టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

|

ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులువేస్తోంది. ఆధునిక జనజీవనం సాంకేతికతో స్నేహం చేస్తున్ననేపధ్యంలో సాంకేతిక ఉత్పత్తులకు మార్కెట్లో తీవ్రమైన డిమాండ్ నెలకుంది. ఈ క్రమంలో గాడ్జెట్ తయారీ సంస్థలు తమ మొదళ్లకు మరింత సానపెడుతూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి.

ఈ పోస్ట్ కూడా చదవండి:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

గూగుల్.. యాపిల్.. మైక్రోసాఫ్ట్... సామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలు ఇంటర్నెట్, కంప్యూటింగ్ ఇంకా స్మార్ట్ మొబైలింగ్ విభాగాల్లో తమ ఆవిష్కరణ జోరు కొనసాగిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ హోదాలో కొనసాగుతున్న టాప్ - 10 టెక్నాలజీ కంపెనీల జాబితాను మీముందు ఆవిష్కరిస్తున్నాం.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

యాపిల్ (Apple):

ప్రారంభం, 1976 (లాస్ ఆల్టోస్, కాలిఫోర్నియా),
వ్యవస్థాపకులు: స్టీవ్ జాబ్స్.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

గూగుల్ (Google):

1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

ఐబీఎం (IBM):

సూపర్ కంప్యటర్ల తయారీ, హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీ విభాగంలో దిగ్గజహోదాను అధిరోహించిన ప్రముఖ బహుళ జాతియ కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్) గురించి తెలియని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అంటూ ఉండరు. ఇక్కడ ఉద్యోగం ఓ వరంగా భావించే వారు కోకొల్లలు. న్యూయార్క్‌లోని ఆర్మాంక్ ప్రధాన కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ఐబీఎంకు ప్రపంచవ్యాప్తంగా 433,362 పై చిలుకు ఉద్యోగులున్నారు.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

సామ్‌సంగ్ (Samsung):

‘సామ్‌సంగ్' ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

మైక్రోసాఫ్ట్ (Microsoft):

ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

ఏటీ&టీ (AT&T):

ఈ టెలికాం సంస్థను 1875లో ప్రారంభించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన వివరాల మేరకు ఏటీ&టీ కంపెనీకి దాదాపు 95మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నట్లు అంచనా.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

జనరల్ ఎలక్ట్రిక్ (General Electric):


ఈ సంస్థను 1876లో థామస్ ఎడిసన్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఏరోస్పేస్ ఇంకా హెల్త్ కేర్ విభాగాలకు విస్తరించింది.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

వొడాఫోన్ (Vodafone):

యూకే నగరంలోని న్యూబెర్రీ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వొడాఫోన్ 1982లో యూకే ప్రాంతానికి చెందిన రెండు సెల్యూలర్ టెలిఫోన్ నెట్‌వర్క్ లైసెన్స్‌లను పొందగలిగింది. వొడాఫోన్ క్రమకమంగా తమ సేవలను ఇతర దేశాలకు విస్తరింపజేసింది. ఓ విశ్లేషణ ఆధారంగా సేకరించిన వివరాల మేరకు ప్రపంచవ్యాప్తంగా వొడాఫోన్‌కు 370మిలియన్‌ల వినియోగదారులున్నట్లు అంచనా.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

ఇంటెల్ (Intel):

ప్రముఖ కంప్యూటర్ ఇంకా మొబైల్ ప్రాసెసర్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌ను 1968, కాలిఫోర్నియాలో నెలకొల్పారు.

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

టెక్నాలజీ కంపెనీలు (టాప్-10)

హెవ్లెట్ ప్యాకర్డ్ (Hewlett Packard):

ఈ ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థను 1939లో ప్రారంభించారు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X