ఆ పిల్లాడు 11 ఏళ్లకే శాస్ర్తవేత్త అయ్యాడు

Written By:

ఆ కుర్రాడు అందరిలాంటి వాడు కాదు తన తోటి చదువుకునే పిల్లలకు భిన్నంగా కనిపిస్తాడు.పట్టుమని 11 ఏళ్ల వయసులోనే తన ప్రతిభతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు..ఇంకా ఆ పిల్లాడు మన దేశం కోసం ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు..అతను ఏం చేశాడు...ఓ సారి అతని స్టోరిని చదివేద్దాం.

Read more :కీబోర్డ్‌ను మడిసి బ్యాగులో పెట్టేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేదాంత్ ధిరేన్ పరికర్

వేదాంత్ ధిరేన్ పరికర్

ఎప్పుడూ ఎల్ ఈ డీలు, అయస్కాంతాలు,తదితర వస్తువులతో బిజీగా కనిపించే ఈ కుర్రాడి పేరు వేదాంత్ ధిరేన్ పరికర్.పదకొండేళ్ల వయసులోనే వేస్ట్ వస్తువులతో ఉచిత విద్యుత్ ఉత్పత్తికి బీజం వేశాడు.

పాడయిన ల్యాప్ టాప్ బ్యాటరీతో సంచలనాలు

పాడయిన ల్యాప్ టాప్ బ్యాటరీతో సంచలనాలు

మహారాష్ర్టకు చెందిన 11 ఏళ్ల ఈ బాలుడు తన తండ్రి ల్యాప్ టాప్ పాడవడంతో దాని నుంచి తీసిన బ్యాటరీని వృధాగా పోనీకుంగా దీంతో విద్యుత్ ఉత్పత్తికి దారులు వెతికాడు

వెనుకబడిన గ్రామాలపై దృష్టి

వెనుకబడిన గ్రామాలపై దృష్టి

గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో కరెంట్ లేక పిల్లలు రాత్రి సమయాల్లో చదువుకోలేని స్థితిని మార్చాలని కంకంణం కట్టుకున్నాడు ఈ బాలుడు.అందులో భాగంగా వేస్ట్ బ్యాటరీస్ కు సోలార్ సిస్టమ్ ను వాడి విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్నాడు.

లైటు వెలిగించాడు

లైటు వెలిగించాడు

బ్యాటరీ సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి లైటు వెలిగించాడు చిన్నోడు.పాత బ్యాటరీలను ఉపయోగించి సోలార్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చన్న విషయాన్ని కనుగొన్నాడు

తండ్రి తోడ్పాటు

తండ్రి తోడ్పాటు

వేదాంత్ ఆలోచనకు తండ్రి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఆరేళ్ల వయసునుంచే ప్రయోగాలను ప్రారంభించిన వేదాంత్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ కుర్రాడు ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికి పేటెంట్ కూడా తీసుకున్నారు.

తండ్రి కంప్యూటర్ ఇంజనీర్

తండ్రి కంప్యూటర్ ఇంజనీర్

ప్రస్తుతం వేదాంత్ తండ్రి కంప్యూటర్ ఇంజనీర్ కావడంతో మనోడికి అన్ని విధాల కలిసి వచ్చింది.ఎలక్ట్రానిక్ విషయంలో తండ్రి అత్యంత శ్రధ్ధ తీసుకోవడంతో వేదాంత్ కు బాగా కలిసి వచ్చింది.

భవిష్యత్ కల

భవిష్యత్ కల

భవిష్యత్ లో ఇంజనీర్ గా మారి మొత్తం దేశానికి ఉచిత కరెంట్ నివ్వాలని అందుకోసం ఫ్రీ కరెంట్ మార్గాలను కనుగొనాలని వేదాంత్ కలలు కంటున్నాడు. అతడి కల సాకారం అయితే దేశంలో దూరంగా ఉన్న ఎన్నో గ్రామాలు విద్యుత్ వెలుగులు నిండే అవకాశం ఉంది.

రిమోట్ ఆపరేట్ బోట్ కి సంబంధించిన వీడియో

రిమోట్ ఆపరేట్ బోట్ కి సంబంధించిన వీడియో

సోలార్ లైట్ తో పాటు రిమోట్ తో ఆపరేట్ చేసే బోట్ ను 11 ఏళ్ల వయసులో కనుగొన్నాడు. వేదాంత్ తయారు చేసిన రిమోట్ ఆపరేట్ బోట్ కి సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
When His Father’s Laptop Battery Stopped Working, This 11-Year-Old Created a Solar Light From It
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting