విశ్వ రహస్యాల పై కొనసాగుతోన్న ప్రయోగాల పరంపర

Posted By:

విశ్వ రహస్యాలను చేధించే క్రమంలో మనిషి ప్రయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని అధ్యయనాలు సఫలీకృతమైనప్పటికి మరికొన్ని మాత్రం సవాళ్లుగానే మిగిలిపోయాయి. అయినప్పటికి, సాధించగలనన్న కుతూహలంతో మనిషి తన ప్రయత్నాలను సాగిస్తూనే ఉన్నాడు. విశ్వరహస్యాల చేధనలో భాగాంగా మనిషి సాధించిన 10 అద్భుతమైన విజయాలను మీముందుంచుతున్నాం...

ఇంకా చదవండి: సంచలనం రేపిన 10 రోబోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘ఐసీ-2233' వెండి సూదిలా కనిపించే ఈ గెలాక్సీ విశ్వంలోని అతిబల్లపరుపు గెలాక్సీల్లో ఒకటి.

ఎన్‌జీసీ డిస్క్ గెలాక్సీ విశ్వంలోనే అతిపెద్ద కృష్ణబిలంగా గుర్తింపు పొందింది. ఈ కృష్ణబిలాన్ని జర్మన్ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళవేత్త రెమ్మో వాన్ డెన్ జోష్ 2012లో కనుగొన్నారు.

విశ్వంలోని అతిపెద్ద గెలాక్సీ ఐసీ-1101. ఈ గెలాక్సీని బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ విలియం హెర్షెల్ 1790లో కనుగొన్నారు.

విశ్వంలోని అతి పురాతన నక్షత్ర మండలమైన z8 GND 5296ను 2013లో కొనుగోన్నారు. ఇడి భూమి నుంచి సుమారు 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

విశ్వంలోని అతిపెద్ద  జైవిక అవయవంగా ‘హనీ ఫంగస్'ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

రాత్రుళ్లు ఒక్కోసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగవంగా కిందకు పడిపోవటాన్ని మనం చూస్తాం. అవి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్లు, ఖనిజాలు. వాటినే ఉల్కలు అని కూడా పిలుస్తారు.

హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక తోకచుక్కను కనుగొని దానికి హేలీ అని పేరుపెట్టాడు. ఈ తోకచుక్క 76ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో హేలీ తోకచుక్క కనిపించింది. ఇది తిరిగి 2062లో కనిపిస్తుంది.

విశ్వంలో వేలాది గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో మిలియన్ల నక్షత్రాలున్నాయి.

సూర్యుడు పాలపుంత అనే గెలాక్సీకి చెందిన నక్షత్రం. సూర్యుడు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్‌ను కలిపి సూర్యకుటుంబం అంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 record holders of the Universe. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot