ట్విట్టర్ ట్రై చేసింది..గూగుల్ పట్టేసింది

Posted By:

నిరు పేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన సుందర్ పిచాయ్ జీవితంలో కొన్ని మరపు రాని ఫోటోలు ఉన్నాయి. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సుందర్ జీవితంలో మరపురాని గుర్తులు కూడా ఉన్నాయి. గూగుల్ లో పని చేస్తున్న సుందర్ టాలెంట్ ని గమనించిన ట్విట్టర్ తన కంపెనీకి సీఈఓగా అతన్ని నియమించుకోవాలనుకుంది. అయితే ఈ విషయం తెలిసిన గూగుల్ ట్విట్టర్ ప్రయత్నానికి గండి కొట్టింది.ఇది ఈమధ్య సోషల్ మీడియాలో హల్ చల్ కూడా చేసింది. ఇక 1972లో చెన్నైలో జన్మించిన సుందర్... ఐఐటీ - ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టాను,అనంతరం ఆయన 2004లో గూగుల్ సంస్థలో చేరారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటితో పాటు సుందర్ గురించి తెలిపే కొన్ని ఆసక్తికర ఫోటోలు.మీ కోసం

Read more:మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. తల్లిదండ్రులతో సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ తల్లి దండ్రులతో దిగిన ఫోటో ఇది.1997లో కాలిఫోర్నియాలో తన తల్లి దండ్రులు తొలిసారిగా యుఎస్ ను సందర్శించినప్పడు వారితో కలిసి ఇలా ఫోటో దిగారు.

2. షారూఖ్ ఖాన్ తో ఎంజాయ్

గూగుల్ హెడ్ క్వార్టర్స్ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ తో ఖాన్ సుందర్ పిచాయ్ దిగిన ఫోటో

3. సుందర్ పిల్లలు

సుందర్ పిచాయ్ పిల్లలు వీరే. కొడుకు పేరు కీరోన్ కూతరు పేరు కావ్య

4.భార్య అంజలి

సుందర్ పిచాయ్ తన భార్యతో టైం స్క్వాయిర్ దగ్గర దిగినప్పటి ఫోటో..సుందర్ పిచాయ్ అంజలికి ఐఐటీ ఫైనల్ ఇయర్ లో ప్రపోజ్ చేశారట.

5. సుందర్ కు అభినందనలు

సుందర్ కు తను చదువుకున్న చిన్న నాటి స్కూల్లో అభినందనల వెల్లువ పోటెత్తింది. చెన్నై లోని వనవాణి మాట్రిక్ స్కూల్లో ఇలా విషెస్ చెప్పారు.

6.ఫేస్ బుక్ కొత్త పేజీ

సుందర్ పిచాయ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఐఐటీ ఖరగ్ పూర్ ఫేస్ బుక్ లో కొత్త పేజిని రూపొందించింది.

7. యువకుడుగా సుందర్ పిచాయ్

సుందర్ పిచాయ్ యువకుడిగా ఉన్నప్పుటి చిత్రం.1994లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేరినప్పుడు క్లిక్ మనిపించారు. తన తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీర్ కావడంతో ఆ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఏర్పడింది.

8.సుందర్ పిచాయ్ ఫేస్ బుక్ ఫోటో

సుందర్ పిచాయ్ ఫేస్ బుక్ ఫ్రొపైల్ లో ఉన్న ఫోటో ఇదే.

9.సుందర్ పిచాయ్ తో అంజలి

సుందర్ పిచాయ్ రాజస్థాని అమ్మాయి అంజలిని వివాహం చేసుకున్నారు. సుందర్ తన బ్యాచ్ లో చాలా తెలివైన వాడు.ఎప్పుడూ ఫస్ట్ వస్తూ ఉండేవాడు. గోల్డ్ మెడల్ కూడా సాధించాడు.

10. దీపావళి ఎంజాయ్

సుందర్ పిచాయ్ దిపావళి వేడుకల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నప్పటి చిత్రం.స్కూలు స్థాయిలో కెప్టెన్ కూడా

11.సుందర్ కోసం పోటీ

సుందర్ ని తమ కంపెనీలోకి తీసుకోవాలని ట్విట్టర్ ఎంతో ప్రయత్నించినప్పటికీ గూగుల్ ఆ అవకాశాన్ని ట్విట్టర్ కు ఇవ్వలేదు.. విషయం తెలిసిన వెంటనే అతన్ని గూగుల్ కి సీఈఓగా అపాయింట్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sundar Pichai is the name of the hour. From a calm and composed tech developer, to now heading the world's leading tech company Google, Pichai's journey to the top position in Google shows his achievements in a relatively short time period.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot