హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

Written By:

పోటాపోటీగా విస్తరిస్తోన్న స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో రోజుకో కొత్త ఆవిష్కరణ కనువిందు చేస్తోంది. ముఖ్యంగా సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా, వన్‌ప్లస్, సోనీ, మైక్రోమాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కాలానుగుణంగా అప్‌డేటెడ్ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే
మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?

ముఖ్యంగా ఈ 2015 స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఎంతగానో గుర్తుండి పోతుంది. ఇందుకు కారణం.. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి అడుగుపెట్టడమే. ఈ ఏడాది మధ్యలో విడుదలై 2016లోనూ తమ ప్రభంజనాన్ని కొనసాగించనున్న 10 టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ నోట్ 5 ఎడ్జ్ 

సామ్‌సంగ్ తన నోట్ సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ నోట్ 5 ఎడ్జ్ ఫాబ్లెట్స్ ప్రత్యేకమైన మెటాలిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి. శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో వచ్చిన ఫాబ్లెట్‌లలో S-Pen stylus ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

యాపిల్ ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్

ఈ ఏడాది యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌లు ప్రపంచపు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి. సరికొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ డివైస్‌లు 2016లోనూ తమ సత్తాను చాటుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

వన్‌ప్లస్ 2 

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా 2015లో విడుదలైన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ వన్‌ప్లస్ 2 మార్కెట్లో విజయవంతంగా రన్ అవుతోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇంకా పనితీరు పరంగా ఈ ఫోన్ మంచి మార్కులే కొట్టేసుంది. 2016లోనూ ఈ ఫోన్ హవా కొనసాగే అవకాశముంది.

 

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

గూగుల్, హువావీ నెక్సుస్ 6పీ 

గూగుల్, హువావీ కాంబినేషన్‌లో విడుదలైన నెక్సుస్ 6పీ స్మార్ట్‌ఫోన్ ప్రపంచపు శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. 2కే రిసల్యూషన్ తో కూడిన 6 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ ప్రాసెనర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో వంటి అత్యాధునిక స్పెక్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. నెక్సుస్ 6పీ

 

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

మోటరోలా మోటో ఎక్స్ ప్లే 

మోటరోలా మోటో ఎక్స్ ప్లే స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

10 హాట్ స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

గూగుల్, ఎల్‌జీ నెక్సుస్ 5ఎక్స్ 

ఫింగర్ ఫ్రింట్ స్కానర్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్స్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 12.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెర విత్ డ్యుయల్ టోన్ అండ్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైపీ - సీ, 4జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

వన్‌ప్లస్ ఎక్స్ 
5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆధారం), క్వాల్కమ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.3గిగాహెర్ట్జ్), 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, 2525 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

మైక్రోమాక్స్ యు యుటోపియా 
యుటోపియా ఫోన్ స్పెక్స్‌ ఈ విధంగా ఉన్నాయి.. 5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 565 పీపీఐ), ప్యూర్ బ్లాక్ టచ్ ప్యానల్, ఓజీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఫేస్‌డిటెక్ట్ ఆటో ఫోకస్, 4కే రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ కస్టమ్ స్కిన్‌తో ఉన్న శ్యానోజెన్ మోడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టం, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ.

హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 
5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), 64 బిట్ ఆక్టా‌ కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 810 సాక్, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హాట్ 10 స్మార్ట్‌ఫోన్స్... 2016లోనూ సూపర్ డూపరే

మైక్రోసాఫ్ట్ లుమియా 950ఎక్స్ఎల్ 

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, తక్కువ వెళుతరులోనూ హై క్వాలిటీ ఫోటోలను షూట్ చేసుకునేందుకు ఆర్‌జీబి ఎల్ఈడి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ చేసుకునే విధంగా క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్),యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, వైర్ లెస్ చార్జింగ్. హై-ఫై ఆడియో రికార్డింగ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Smartphones of 2015 that will continue to hog limelight in 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot