భారత్‌లో దొరకని వస్తువులు ఇవే

By Hazarath
|

ఇది గాడ్జెట్ల యుగం. ఎన్నో వినూత్న గాడ్జెట్జు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. మరెన్నో కొత్తవి తయారవుతున్నాయి. అమెరికా ,ఆస్ట్రేలియా,బ్రిటన్ తదితర దేశాల్లో మార్కెట్లోకి వచ్చేసిన ఎన్నో గాడ్జెట్లు ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. వీటి గురించి తెలుసుకోవడం,రివ్యూలు చదివి మనకూ అందుబాటులో ఉంటే బాగుండునని కోరుకుంటున్న భారత గాడ్జెట్ ప్రియులెందరో.ఈ నేపథ్యంలో ఇండియాకు రాని ప్రాచుర్యం పొందిన గాడ్జెట్ల వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఏ క్షణంలోనైనా శకలాలు భూమిని ఢీ కొట్టవచ్చు

1. హెర్క్యులస్ మోషన్ కెమెరా
 

1. హెర్క్యులస్ మోషన్ కెమెరా

ఫోటోగ్రఫీ,ఫిల్మ్ మేకింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ప్రపంచంలోని అతి చిన్న కదిలే కెమెరా ఇది. జేబులో పెట్టుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో నియంత్రించుకోవచ్చు. కేవలం 110 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

2. యాంపీ వాక్ అండ్ చార్జ్

2. యాంపీ వాక్ అండ్ చార్జ్

ఇది మోషన్ చార్జర్.నడుస్తూ ఉంటే చార్జింగ్ అవుతుంది. ఓ గంట పాటు సైకిల్ తొక్కినా ఓ 10 వేల అడుగులు నడిచినా పూర్తిగా చార్జింగ్ అవుతుంది. గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సూత్రంతో తయారైన దీని ధర 100 డాలర్లు (సుమారు రూ. 6500)

3. స్కైబడ్స్

3. స్కైబడ్స్

ఇవి వైర్ లెస్ ఇయర్ బడ్స్.ఎప్పుడో చూసిన ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తరువాత వచ్చిన ఆలోచనలతో ఇవి తయారయ్యాయి. స్మార్ట్ ఫోన్ కు ఏ విధమైన అటాచ్ మెంట్ లేకుండా వీటిని వాడుకోవచ్చు. ఇన్ బిల్ట్ బ్యాటరీ కూడా వీటిలో ఇమిడి ఉంటుంది. చెవిలో సులువుగా పెట్టుకుని వెళ్లిపోవచ్చు. దీని ధర 300 డాలర్లు (సుమారు రూ. 19,800)

4. పవర్ ఇన్ యువర్ ఫింగర్
 

4. పవర్ ఇన్ యువర్ ఫింగర్

మీ వేలికి ఉంగరంలా తొడుక్కుని స్మార్ట్ ఫోన్ ను నియంత్రించగల వినూత్న గాడ్జెట్ .దీని పేరు రింగ్ .ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. పిక్షర్ తీసుకోవడం నుంచి మ్యూజిక్ ను ప్లే చేయడం వంటి ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తాకకుండా దీని ద్వారా చేసుకోవచ్చు. ఒకసారి చార్జింగ్ తో మూడు రోజులు పనిచేసే దీని ధర 270 డాలర్లు ( సుమారు రూ. 17,800)

5. ట్రాక్ ఆర్ స్టిక్కర్

5. ట్రాక్ ఆర్ స్టిక్కర్

మీ బైక్ లేదా కారు కీస్ ,ఇంటితాళాలు,మరేదైనా అత్యవసర వస్తువు వంటివి ఎక్కడున్నాయో కనుక్కోవడం ఒక్కోసారి తలనొప్పి తెచ్చిపెడుతుంది. దీనికి సమాధానమే ట్రాక్ ఆర్ స్టిక్కర్. ఓ చిన్న నాణెం సైజులో ఇది ఉంటుంది. దీన్ని సులువుగా మీ వస్తువులకు తగిలించుకోవచ్చు. ఆపై అది ఎక్కడుందో మీ స్మార్ట్ ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు. ట్రాకర్ బటన్ నొక్కగానే పెద్దగా శబ్దం వినిపిస్తుంది. దీని ధర 25 డాలర్లు (సుమారు రూ. 1650)

6. పల్స్ కెమెరా

6. పల్స్ కెమెరా

ఈ కెమెరా సాయంతో మీ స్మార్ట్ ఫోన్ ని కంట్రోల్ చేయవచ్చు. ఇది ఫోటోగ్రాపర్లకు చాలా ఉపయోగకరమైన గాడ్జెట్. నైట్ షాట్ లు,ఫైర్ వర్క్ షోలు అలాగే గ్రూప్ ఫిక్షర్స్ తీసుకోవచ్చు. రిమోట్ సాయంతో కూడా షూట్ చేసే సౌకర్యం ఉంది.

7. ఫిరీ

7. ఫిరీ

దీన్ని ఉపయోగించి ఎక్కడైనా ఏదైనా రాసేయవచ్చు. అది డైరెక్టుగా మీ స్మార్ట్ ఫోన్లో చేతిరాత లేదా టైప్ట్ టెక్ట్స్ రూపంలో చేరిపోతుంది. ఓ పెన్నులా ఉండే ఈ గాడ్జెట్ కూడా బ్లూటూత్ సాయంతో పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆపీసు,వన్ నోట్,ఈవర్ నోట్ ,గూగుల్ హ్యాండ్ రైటింగ్,కీ బోర్డ్ తదితరాలకు కంపర్టబుల్, దీని ధర 190 డాలర్లు.(సుమారు రూ. 21560)

8. మోటోరోలా స్కౌట్ 5000

8. మోటోరోలా స్కౌట్ 5000

మీ పెంపుడు ఎక్కడున్నాయో కనిపెట్టి చెప్పే గాడ్జెట్ ఇది. దీన్ని ఓ బెల్ట్ సాయంతో జంతువుల మెడకు కడితే సరి. అందులోని జీపీఎస్,వైఫై,కెమెరా వంటి వాటిని స్మార్ట్ ఫోన్ తో నియంత్రించవచ్చు. ప్రస్తుతానికి యూఎస్ లో మాత్రమే అందుబాటులో ఉన్న దీని ధర 200 డాలర్లు ( సుమారు రూ. 13,200 )

9. ఆండిమో ఐక్యూ స్మార్ట్ లగేజి

9. ఆండిమో ఐక్యూ స్మార్ట్ లగేజి

ఇది లగేజి బ్యాగ్ తో పాటు మీకు వైఫై కనెక్టివిటీ స్టేషన్ లోపర్సనల్ ఛార్జర్ గా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ,ఐవోఎస్ డివైస్ లపై రన్ అవుతుంది. అయితే లగేజిలో ఉన్న వెయిట్ ను బట్టి ఇది కాలిక్యులేట్ చేస్తుంది. ఓవర్ వెయిట్ కి ఎయిర్ ఫోర్ట్ ల్లో ఫీజు ఉంటుంది మరి దీని ధర ( 300 డాలర్లు ( సుమారు రూ. 18,400)

10. క్వెల్

10. క్వెల్

మీరు జాగింగ్ చేస్తున్నప్పుడు మీరు పెయిన్ మరచిపోయే విధంగా ఇది మీకు సహకరిస్తుంది. కేవలం 15 నిమిషాల్లో మీ కండరాల నొప్పికి సంబంధించిన నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ఇది వాకింగ్ చేసేవేళ నొప్పితో బాధపడేవారికి మంచి యూజ్ పుల్ గాడ్జెట్ దీని ధర 250 డాలర్లు ( సుమారు రూ.16,530 )

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here write 10 Cool Gadgets We Want To See In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X