వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో రాణించాలనుకుంటున్న నేటి యువతకు ప్రముఖ వ్యక్తుల జీవిత కథలు ఎంతో స్పూర్తినిస్తాయి. సాంకేతిక రంగంలో విజేతలుగా నిలిచిన ప్రముఖ వ్యక్తులు అనుభవాలు బయోగ్రఫీల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని చదవటం ద్వారా మన లక్ష్య సాధనకు ఉపయోగపడే బోలెడన్ని కొత్త విషయాలను తెలుసకోవచ్చు.

Read More : ఆ పిల్లాడు 11 ఏళ్లకే శాస్ర్తవేత్త అయ్యాడు

ప్రముఖ వ్యక్తుల జీవిత కథలు మన జీవిత ఆశయాల పై ఎంతగానో ప్రభావం చూపుతాయి. టెక్నాలజీ రంగంలో ఎన్నో కష్టనష్టాలను చవిచూసి పట్టువదలని విక్రమార్కుల్లా విజయబాహుటాను ఎగరవేసిన 10 మంది అతిరథ మహారథులు బయోగ్రఫీల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

బిల్ గేట్స్

జేమ్స్ వాలేస్, జిమ్ ఎరిక్సన్‌లు గ్రంథస్తం చేసిన ‘హార్డ్‌డ్రైవ్: బిల్‌గేట్స్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ ఎంపైర్' పుస్తకం బిల్‌గేట్స్ ఎదుగుదలతో పాటు మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్థిని వివరిస్తుంది. ఈ బయోగ్రఫీలో ఉండే అంశాలు యువతకు ఎంతో ఉపయోగపడతాయి.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

స్టీవ్ జాబ్స్

‘స్టీవ్ జాబ్స్' పేరుతో అమెరికన్ రచయిత ఇంకా ప్రముఖ బయోగ్రాఫర్ Walter Isaacson రాసిన పుస్తకం ఎంతో గుర్తింపును సొంతం చేసుకుంది. వాల్టర్ ఈ బయోగ్రఫీని జాబ్స్‌కు సంబంధించి నిర్వహించిన 40 ఇంటర్వ్యూలు ఆధారంగా తయారు చేసారు.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

పాల్ అలెన్

‘ఐడియా మాన్: ఏ మెమోయిర్ బై ద కో-ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్' పుస్తకం మైక్రోసాఫ్ట్ నిర్మాణంలో భాగంగా పాల్ అలెన్ చేసిన కృషిని వివరిస్తుంది. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీని తన స్కూల్ మేట్ పాల్ అలెన్‌తో కలిసి స్థాపించిన విషయం తెలిసిందే.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

జెఫ్ బిజోస్

అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బిజోస్ జీవిత చరిత్రను వివరిస్తూ ‘ద ఎవ్రీథింగ్ స్టోర్: జెఫ్ బిజోస్ అండ్ ద ఏజ్ ఆఫ్ అమెజాన్' పేరుతో బ్రాడ్ స్టోన్ తయారు చేసిన బయోగ్రఫీ జెఫ్ బిజోస్ సృజనాత్మక ఆలోచనలతో పాటు అమెజాన్ అభివృద్థిని వివరిస్తుంది.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

వారెన్ బఫెట్

ప్రపంచ కుబేరేల్లో ఒకరైన వారెన్ బఫెట్ జీవిత చరిత్రను వివరిస్తూ ‘ద స్నోబాల్: వారెన్ బఫెట్ అండ్ ద బిజినెస్ ఆఫ్ లైఫ్' పేరుతో అలైస్ స్ర్కోయిడర్ రచించిన బయోగ్రఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ బయోగ్రఫీ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకుంటున్న వారికి ఎంతో స్పూర్తిధాయకం.

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

స్టీవ్ వోజ్నయిక్

‘ఐవోజ్ : కంప్యూటర్ గీక్ టూ కల్ట్ ఐకాన్: హౌ ఐ ఇన్‌వెంటెడ్ ద పర్సనల్ కంప్యూటర్, కో-ఫౌండెడ్ యాపిల్, అండ్ హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్' పేరుతో రచించబడిన పుస్తకం యాపిల్ కంపెనీ నిర్మాణంలో భాగంగా స్టీవ్ జాబ్స్‌తో కలిసి స్టీవ్ వోజ్నయిక్ చేసిన కృషిని వివరిస్తుంది.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

మార్క్ జూకర్‌‍బర్గ్

‘ద యాక్సిడెంటల్ బిలియనీర్స్: ద ఫౌండింగ్ ఆఫ్ ఫేస్‌బుక్' పేరుతో బెన్ మిజ్‌రిచ్ రాసిన పుస్తకం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌‍బర్గ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను ప్రస్తావిస్తుంది. ఈ పుస్తకం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఏంతగానో ప్రభావితం చేస్తుంది.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

రాబర్ట్ నాయిస్

‘ద మాన్ బిహైండ్ ద మైక్రోస్కోప్: రాబర్ట్ నాయిస్ అండ ద ఇన్వెన్షన్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ' పేరుతో లెస్లీ బెర్లిన్ రాసిన పుస్తకం రాబర్ట్ నాయిస్ పరిశోధనాత్మక ఆలోచనలతో పాటు ఫైయిర్ చైల్డ్ కార్పొరేషన్స్, ఇంటెల్ కంపెనీలకు ఆయన చేసిన సేవలను వివరిస్తుంది.

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

లైనస్ టోర్వాల్డ్స్

‘జస్ట్ ఫర్ ఫన్: ద స్టోరీ ఆఫ్ యాన్ యాక్సిడెంటల్ రివల్యూషనరీ' పేరుతో లైనస్ టోర్వాల్డ్స్ గ్రంథస్తం చేసుకున్న పుస్తకం లైనక్స్ చరిత్రను వివరించటంతో పాటు ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే మార్గాలను గొప్ప మార్గాలను సూచిస్తుంది. 

 

వీరి జీవిత కథలు స్పూర్తిమంత్రాలు

జానీ ఐవీ

‘జానీ ఐవీ: ద జీనియస్ బిహైండ్ యాపిల్స్ గ్రేటెస్ట్ ప్రొడక్ట్స్' పేరుతో లీండర్ ఖానీ రాసిన పుస్తకం  ఐపోడ్, ఐమ్యాక్, ఐఫోన్ వంటి ప్రముఖ యాపిల్ ఉత్పత్తులను డిజైన్ చేసిన క్రియేటివ్ డిజైనర్ జానీ ఐవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రస్తావిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పైన ప్రస్తావించుకున్న లెజండ్రీ బయోగ్రఫీలు మన జీవితాలను ఆయా రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దటంలో మంచి తోడ్పాటు నందిస్తాయి. 100 సంవత్సరాలకు పైగా సుధీర్ఘ చరిత్రను సొంతం చేసుకుని కాలానుగుణంగా ప్రపంచంతో మమేకమవుతోన్న ఓ బ్రాండ్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెడుతూనే ఉంది. ఆ బ్రాండ్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

English summary
10 Must Read Biographies Of Tech Leaders. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot