లక్షల జీతాలందించే బెస్ట్ కొలువులు

Written By:

టెక్ పట్టా చేతికి రాగానే ఇక లక్షల సాలరీల కోసం అందరూ పరుగులు పెడతారు..కంపెనీలో జాబ్ కొట్టాలి సెటిలయిపోవాలి అని చాలామంది కుస్తీలు పడుతుంటారు కూడా..అదీగాక ఇవాళ రేపు టెక్నాలజీ రంగం ఎన్నో ఉపాధి అవకాశాలను దగ్గర చేస్తోంది. ఆసక్తికరంగా ఉండే పనితీరు, అధిక వేతనాలు,ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఈ రంగంలో లభిస్తున్నాయి. అయితే కొన్ని టెక్నాలజీ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాల కన్నామేలైనవంటున్నారు నిపుణులు సో వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : పట్టా ఉన్నా టెక్ ఉద్యోగాలకు పనికిరారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్

సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ డిజైన్ చేయడం వీరి విధి. డిజైన్ అయిన అప్లికేషన్స్ ను వివిధ సంస్థలకు ఉపయోగపడేలా వాటిని పర్సనలైజ్ చేయడమూ వీరి బాధ్యత. ఈ విభాగంలో నిష్ణాతులైతే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఇందులో సగటు వేతనం 1.30 లక్షల డాలర్లు ఉంటుంది. జాబ్ స్కోరు దాదాపు 4.2. ఇక కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.4. జాబ్ ఓపెనింగ్స్ 653 దాకా ఉన్నాయి.

యూఎక్స్ డిజైనర్

ఓ సాప్ట్ వేర్ తయారైన తర్వాత వీరి పని మొదలవుతుంది. అది ఎంత వరకూ పనిచేస్తుంది. వినియోగదారులకు ఏ మాత్రం ఉపకరిస్తుంది. తదుపరి పనితీరును మొరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్నది వీరి పని.వీరి సగటు వేతనం 91,800 డాలర్లు. జాబ్ స్కోరు 4.3 అవకాశాల రేటింగ్ 3.6.జాబ్ ఓపెనింగ్స్ 862

క్యూఎ మేనేజర్

సగలు వేతనం 85 వేల డాలర్లు,జాబ్ స్కోరు 4.4 అవకాశాల రేటింగ్ 3.4. సాప్ట్ వేర్ తయారీకి ముందు నిర్దేశించుకున్న పనితీరును చేరుకుందా..లేదా అన్నది పరిశీలించడం వీరి పని. ఈరంగంలో ప్రమోషన్లు ఉంటాయి.జాబ్ ఓపెనింగ్స్ 3,749

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్

సగటు వేతనం 1.35 లక్షల డాలర్లు, జాబ్ స్కోరు 4.4,కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.4. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ల్లో వీరి పాత్ర చాలా కీలకం. సమర్థవంతంగా పనిచేస్తారనుకుంటే వీరికి ఎంత మొత్తాన్నైనా ఆఫర్ చేసేందుకు కంపెనీలు వెనుకాడవు.జాబ్ ఓపెనింగ్స్ 1199

అనలిటిక్స్ మేనేజర్

సగటువేతనం: 1.05 లక్షల డాలర్లు కాగా జాబ్ స్కోరు 4.5గా ఉంది. కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.7దాకా ఉంది.విశ్లేషణా సేవలందించే సాఫ్ట్ వేర్ ను నిర్వహించడం వీరి విధి. కంపెనీల సమస్యలను తీరుస్తూ వారి అన్ని రకాల గణాంకాలను మధించి నివేదికలు తయారుచేయడంతో పాటు అత్యధిక సమాచారాన్ని దాచిపెట్టే సర్వర్ల నిర్వహాణ వీరి బాధ్యతే.జాబ్ ఓపెనింగ్స్ 982

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

జాబ్ స్కోరు 4.5 కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.3. ఇక సగటు వేతనం 95వేల డాలర్లు. అయితే ఇది బేసిక్ జాబు. కంప్యూటర్ ప్రోగ్రామర్లుగా వీరు పనిచేయాల్సి ఉంటుంది.సంస్థలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలూ వీరే మోయాల్సి ఉంటుంది.జాబ్ ఓపెనింగ్స్ 49,270

మొబైల్ డెవలపర్

సగటు వేతనం 90 వేల డాలర్లు. జాబ్ స్కోరు: 4.6 కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.8. ఇది మరో హాట్ జాబ్. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన వేళ మొబైల్ యాప్స్ తయారుచేయడం,స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచడం వీరి ఉద్యోగంలో భాగం.జాబ్ ఓపెనింగ్స్ 2251

సొల్యూషన్ ఆర్కిటెక్

సగటు వేతనం: 1.19 లక్షల డాలర్లు. జాబ్ స్కోరు: 4.6. కెరీర్ లో అవకాశాల రేటింగ్ : 3.5. ఐటీ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైన,భారీ డిజైనింగ్ లను తయారుచేసి కస్టమర్లకు అందించే ప్రక్రియలో వీరి కీలక పాత్ర వహిస్తారు.జాబ్ ఓపెనింగ్స్ 2,906

డేటా సైంటిస్టులు

సగటు వేతనం: 1.16 లక్షల డాలర్లు. జాబ్ స్కోరు 4.7. కెరీర్ లోఅవకాశాల రేటింగ్ 4.1. యాజమాన్యాలకు ,క్లయింట్లకు మధ్య వారధి. వారికనుగుణంగా డేటాను క్రోడీకరించడం,ఆపై సమాచార విశ్లేషణ చేపి లోటుపాట్లను గుర్తించడం,పనితీరు మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.జాబ్ ఓపెనింగ్స్ 1736.

ప్రొడక్ట్ మేనేజర్

సగటు వేతనం 106.680 డాలర్లు, జాబ్ స్కోరు 4.5 కాగా కెరీర్ లో అవకాశాల రేటింగ్ 3.3 గా ఉంది. ఉత్పత్తులకు సంబంధించి మేనేజింగ్ చేయడం ఇతని బాధ్యత. జాబ్ ఓపెనింగ్స్ 6,607 దాకా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 best technology careers for 2016
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot