మార్స్ మీద మంకీ చక్కర్లు

Written By:

ఇప్పటిదాకా మార్స్ మీదకి మనుషులు మాత్రమే వెళ్లారు..అక్కడి రహస్యాలను చేధించారు అయితే. ఇప్పుడు మనుషుల కాకుండా అంతరిక్షంలోకి కోతులను పంపి అక్కడి రహస్యాలను తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం భారీగానే ఆ కోతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక అక్కడ మానవ నివాసానికి అవసరమయ్యే దానికోసం ఎప్పటి నుంచో నాసా తన ప్రయోగాలు చేస్తోంది. అయితే ఈ దశలో ముందుగా అక్కడికి కోతులను పంపి అక్కడి వాతావరణానికి మనుషులు ఎలా అలవాటు పడతారనే విషయం తెలుసుకోనున్నారు. వీటికి ఇప్పటినుంచే ట్రైనింగ్ ఇస్తున్నారు.

Read more: 21వ శతాబ్దాన్ని నడిపించే ఆవిష్కరణలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అక్కడికి ముందుగా కోతులను పంపే ఏర్పాట్లు..

ఎప్పటి నుంచో మార్స్ పై మానవులు నివసించేందుకు వీలుందనే కథనాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ కథనాలను నిజం చేసేందుకు అక్కడికి ముందుగా కోతులను పంపే ఏర్పాట్లు చేస్తున్నారు రష్యా శాస్ర్తవేత్తలు.

రష్యన్ అకాడమీ ఆప్ సైన్స్ లో రోజు ట్రైనింగ్ ..

అందుకోసం ఈ కోతులకు రష్యన్ అకాడమీ ఆప్ సైన్స్ లో రోజు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు కోతులను సెలక్ట్ చేసుకున్నారు రష్యన్ శాస్ర్తవేత్తలు వారు ప్రతి రోజు ట్రైనింగ్ ఇస్తూ మార్స్ మీదకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ట్రైనింగ్ లో వాటికి జాయ్ స్టిక్స్ ఎలా..

ఈ ట్రైనింగ్ లో వాటికి జాయ్ స్టిక్స్ ఎలా పట్టుకోవాలి అలాగే పజిల్స్ ని ఎలా సాల్వ్ చేయాలి,అనే అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రెండు సంవత్సరాల్లో ఈ కోతులు మార్స్ మీద అడుగుపెట్టనున్నాయి.

1980లోనే స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వల్ల..

ఈ ప్రోగ్రాంను 1980లోనే స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు దీనిపై పూర్తి స్థాయి దృష్టిని కేంద్రీకరించినట్లు ఆ శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

మంకీస్ నూ కూడా సెలక్ట్ చేసి మరీ..

అయితే ఈ మంకీస్ నూ కూడా సెలక్ట్ చేసి మరీ తీసుకున్నారు..మంకీ ఫామ్ హౌస్ కెళ్లి అక్కడ వివిధ రకాల కోతులను పరిశీలించిన తరువాతే ఈ నాలుగు కోతులను సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది.

జ్ఞానపరమైన సామర్ధ్యాలు మరియు వాటి లెర్నింగ్ నైపుణ్యాలు..

ఈ తాజా అధ్యయనంలో జ్ఞానపరమైన సామర్ధ్యాలు మరియు వాటి లెర్నింగ్ నైపుణ్యాలు ఇలా అన్నింటిని దగ్గరుండీ మరీ శాస్త్రవేత్తలు పర్యవేక్షించిన తరువాతనే వీటిని మార్స్ మీదకి పంపేందుకు తీసుకున్నారు.

అంతరిక్షంలో వాటికవే ఆహరం తీసుకునేటట్లుగా ..

అయితే అంతరిక్షంలో వాటికవే ఆహరం తీసుకునేటట్లుగా వాటిని తయారు చేస్తున్నారు. స్టిక్ తో ఆహరం ఎలా తీసుకోవాలి..జ్యూస్ ని ఎలా తాగాలి అనే అంశాలపై బాగా ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

గణితానికి సంబంధించిన పజిల్స్ ని ..

గణితానికి సంబంధించిన పజిల్స్ ని ఇప్పుడు ఇవి త్వరగా పూర్తి చేగయలుగుతున్నాయట. చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాయట..వీటిల్లో గెలిచిన వాటికి అభినందనలు కూడా తెలుపుతున్నారట. అయితే ఇంకా అనేక రకాల ట్రైనింగ్ ల తరువాత వీటిని 2017 లో మార్స్ మీదకి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు.

మార్స్ మీద ఇవి ఎలాంటి ఫెర్ ఫార్మెన్స్..

మార్స్ మీద ఇవి ఎలాంటి ఫెర్ ఫార్మెన్స్ ఇస్తాయి. మనం ఇచ్చిన ట్రైనింగ్ వాటిని మార్స్ మీదకు తీసుకెళ్లగలుగుతుందా లేదా అనేది ఇప్పుడు సైంటిస్టులకు సవాల్ గా మారింది. అయితే వారు మాత్రం తప్పకుండా ఈ విషయంలో విజయం సాధిస్తమానే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం ఆరు నెలల పాటు ఈ నాలుగు కోతులు

మొత్తం ఆరు నెలల పాటు ఈ నాలుగు కోతులు మార్స్ మీద చక్కర్లు కొట్టనున్నాయని వారు చెబుతున్నారు. ఆరు నెలల పాటు వాటికవే అన్ని పనులు చేసుకునే విధంగా వాటిని తయారుచేస్తున్నారు.

మొట్ట మొదటిగా ఆల్బర్ట్ ( కోతి) 1 జూన్ 1948 న..

మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువుకోతి. దానిని 1948లో ''ఆల్‌బర్ట్‌ 1'' అనే పేరు మీద పంపారు. కానీ అదీ, దాని సహచరి అయిన ఇంకో కోతి టెస్టుల సమయంలో మరణించాయి.

తరువాతి సంవత్సరం సెకండ్ ఆల్బర్ట్ కూడా ..

తరువాత మళ్ళీ సెప్టెంబరు 20, 1951లో ఒక కోతి, 11 ఎలుకలను యుఎస్‌ ఏరోబీ రాకెట్‌లో పంపి సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. వీటి ద్వారా అక్కడి రేడియేషన్‌, గురుత్వాకర్షణ లేమిని గ్రహించారు.

ఫస్ట్ స్పేస్ ట్రిప్ ను పూర్తి చేసుకున్నది కూడా ఈ మంకీనే..

దీని తర్వాత మరో కోతి యిరిక్ 50 మైళ్ల దూరాన్ని అవలీలగా దాటేసింది. 11 ఎలుకలతో తన ప్రయాణాన్ని సాగించింది. ఫస్ట్ స్పేస్ ట్రిప్ ను పూర్తి చేసుకున్నది కూడా ఈ మంకీనే.

2030 కల్లా మార్స్ మీద మనుషుల నివాస యోగ్యానికి..

2030 కల్లా మార్స్ మీద మనుషుల నివాస యోగ్యానికి అనువైన ఏర్పాట్లను తయారుచేయాలనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇతర దేశాలకు వెళ్లినట్లుగానే పైకి కూడా మానవులు వెళ్లి వచ్చే విధంగా నాసా వ్యూహాలు రచిస్తోంది.

స్కాట్ కెళ్లీ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా..

ఇప్పటికే స్కాట్ కెళ్లీ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. అతని తమ్ముడు మార్క్ కెల్లీ కూడా అంతరిక్షంలో పని చేస్తున్నాడు. వీరు వచ్చే సంవత్సరం భూమి మీదకు రానున్నారు.సో అక్కడి వాతావరణం ఎలా ఉంది..శరీరం ఎలా సహకరిస్తోంది అనే అంశాలపై వారి మీద స్టడీ చేయనున్నారు.

దానిని వెనుకకు రప్పించే మార్గం ..

లైకా అనే ఆడ కుక్కను స్పుత్నిక్‌2 రాకెట్‌ ద్వారా నవంబరు 3 1957న గగనతలంలోకి పంపారు. కానీ దానిని వెనుకకు రప్పించే మార్గం కుదరలేదు. 10 రోజుల పయనం తరువాత అది చనిపోయింది.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Monkeys are heading to MARS: Russian scientists are training macaques to solve puzzles so they can travel to space in 2017
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more