ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

Posted By:

ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. అలాంటి వారి కోసం ఈ కథనం..

Read More : వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తోన్న 25 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల జాబితా విడుదలైంది. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతియ' కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని 2015కు గాను 10 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల జాబితాను గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ విడుదల చేసింది. ఆ లిస్ట్‌ను చూసేద్దామా మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌కు 56,040 ఉద్యోగులున్నారు. ప్రపంచపు 25 అత్యుత్తమ టెక్నాలజీ మల్టీనేషనల్ కంపెనీలలో గూగుల్‌కు మొదటి స్థానం నిలిచింది. గూగుల్ కంపెనీలలో పని వాతావరణంతో పాటు ఉద్యోగ వసతులు అత్యుత్తమంగా ఉంటాయి.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

SAS Institute (ఎస్ఏఎస్ ఇన్స్‌టిట్యూట్)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ డేటా ఎనలిటిక్స్ సంస్థల్లో ఒకటైన SAS Instituteకు రెండవ స్థానం లభించింది. ఉద్యోగులకు ఆన్‌సైట్ చైల్డ్ కేర్, హెల్త్ ఇంకా ఫిట్నెస్, ఫార్మసీ, సబ్సిడైజిడ్ మీల్స్ వంటి సదుపాయాలను ఈ సంస్థ కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నఉద్యోగుల సంఖ్య 13,742.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

నెట్‌యాప్ (NetApp)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో నెట్‌యాప్ సంస్థకు 3వ స్థానం లభించింది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 12,810.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

టెలిఫోనికా (Telefonica)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ టెలిఫోనికాకు 4వ స్థానం లభించింది. స్పెయిన్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈ సంస్థకు 1,23,700 మంది ఉద్యోగులున్నారు.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

ఈఎమ్‌సీ (EMC)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ డేటా స్టోరేజ్ సంస్థ ఈఎమ్‌సీకి 5వ స్థానం లభించింది. ఇటీవల ఈ కంపెనీని డెల్ 67 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఉద్యోగుల సంఖ్య 70,000

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

మైక్రోసాఫ్ట్

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు 6వ స్థానం లభించింది. ఉద్యోగులకు ఈ కంపెనీ కల్పిస్తోన్న వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,28,000 ఉద్యోగులు ఉన్నారు.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

ఆటోడెస్క్ (Autodesk)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ 3డీ డిజైన్ సంస్థ ఆటో‌డెస్క్‌కు 7వ స్థానం లభించింది. ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 8,823.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

సిస్కో (Cisco)
ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో సిస్కో (Cisco)కు 8వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకున్న ఉద్యోగుల సంఖ్య 70,112.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

అటింటో (Atento)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ సంస్థ అటింటో (Atento)కు 9వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకున్న ఉద్యోగుల సంఖ్య 150,000.

 

ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

కాడిన్స్ డిజైన్ సిస్టమ్స్ (Cadence Design Systems)

ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ప్రముఖ ఎలక్ట్రానిక్ డిజైన్ సంస్థ కాడిన్స్ డిజైన్ సిస్టమ్స్‌కు 10వ స్థానం లభించింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 best tech MNC workplaces in the world. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot