ట్రెండ్ సెట్ చేసే ఫోన్‌లు రాబోతున్నాయా..?

Written By:

లాస్ వేగాస్ వేదికగా రేపటి నుంచి కాబోతున్న 'కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2016' కోసం యావత్ టెక్నాలజీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 6 నుంచి 9 వరకు జరగనున్న ఈ అతిపెద్ద టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ నూతన టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాయి. సీఈఎస్ 2016ను పురస్కరించుకుని టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా చర్చించుకుంటోన్న 10 హై-టెక్నాలజీ గాడ్జెట్‌ల గురించి ఇప్పుడు విందాం..

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ఏం చేయబోతోంది..?

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

సామ్‌సంగ్ ఏం చేయబోతోంది..?

సీఈఎస్ 2016లో సామ్‌సంగ్, తన అప్‌కమింగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే టాబ్లెట్ పీసీలు, స్మార్ట్ టీవీలను కూడా సామ్‌సంగ్ ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

 

ఎల్‌జీ నుంచి..?

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎల్‌జీ సీఈఎస్ 2016లో భాగంగా తన జీఫ్లెక్స్ సిరీస్ నుంచి మూడవ జనరేషన్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్ అయిన ‘G Flex 3'ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది. ఇదే వేదిక పై సామ్‌సంగ్‌కు పోటీగా కొత్త జనరేషన్ 8కే టీవీలను ఎల్‌జీ ప్రదర్శించే అవకాశముంది.

 

Huawei

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సైలెంట్‌గా ఎదిగేస్తున్న హువావీ, సీఈఎస్ 2016కు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రదర్శన వేదికగా హువావీ తన లేటెస్ట్ వర్షన్ ఫోన్ Mate 8తో పాటు ఓ స్మార్ట్‌వాచ్‌ను కూడా ప్రదర్శించనున్నట్లు సమాచారం.

 

Sony

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో దిగ్గజ సంస్థగా అవతరించిన సోనీ, సీఈఎస్ 2016ను పురస్కరించుకుని సరికొత్త ఆండ్రాయిడ్ టీవీలతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది.

 

Asus

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను దినదినాభివృద్థి సాధిస్తోన్న అసుస్, సీఈఎస్ 2016లో భాగంగా కొత్త ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించబోతోంది.

 

Lenovo

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

సీఈఎస్ 2016 వేదికగా లెనోవో ఓ శక్తివంతమైన విండోస్ టాబ్లెట్‌తో పాటు 60 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన భారీ ప్రొజెక్టర్‌ను ప్రదర్శించబోతున్నట్లు సమాచారం.

 

HTC

CES 2016: ప్రముఖ బ్రాండ్‌ల నుంచి విప్లవాత్మక ఆవిష్కరణలు

సీఈఎస్ 2016 వేదికగా హెచ్‌టీసీ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ వన్ ఎమ్10తో పాటు స్మార్ట్ వేరబుల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశమున్నట్లు సమాచారం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 hi-tech gadgets expected to launch in first week of January 2016. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting