ఆ దేశాల్లో.. ఏం జరుగుతోంది?

Posted By:

పెవ్ రిసెర్చ్ సెంటర్ అనే సర్వే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 32 దేశాలకు సంబంధించి, ఆయా దేశాల్లో టెన్నాలజీని వినియోగించుకుంటున్న తీరు పై అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆవేంటో చూసేద్దామా మరి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నైజీరియా, ఘనా, బాంగ్లాదేశ్, ఉగాండాలలో కేవలం ఒక్క శాతం మంది జనాభా మాత్రమే ల్యాండ్‌లైన్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ దేశాల్లో సెల్‌ఫోన్‌ల పై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నైజీరియాలో 89శాతం మంది, ఘనాలో 83శాతం మంది, బాంగ్లాదేశ్ లో 76 శాతం మంది, ఉగాండాలో 65 శాతం మంది సొంత సెల్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు.

చైనాలో 52శాతం మంది నెటిజనులు ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు.

ఫిలిప్ఫియన్స్ దేశంలోని 92శాతం వయోజన ఇంటర్నెట్ యూజర్లు సోషల్ నెట్ వర్కింగ్ ను ఇష్టపడుతున్నారు.

భారత్ ఇంకా బాంగ్లాదేశ్‌లో ఉద్యోగాల చాలా మంది ఇంటర్నటె్ పై ఆధారపడుతున్నారు. బాంగ్లాదేశ్‌లో 62 శాతం మంది, భారత్‌లో 55 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు తమ ఉద్యోగం కోసం ఇంటర్నెట్ లో శోధించినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

18 నుంచి 34 సంవత్సరాల మ్యధ వయస్సు కలిగి ఉన్న 83 శాతం మంది థాయిలాండ్ నెటిజనులు ఇంటర్నెట్ ను అమితంగా ఇష్టపడుతున్నారట.

లెబనాన్‌లో అత్యధిక మంది నెటిజనులు రాజకీయల గురించి చర్చించుకునేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు.

ఉక్రెయిన్ దేశంలో ప్రతి 10 మంది ఇంటర్నెట్ యూజర్లలో 8 మంది ఆన్ లైన్ ద్వారా పొలటికల్ న్యూస్ ను చదివేందుకు ఇష్టపడుతున్నారు.

రష్యా దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది సొంత కంప్యూటర్ లను కలిగి ఉన్నారు.

వెనిజుల దేశానికి చెందిన అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ చేతిలోని హ్యాండ్‌సెట్‌ల ద్వారా ఫోటోలు ఇంకా వీడియోలను క్యాప్చుర్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

పోలాండ్ దేశంలో ప్రతి 10 మంది మహిళల్లో 6గురు వైద్య సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు తెలుసా: స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలామందికి బ్లూటూత్, వై-ఫైల గురించి పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది. ఇక వై-ఫై విషయానికొస్తే ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. వై-ఫై కనెక్టువిటీ గురించి 10 ఆసక్తిర వాస్తవాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

English summary
10 facts about technology use in the emerging world. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot