చక్కర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్షాన కుక్కలు

లైకా అనే ఆడ కుక్కను స్పుత్నిక్‌2 రాకెట్‌ ద్వారా నవంబరు 3 1957న గగనతలంలోకి పంపారు. కానీ దానిని వెనుకకు రప్పించే మార్గం కుదరలేదు. 10 రోజుల పయనం తరువాత అది చనిపోయింది. మానవుడు వెళ్లడానికి ముందు మరిన్ని జంతువులను పంపారు.

అంతరిక్షాన కుక్కలు

ఆ దశలోనే బెల్కి, స్ట్రెల్కా అనే కుక్కలు 19 ఆగస్టు 1960లో అంతరిక్షయానం చేసి పూర్తి ఆరోగ్యంగా భూమికి తిరిగివచ్చాయి. వాటిలో స్ట్రెల్కా అనే కుక్క 6 పిల్లలను కన్నది. అందులో ఒక దానిని అప్పటి యుఎస్‌ ప్రెసిడెంట్‌ అయిన జాన్‌ ఎఫ్‌.కెనడీ కి ఇవ్వబడింది.

అంతరిక్షంలో పిల్లులు

18 అక్టోబరు, 1963లో వెరానిక్‌ ఎజి1 అనే ఫ్రెంచి రాకెట్‌లో ఫెలిక్స్‌ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపి పారాచూట్‌ ద్వారా భూమికి సురక్షితంగా తీసుకువచ్చారు. 

అంతరిక్షంలో పిల్లులు

50 సంవత్సరాల తర్వాత ఇరాన్ ప్రభుత్వం పెర్షియన్ పిల్లులను 2014లోకి అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు కూడా చేసింది.

అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన ఎలుకలు

రోదసికి వెళ్లే మనుషులను ఆస్ట్రోనాట్లు(వ్యోమగాములు) అంటాం గదా.. అలాగే.. అంతరిక్షానికి వెళ్లిన ఎలుకలే ఈ మౌస్ట్రోనాట్లు! అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఆదివారం నింగికి బయలుదేరిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో బయలుదేరిన 20 ఎలుకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయి.

నాసాతో నాలుగో కాంట్రాక్టులో భాగంగా స్పేస్‌ఎక్స్ కంపెనీ ..

ఫాల్కన్ రాకెట్ ద్వారా రోదసికి చేరిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఐఎస్‌ఎస్‌కు చెందిన రోబోటిక్ చేయి ద్వారా వ్యోమగాములు అనుసంధానం చేసుకున్నారు. నాసాతో నాలుగో కాంట్రాక్టులో భాగంగా స్పేస్‌ఎక్స్ కంపెనీ పంపిన ఈ రాకెట్‌లో 20 ఎలుకలతో పాటు వ్యోమగాములకు అవసరమైన ఫ్రీజ్-డ్రైడ్ మీల్స్, 3డీ ప్రింటర్, ఇతర పరికరాలు మొత్తం 2,200 కిలోల బరువైన సరుకుల్ని పంపారు.అయితే.. మనిషి కాకుండా ఇతర క్షీరదాలను ఐఎస్‌ఎస్‌కు పంపడం ఇదే తొలిసారి. రోదసిలో గురుత్వాకర్షణ లేమిలో కండరాల క్షీణతపై ప్రయోగాలు జరిపేందుకు గాను ఈ ఎలుకలను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపింది.

భూమిపై మనుషుల్లో కండర క్షీణత సమస్యకు ..

కండరాలు క్షీణించేందుకు కారణమయ్యే ‘మజిల్ రింగ్ ఫింగర్-1' జన్యువును తొలగించిన ఈ ఎలుకలు ఐఎస్‌ఎస్‌లో నెలపాటు ఉంటాయి. వీటిపై రోదసిలో ప్రయోగాల ద్వారా.. భూమిపై మనుషుల్లో కండర క్షీణత సమస్యకు పరిష్కారం, మందులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

అంతరిక్షాన చేపలు

2012 సంవత్సరంలో జపాన్ తప జపనీస్ htv-3లో చేపలతో నిండిన ఆక్వేరియంను తీసుకెళ్లింది. దీనిని మేడ్కా అని వారు పిలుచుకున్నారు. వారు చేపల మీద రకరకాల ప్రయోగాల్లో భాగంగా వాటిని అంతరిక్షంలోకి పంపారు. వాటిని అక్కడికి పంపండం ద్వారా అవి అక్కడ ఎలా ఈదుతున్నాయి. వాటికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నదానిపై శోధన చేసేందుకు వీలుగా వాటిని పంపారని తెలుస్తోంది.

కోతి కార్యాలు :

ఏబిల్‌, బేకర్‌ అనే రెండు కోతులు 28 మే 1959లో అంతరిక్షాన అడుగుపెట్టాయి. కానీ అవి భూమికి తిరిగిరాలేదు. 

20 నవంబర్‌ 1961లో ఒక మగ చింపాంజీ..

తరువాత 20 నవంబర్‌ 1961లో ఒక మగ చింపాంజీ భూమి కక్ష్యను రెండుసార్లు చుట్టి వచ్చి సురక్షితంగా భూమిని చేరింది. తరువాత ఎన్నో చింపాంజీలు, కోతులు అంతరిక్షయానం చేశాయి.

మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువు కోతి

అయితే మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువు కోతి. దానిని 1948లో ''ఆల్‌బర్ట్‌ 1'' అనే పేరు మీద పంపారు. కానీ అదీ, దాని సహచరి అయిన ఇంకో కోతి టెస్టుల సమయంలో మరణించాయి. తరువాత మళ్ళీ సెప్టెంబరు 20, 1951లో ఒక కోతి, 11 ఎలుకలను యుఎస్‌ ఏరోబీ రాకెట్‌లో పంపి సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. వీటి ద్వారా అక్కడి రేడియేషన్‌, గురుత్వాకర్షణ లేమిని గ్రహించారు.

చింపాంజీలు

1959లో హమ్ అనే చింపు మొట్ట మొదటిగా అంతరిక్ష యానం చేసింది. ఈ చింపు చాలానే ట్రైనింగ్ తీసుకుని అంతరిక్షంలో అడుగుపెట్టింది. ఆకాశంలో తినేందుకు బనానాని ఈ చింపుకి ఇచ్చారు. మెర్కూరి రెడ్ స్టోన్ 2లో ఫ్లోరిడా నుంచి జనవరి 31 1961న ఘనంగా ఈ చింపు అంతరిక్షంలోకి అడుగుపెట్టింది.

అంతరిక్షంలోకి జంతువులను పంపేందుకు మార్గదర్శిగా ..

భూమికి క్షేమంగా కూడా తిరిగి వచ్చింది. అయితే నార్త్ కాలిఫోర్నియాలో ఉంటూ తన 26వ ప్రాయంలో ఈ చింపు చనిపోయింది. అయితే ఈ చింపునే అంతరిక్షంలోకి జంతువులను పంపేందుకు మార్గదర్శిగా నిలిచింది.

ఎగిరిన కప్పలు:

9నవంబర్‌ 1970లో కప్పలను భూమి కక్ష్యకు తీసుకునివెళ్ళారు. తరువాత 10 డిసెంబరు 1990లో తమోహిరో అకియామా అనే జపనీస్‌ జర్నలిస్ట్‌ 6 పచ్చ కప్పలను సోవియట్‌ మిర్‌ స్పేస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళి గురు త్వా కర్షణ లేమిపై పరిశోధన చేశారు.  

అంతరిక్షం నుంచి దూకుతూ కెమెరాకు..

అయితే అంతరిక్షం నుంచి కిందకి వస్తున్న సమయంలో అనుకోకుండా రాకెట్ కాలిపోవడంతో ఓ కప్ప అంతరిక్షం నుంచి దూకుతూ కెమెరాకు చిక్కింది. ఇక ఆ తర్వాత ఎన్నో కప్పలు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాయి.

నులి పురుగులు

ఈ నులి పురుగులు కూడా అనేక సార్లు అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి వచ్చాయి. అపోలో మిషన్ 16లో ఈ నులి పురుగులు ఆకాశంలోకి యాత్రను చేసి వచ్చాయి. 2003లో అంతరిక్షం నుంచి భూమికి వస్తున్న స్పేస్ శాటిలైట్ కాలిపోయిన విషయం విదితమే..అందులో ఉన్న ఏడుగురు వ్యోమగాములు చనిపోయారు . అయితే అందులో నులి పురుగుల ఆశ్చర్యంగా బతికి ఉన్నాయి.

వాటర్ బీర్స్

అంతరిక్షంలో గాలి అనేది ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. అక్కడ ఆక్సిజన్ అసలే దొరకదు.అయినప్పటికీ శాస్ర్తవేత్తలు వాటర్ బీర్స్ ని ఆకాశంలోకి పంపారు.యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పోటోన్ m-3మిషన్ లో వీటిని తీసుకెళ్లింది. ఇవి అక్కడ కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటాయనే విషయం విదితమే. అందుకే వీటిని ఆకాశంలోకి పంపారు.

సాలీడ్ల జోరు

అరబెల్లా అని పిలుచుకునే సాలీడుని 28 జులై 1978లో స్కైలాబ్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళారు. అక్కడ ఈ సాలీడు60 రోజులు గడిపింది. గురుత్వాకర్షణ లేమిలో సాలీడు వాటి తాడులను ఏవిధంగా పెంపొందించుకుంటాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధనను నిర్వహించారు.

అంతరిక్ష జంతువుశాల

17 ఏప్రిల్‌ నుండి 3 మే 1998 వరకు జంతుశాలను మొత్తాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళారు. ఈ ప్రయోగాన్ని ఎస్‌టిఎస్‌-90 గా పిలుస్తారు. దానిలో 170 చుంచులను, 18 ఎలుకలను, 229 చేపలను, 135 నత్తలను, 1514గుడ్లను, లార్వాలను తీసుకు వెళ్ళారు.

పురుగులకేం తక్కువ

1ఫిబ్రవరి 2003న కొలంబియా ఎస్‌టిఎస్‌-107 ద్వారా ఒక క్యాను నిండా రకరకాల పురుగులను తీసుకొని అంతరిక్షానికి వెళ్లారు. ఈ పరిశోధన మిశ్రమ ఫలితాలను చూపించింది. ఈ విధంగా అంతరిక్ష యానానికి మానవులు, జీవరాశి ఎలా తట్టుకో గలదు అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.

సోవియట్ కాస్మోనాట్ యూరిగగారిన్ తొలిసారిగా ..

1961 ఏప్రిల్ 12 న సోవియట్ కాస్మోనాట్ యూరిగగారిన్ తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. ఇతని తర్వాత ఇక ఒకరికొకరు అన్నట్లు అందరూ ఆకాశంలోకి చక్కర్లు కొట్టారు. మనుషులు జంతువులు అన్నీ ఆకాశాన్ని చుట్టేశాయి.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 10 animals launched into space
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot