సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు

Written By:

సిలికాన్ వ్యాలీ...టెక్నాలజీకి స్వర్గధామం.ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ ఇక్కడే ఉంటాయి. యుఎస్ లోని కాలిఫోర్నియా రాష్ర్టంలో ఉంది. ఇది ఐటీ పరిశ్రమలకు నిలయంగా మారడమే కాదు వందలకొద్ది ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. అమెరికా ఐటీ హబ్ అంతా ఇక్కడి నుంచే నడుస్తోంది. సో ఇక్కడి నుంచే మన భారతీయులు అనేకమంది పలు కంపెనీలకు సీఈఓలుగా నియమితులయ్యారు. సో ఎవరెవరు ఇక్కడి నుంచి ఏయే కంపెనీలకు సెలక్ట్ అయ్యారో ఓ లుక్కేద్దాం.

Read more: త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2014 లో మైక్రొసాప్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 20 సంవత్సరాలు తరువాత అతను కంపెనీలో అగ్రస్థాయికి చేరుకున్నారు. సత్య నాదెండ్ల హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. నాదెళ్ల తండ్రి ఓ ఐఎఎస్ ఆఫీసర్. ఇంజనీరింగ్ డిగ్రీని మణిపాల్ ఇనిస్టిట్యూట్ నుండి అలాగే మాస్టర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ విస్కినోసిన్ నుండి పొందారు. అలాగే ఎంబిఎ చికాగో బోత్ స్కూల్ ఆప్ బిజినెస్ లో చదివారు.

అడోబ్ సీఈఓగా 2005లో పదవీ బాధ్యతలు స్వీకరించిన నారాయెన్ ఏడు సంవత్సరాల తరువాత ఆ స్థాయికి చేరారు. ప్రిక్ట్రా కు కో పౌండర్ కూడా నారాయెనే. అది ఇంటర్ నెట్ లో ఫోటో షేరింగ్ కు సంబంధించినది. పోటోషాప్,ఇల్లుస్ట్రేటర్ బేస్ డ్ కంపెనీ. నారాయెన్ హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. ఎంబిఎ కాలిఫోర్నియాలో చదివారు. తొలిసారిగా యాపిల్ కంపెనీ నుంచి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు.

సిస్కో సిస్టమ్స్ కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్నారు.1961లో విజయవాడలో జన్మించారు. 1982 ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనంతరం కెమికల్ ఇంజనీరింగ్ ను కార్నెల్ లో చదివారు.23 సంవత్సరాలు మోటోరోలా లో పనిచేశారు. అలాగే సిలికాన్ వ్యాలీలో మగవారితో పోటీపడుతున్న అతికొద్ది మంది మహిళల్లో ఈమె ఒకరు. మోటోరోలా కంపెనీ వదిలిన 2007 నుంచి సిస్కోలోనే పనిచేస్తున్నారు.

సన్ మైక్రో సాఫ్ట్ స్థాపించిన వారిలో వినోద్ కూడా ఉన్నారు. ఇండియన్ ఇంజనీర్స్ లో మంచి టాలెంటెడ్ పర్సన్ గా పేరు గాంచి సిలికాన్ వ్యాలీలో కెరియర్ స్టార్ట్ చేశారు. 1955లో ఢిల్లీ లో జన్మించారు. ఐటీఐ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. ఎంబిఎ పట్టా అందుకున్న రెండు సంవత్సరాలకే ఆయన సన్ మైక్రో సాఫ్ట్ స్థాపించారు. 1984 నుంచి సీఈఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గూగుల్ సెర్చ్ ఇంజెన్ ను నిర్వహణలో అమిత్ సింఘాల్ దే కీలక పాత్ర. ప్రపంచంలోని అన్ని కంపెనీల కంటే ఈ కంపెనీనే అధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సింఘాలో 1968లో ఝాన్సీ లో జన్మించారు. రూర్కీ నుంచి ఐటీఐ డిగ్రీని అలాగే కోర్నెల్ నుంచి పీహెచ్ డీని అందుకున్నారు. 1996లో ఎటీ అండ్ టీ ల్యాబ్స్ లో కెరియర్ స్టార్ట్ చేశారు. గూగుల్ కంపెనీలో 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యారు.

ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజర్ గా సోషల్ మీడియాలో బాధ్యతలు నిర్వర్తించిన సంఘ్వీ తొలి మహిళా ఇంజనీర్ గా గుర్తింపు పొందారు. ఫేస్ బుక్ ను వదిలేసి కోవ్ కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ కంపెనీలోనే బాధ్యతలు నిర్వరిస్తున్నారు. 2013లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు.

సిలికాన్ వ్యాలీ లో మంచి డిమాండ్ ఉన్న బాస్ లలో దీపక్ ఒకరు. టెస్లా అండ్ స్పేస్ ఎక్ష్ ఫౌండర్ ముస్క్ తో పాటు కలిసి టెస్లాను నడిపారు. 1985లో వారణాసిలోని బనారస్ యూనివర్సిటీ నుంచి బ్యాచలర్ డిగ్రీని అందుకున్నారు. తరువాత యూఎస్ వెళ్లి అక్కడే ఎంబిఎ పూర్తి చేశారు. 2008లో టెస్లా కంపెనీలో జాయిన్ అయ్యారు. చాలా కాలం తరువాత దాన్ని వదిలేసి ఫోర్డ్ లో స్థిరపడ్డారు.

ఆన్ లైన్ ఫ్లాట్ పాంలో సంచలనాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పిజ్జా కు ఆధ్యులు. ఫేస్ బుక్ ఒరాకిల్ కంపెనీలలో తన ప్రస్థానాన్ని సాగించి ఇప్పుడు ఇలా స్థిరపడ్డారు.

శ్రీపాలో వెంచర్ ఫౌండర్ కమ్ మేనేజింగ్ డైరక్టర్. ఇది గూగుల్ లో ఫస్ట్ ఇన్వెప్టర్. ఇప్పుడు కంపెనీని టాప్ పొజిషన్ వైపు నడిపిస్తున్నారు. చెన్నై లయోలా కాలేజి నుంచి మాస్టర్ డిగ్రీని పొందారు. నెట్స్ కేప్ ఇంటర్నెట్ తో కెరియర్ స్టార్ట్ చేశారు.

గూగుల్ సీఈఓగా నియమితుడైన భారత సంతతి వ్యక్తి. గూగుల్ నుంచి త్వరలో రారున్న ఆల్పాబీట్ ను డెవలప్ చేసేందుకు నియమితులయ్యారు. కంపెనీనీ ముందు ముందు ఉన్నత శిఖరాలకు సుందర్ తీసుకువెళతారని గూగుల్ కో ఫౌండర్ బ్రిన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian moving up the ranks in the Silicon Valley didn't began all of a sudden. Rather this has been happening unknowingly for quite a few years now.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot