పట్టా ఉన్నా టెక్ ఉద్యోగాలకు పనికిరారు

Written By:

ఇంజనీరింగ్ చదువు చదివి చాలామంది మేము పెద్ద ఇంజనీర్లు అవుతాం..లక్షల్లో జీతాలు తీసుకుంటా అనేవారికి నిజంగా ఇది చేదులాంటి వార్తే...దేశంలో చాలామందికి ఇంజనీరింగ్ పట్టా ఉన్నా వారు ఉద్యోగాలకు పనికిరారట. ఎన్నో ఉద్యోగాలున్నా కాని ఆ ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యం వీరి వద్ద లేదని ఓ సర్వే తేల్చి చెప్పింది. దేశంలో దాదాపు 80 శాతం మంది పట్టా ఉన్నా వారు ఏ ఉద్యోగానికి పనికిరారని సర్వే నిజాలను నిగ్గు తేల్చింది.

Read more: టాప్ హెడ్స్ అవుట్ : కష్టాల్లో ఆపిల్ కంపెనీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాస్తవంలో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా

దేశానికి బలమెవరంటే టక్కున చెప్పే సమాధానం యువతేనని.. అందుకే మరిన్ని స్టార్టప్ లు రావాల్సిన అవసరం ఉందని మన ప్రధాని మోడీ పదేపదే చెబుతుంటారు. తమ ప్రసంగాల్లో అదరగొడుతుంటారు. అయితే వాస్తవంలో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయట.

చేయడానికి బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నా

చేయడానికి బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నా మన పట్టభద్రుల్లో చాలామందికి వాటిని అందుకోగలిగే ప్రమాణాలు లేవని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేల్చి చెబుతున్నాయి. తాజాగా.. ‘యాస్పైరింగ్‌ మైండ్స్‌' విడుదల చేసిన ‘నేషనల్‌ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్‌' కూడా ఇదే తేల్చి చెప్పింది!

దేశంలో విద్య, శిక్షణ నాణ్యతాప్రమాణాలు

దేశంలో విద్య, శిక్షణ నాణ్యతాప్రమాణాలు మరింతగా పెరగాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. దేశంలోని ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 80ు మంది ఉద్యోగాలకు పనికిరారని ఆ నివేదిక స్పష్టం చేసింది.

ఇదేం అల్లాటప్పా అధ్యయనం కాదు.

ఇదేం అల్లాటప్పా అధ్యయనం కాదు. ఇందులో భాగంగా ఆ సంస్థ 2015లో దేశంలోని 650 కళాశాలల నుంచి ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన లక్షన్నర మంది విద్యార్థులను పరిశీలించి మరీ ఈ నివేదిక ఇచ్చింది.

మన విద్య నాణ్యత ప్రమాణాలను పెంచడంతో పాటు

మన విద్య నాణ్యత ప్రమాణాలను పెంచడంతో పాటు, మన అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములను మరింత ఉద్యోగ ప్రధానంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది'' అని యాస్పైరింగ్‌ మైండ్స్‌ సీటీవో వరుణ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

నిజానికి మనదేశంలో పట్టభద్రుల కొరత లేదు

నిజానికి మనదేశంలో పట్టభద్రుల కొరత లేదు. కానీ, వారిలో నాణ్యతాప్రమాణాలే కరవవుతున్నాయి. ఏటా దేశవ్యాప్తంగా వేలాది కళాశాలలు, విద్యాసంస్థల నుంచి లక్షలాదిగా పట్టభద్రులు బయటికొస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు మాత్రం వారికి తమ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో చేరడానికి అవసరమైన నైపుణ్యాలు లేవని చాలాకాలంగా ఫిర్యాదు చేస్తున్నాయి.

నగరాలవారీగా చెప్పుకోవాలంటే.

నగరాలవారీగా చెప్పుకోవాలంటే.. మనదేశంలో మిగతా నగరాల కన్నా ఎక్కువగా ఢిల్లీ పట్టభద్రుల్లో మంచి ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని యాస్పైరింగ్‌ మైండ్స్‌ నివేదిక పేర్కొంది. తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది.

పట్టభద్రులకు ఉద్యోగాల విషయంలో

పట్టభద్రులకు ఉద్యోగాల విషయంలో లింగ వివక్ష లేదని పేర్కొన్న నివేదిక.. సేల్స్‌ ఇంజనీర్లు, నాన్‌-ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, బీపీవో రంగాల్లో మాత్రం మహిళా ఉద్యోగినులు ఎక్కువని తెలిపింది.

టైర్‌-3 నగరాల్లో చదివే విద్యార్థుల్లో

టైర్‌-3 నగరాల్లో చదివే విద్యార్థుల్లో మెరుగైన ప్రమాణాలు ఉండవన్న అపోహకు ఈ నివేదిక చెక్‌ పెట్టింది. ఆ నగరాల్లో కూడా మంచి ఉద్యోగ నైపుణ్యాలున్న ఇంజనీర్లు తయారవుతున్నారని.. నియామకాల్లో ఈ కోణాన్ని మరువకూడదని కార్పొరేట్‌ సంస్థలకు సూచించింది. ఆ విద్యార్థులు ఐటీ సంస్థల్లో ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో నియామకాలకు అర్హులేనని పేర్కొంది.

ఇది ఉద్యోగాల కోసం కుస్తీలు పడే అభ్యర్థులకు

ఇది ఉద్యోగాల కోసం కుస్తీలు పడే అభ్యర్థులకు ఇది నిజంగా చెంప పెట్టులాంటిదే మరి. వారు తమ నాణ్యతా ప్రమాణాలు ఏ మేర ఉన్నాయో చెక్ చేసుకోవాలి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Over 80 percent of engineering graduates in India unemployable Study
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot