బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

Posted By:

ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో చోటు సంపాదించిన సిలికాన్ సిటీ బెంగూళురు పెద్ద తరహా ఐటీ కంపెనీలతో విరాజిల్లుతోంది. దేశంలో ఐటీ ఐకాన్‌గా పేరుగాంచిన గార్డెన్ సిటీ బెంగుళూరు ప్రపంచ ఐటీ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఐటీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ హోదాలో కొనసాగుతున్న ఐటీ కంపెనీలు బెంగుళూరు ప్రాంతంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవటం దేశ ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చినట్లయింది. గాడ్జెట్ షాపింగ్‌కు బెంగుళూరు నగరం అనువైన ప్రాంతం ఇక్కడ అనేక అంతర్జాతీయ టెక్ బ్రాండ్‌లు తమ స్టోర్‌లను నెలకొల్పి అమ్మకాలు సాగిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గార్డెన్ సిటీ బెంగుళూరులో కొలువుతీరి ఉన్న బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లను ఫోటో స్లైడ్‌షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

నికాన్, రిచ్‌మండ్ రోడ్ (Nikon Richmond road):

ఈ స్టోర్‌లో నికాన్ కెమెరాలకు సంబంధించి అన్ని మోడల్స్ లభ్యమవుతాయి. సేల్స్ ఇంకా సర్వీసింగ్ నిర్వహిస్తారు.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

యాపిల్ ఐస్టోర్, యూబీ సిటీ (Apple istore ubcity):

ఈ స్టోర్‌ను 2008లో ప్రారంభించారు. యాపిల్ అత్యాధునిక ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. ఈ లగ్జరీ రిటైల్ స్టోర్ ఆహ్లాదరమైన వాతవరణాన్ని అందిస్తోంది.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

లెనోవో (Lenovo):

మల్లేశ్వరంలో ఏర్పాటు చేయడబడిన లెనోవో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో వివిధ మోడళ్ల లెనోవో ల్యాప్‌టాప్ ఇంకా డెస్క్‌టాప్ పీసీలు లభ్యమవుతాయి.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

ఎల్‌జి, జయనగర్ (lg, jayanagar):

జయనగర్ 5వ బ్లాక్‌లో కొలువుతీరు ఉన్న ఎల్‌జి స్టోర్, వివిధ ఎల్‌జి బ్రాండెడ్ ఉత్పత్తులను బెస్ట్ డీల్స్ పై ఆఫర్ చేస్తోంది.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

 నోకియా, మల్లేశ్వరం (nokia, Malleshwaram):

మల్లేశ్వరంలో ఏర్పాటు చేయడబడిన నోకియా సెల్‌ఫోన్ షోరూమ్‌లో వివిధ మోడళ్ల సెల్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

సోనీ, జయనగర్ (sony, jayanagar):

జయనగర్ 4వ బ్లాక్‌లో ఏర్పాటు చేయబడిన సోనీ వరల్డ్ లిమిటెడ్ వివిధ సోనీ ఉత్నత్తులను వినియోగదారులకు పరిచయం చేస్తుంది.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

సామ్‌సంగ్, కోరమంగళా (samsung, kormangala):

కోరమంగళా ప్రాంతంలోని హోసూర్ రోడ్‌లో ఏర్పాటు చేయబడిన సామ్‌సంగ్ ప్రీమియమ్ స్టోర్ అనేక సామ్‌సంగ్ ఉత్పత్తులను బెంగుళూరు వాసులకు అందిస్తోంది.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

అసూస్, ఇందిరానగర్ (asus, indiranagar):

బెంగుళూరులోని ఇందిరానగరలో ఏర్పాటు చేయబడిన అసూస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ప్రత్యేకమైన అసూస్ కంప్యూటింగ్ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది.

బెస్ట్ గాడ్జెట్ స్టోర్‌లు బెంగుళూరు

డెల్ ఏలియన్ వేర్ షోరూమ్, బెంగుళూరు, కోరమంగళా (dell alienware showroom, bangalore kormanagala):

డెల్ ల్యాప్‌టాప్ విక్రయాలకు ఏలియన్ స్టోర్ పెట్టింది పేరు. బెంగుళూరు నగరంలో ఏలియన్ స్టోర్‌కు పెద్ద చరిత్రే ఉంది. అన్నిరకాలైన డెల్ కంప్యూటింగ్ ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. డెల్ కంప్యూటింగ్ ఉత్పత్తులకు సంబంధించి సేల్స్ ఇంకా సర్వీసింగ్ ఇక్కడ జరుగుతుంది.  గేమింగ్ ఇక్కడి ప్రత్యేకం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot