ఏ క్షణంలోనైనా శకలాలు భూమిని ఢీ కొట్టవచ్చు

Written By:

అంతరిక్షంలో ఎన్నో వ్యర్థాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు గిరగిరా తిరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు భూమి మీదకు విరుచుకు పడతాయో తెలియదు. ఒకవేళ భూమి మీదకు అవి విరుచుకుపడితే అతి పెద్ద వినాశనం సంభవిస్తుంది. వేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రతి వారం కాలం చెల్లిపోయిన అనేక వ్యర్థాలు ఆకాశం నుంచి అమితవేగంతో కంట్రోల్ చేయలేనంతగా భూమి పైకి దూసుకొస్తున్నాయి. అయితే చిన్న చిన్నవి కూడా భారీగానే భూమి మీదకు దూసుకువస్తున్నాయి. ఈ సందర్భంలో అవి కిందకు ఒక్కసారిగా దూసుకువస్తే ఏం జరుగుతుందో చూద్దాం.

Read more: గతి తప్పిన గొప్ప ఆవిష్కరణలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డబ్య్లూటీఎఫ్

డబ్య్లూటీఎఫ్

ఈ మధ్య ప్రపంచాన్ని వణికించింది. గుర్తు తెలియని వస్తువు భూమిని ఢీ కొట్టేందుకు వస్తోందని అది చరిత్రలో తన ఉనికి ని పోగోట్టుకున్నదని దానికి డబ్య్లూటీఎప్ అని పేరు పెట్టామని నాసా సైంటిస్టులు తెలిపిన విషయం విదితమే. దీనిపై ఆరిజోనా వర్శిటీలోని కాటలినా స్కై సర్వే సెంటర్ వారు రీసెర్చ్ చేస్తున్నారు. నవంబర్ 13న భూమిని ఢీకొట్టేందుకు రెడీ అయిందని వదంతులు కూడా వచ్చాయి.

దీని గురించి అసలు తెలుసా

దీని గురించి అసలు తెలుసా

ఆకాశంలో ఒకటి నుంచి 10 వేల వరకు సైజు గల స్పేస్ జంక్ లు చక్కర్లు కొడుతున్నాయి. వీటల్లో హల్లో అనే ఫ్లాట్ ప్యానల్ తన ఉనికిని కోల్పోయింది. పాత ఇందనం ట్యాంక్ లాగా ఉంటుంది ఈ స్పేస్ జంక్. ఇది 2009 నుంచి భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇది ఏ క్షణంలో భూమిని తాకవచ్చని స్పుత్నిక్ ఎరా అకాడమికి చెందిన ప్రెట్టి స్లిమ్ అనే రీసెర్చ్ తెలిపారు.

డేంజరస్ జంక్

డేంజరస్ జంక్

డబ్ల్యూటీఎప్ 1190ఎఫ్ అనేది రెండు నుంచి మూడు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. ఇవి చాలా చిన్నవే కాని ఇవి కలిగించే నష్టం మాత్రం చాలా పెద్దది. దీని నుంచి విడివడిన అనేక శకలాలు గాలిలో అలా చక్కర్లు కొడుతూ ఏ క్షణంలోనైనా భూమి మీదకు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.

ఏదైనా ప్రమాదమే

ఏదైనా ప్రమాదమే

చిన్న సైజు స్పేస్ జంక్ ల గురించి కొంచెం జాగ్రత్తపడవచ్చు .కాని పెద్ద సైజులాంటివి వచ్చినప్పుడు వాటి ఆపడం సాధ్యం కాదు. సునామి విరుచుకుపడినట్లు ఒక్కసారిగా విరుచుకుపడతాయి. 1983లో వన్ మిల్లీ మీటర్ సైజు ఉన్న ఓ చుక్క ఆకాశంలో పయానిస్తున్న విమానం మీద పడింది.

దాని తరువాత మళ్లీ ఇంకోటి

దాని తరువాత మళ్లీ ఇంకోటి

ఇది ఇంకా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. భయంకరమైన స్పేస్ జంక్ పామ్ డీని సౌదీ అరేబియాలో కనుగొన్నారు. ఇదే మనుషులపైన పడితే ఇక అంతే సంగతులు

ఇదొక భయంకరమైన జంక్

ఇదొక భయంకరమైన జంక్

డెల్టా 2 అనే స్పేస్ జంక్ జార్జిటౌన్ లో పడింది. ఇది 1997లో జరిగింది. ఇది జనసంచారం ఉన్న ప్రదేశంలో పడితే ఎలా అనే దానిపై ది యూరపియన్ స్పేస్ కాలిక్యులేట్ చేసింది. ఇది పడి ఉండే 1 నుంచి 100 బిలియన్ల ప్రజలు ప్రమాదానికి గురయ్యేవారని చెప్పింది.

ఇంకో రాయి

ఇంకో రాయి

ఇదొక రాయిలాగా ఉంది. కాని ఇది అల్యూమినియం ఆక్సైడ్ స్లాగ్ .సాలిడ్ రాకెట్ మోటర్స్ కోసం దీన్ని తయారు చేశారు. ఇది కూడా కాలం చెల్లిపోయి భూమి మీదకు దూసుకువస్తోంది.

ఇక చిన్న చిన్న మంటలెన్నో

ఇక చిన్న చిన్న మంటలెన్నో

ఇక చిన్న చిన్న చుక్కలు ఆకాశంలో చాలానే ఉన్నాయి. అవి కాలం చెల్లిపోయి భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏ క్షణంలోనైనా భూమిమీద పడే అవకాశం ఉంది.

ల్యాండ్ ప్రదేశం ఎక్కడ

ల్యాండ్ ప్రదేశం ఎక్కడ

మొన్న భూమి మీదకు దూసుకు వచ్చిన స్పేస్ జంక్ హిందూమహసముద్రంలో పడిపోయింది. సో మిగతావన్నీ అక్కడే పడతాయన్న గ్యారంటీ కూడా లేదు.

అది చాలా ప్రమాదమే

అది చాలా ప్రమాదమే

హిందూ మహసముద్రం గుండా రోజు వేలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్పేస్ జంక్ లు ఆ విమానాలపై పడితే పరిస్థితి ఏంటీ..? దేశ విదేశ విమానాలు రోజుకు 450 దాకా హిందూ మహసముద్రం మీదుగా పయనిస్తుంటాయని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

స్పేస్ జంక్ ల ప్యూచర్ ...?

స్పేస్ జంక్ ల ప్యూచర్ ...?

అన్ని డబ్య్లూటీఎప్ లాగే సేఫ్ గా సముద్రంలోకి పడతాయని ఊహిచలేము. కొన్ని పనిచేసే ప్రదేశాల్లో అలాగే ఎత్తైన భవనాల మీద ఇంకా ఎక్కడైనా పడే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. మరి శాస్త్రవేత్తలు వీటిని భూమి మీద పడేటప్పుడు గుర్తిస్తారా లేదా అన్నదే డౌటు.

వీటిని గుర్తించగలరా

వీటిని గుర్తించగలరా

ఇప్పుడు అంతరిక్షంలోకి ఈ స్పేస్ జంక్ లను గుర్తించే శాటిలైట్లను పంపే ఆలోచన చేస్తున్నారు. వాటిని గుర్తించి అవి ఎటువంటి నష్టం కలిగించని ప్రదేశాల్లో పడేలా ఈ శాటిలైట్లను రూపొందిస్తున్నారు. అంతరిక్షంలో దాదాపు 20 వేల వ్యర్థాలు ఉన్నాయని అంచనా

నెట్ ద్వారా ఈ స్పేస్ జంక్ లను

నెట్ ద్వారా ఈ స్పేస్ జంక్ లను

నెట్ ద్వారా ఈ స్పేస్ జంక్ లను గుర్తించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రణాళికలు రచిస్తోంది. వీటిని ఆకాశంలోనే పట్టుకుని భూమి మీదకు సేఫ్ గా తీసుకువచ్చేలా కొన్ని పరికరాలను ఈఎస్ ఎ తయారుచేస్తోంది.

మరొక సొల్యూషన్

మరొక సొల్యూషన్

ఆకాశం నుంచి దూసుకొస్తున్న ఈ స్పేస్ జంక్ లను గుర్తించి అది ఎక్కడ పడుతుందో అక్కడ అలర్ట్ చేయడం మరొక పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదిఏమైనా అవి ఎప్పుడు భూమి మీదకు విరుచుకుపడతాయో తెలియదు ఎవరి జాగ్ర్తతలో వారు ఉండటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Space junk What happens when it crashes back to Earth
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot