అంతర్జాతీయంగా యాపిల్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులంటే ప్రత్యేకమైన క్రేజ్. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో యాపిల్ ఐఫోన్‌లు, టాబ్లెట్ పీసీల విభాగంలో యాపిల్ ఐప్యాడ్‌లు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ విభాగంలో యాపిల్ ఐపోడ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో యాపిల్ మ్యాక్ పీసీలు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, గేమింగ్ విభాగంలోనూ యాపిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది.యాపిల్ కంపెనీ తయారు చేసిన ఓ గేమింగ్ కన్సోల్ 38 సంవత్సరాల యాపిల్ చరిత్రలో ఓ పీడకలగా నిలిచింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ కంపెనీ గురించి 20 ఆసక్తికర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
ఆండ్రాయిడ్ ఫోన్‌లో గెస్ట్ మోడ్‌ను వినియోగించుకోవటం ఏలా..?
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మూడవ వ్యక్తి రోనాల్డ్ వేన్
యాపిల్ కంపెనీని ముగ్గురు వ్యక్తులు స్థాపించారు. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నైక్, రోనాల్డ్ వేన్. నెలకొల్పిన 12 సంవత్సరాల తరువాత రోనాల్డ్ వేన్ తన 10 శాతం వాటాతో కంపెనీ నుంచి తప్పుకున్నాడు.

స్మోక్ చేస్తే వారంటీ వర్తించదట
యాపిల్ కంప్యూటర్ల దగ్గర స్మోక్ చేస్తే ఆ ఉత్పత్తులకు వారంటీ వర్తించదట!.

92,000 పై చిలుకు ఉద్యోగులు
యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 92,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు.

యూఎస్ ఖజానాలో ఉన్న క్యాష్‌తో పోలస్తే
యూఎస్ ఖజానాలో ఉన్న క్యాష్‌తో పోలస్తే రెండితల క్యాష్ యాపిల్ వద్ద ఉంది!

యాపిల్ కంపెనీ విడుదల చేసే ప్రతి ఐఫోన్ ఫోటోగ్రాఫ్‌లో
యాపిల్ కంపెనీ విడుదల చేసే ప్రతి ఐఫోన్ ఫోటోగ్రాఫ్‌లో సమయాన్ని 9:41 AMగా చూపుతారు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మొట్ట మొదటి యాపిల్ ఐఫోన్‌ను ఆవిష్కరించింది ఆ సమయంలోనే.

ఐపోడ్ రూపకర్త టోనీ
ఐపోడ్ రూపకర్త టోనీ ఫాడెల్ తన డివైస్‌ను తొలత ఫిలిప్స్ అలానే రియల్ నెట్‌వర్క్స్‌కు ఆఫర్ చేసారు. అయితే వాళ్లిద్దరు ఆ ఉత్పత్తిని తిరస్కరించారు.

ఐఫోన్‌ను తయారు చేయాలనే ఆలోచన యాపిల్‌కు 1991లోనే వచ్చివుంటే
ఐఫోన్‌ను తయారు చేయాలనే ఆలోచన యాపిల్‌కు 1991లోనే వచ్చివుంటే ఒక్క ఫోన్‌ను తయారు చేయటానికి దాదాపు 3 మిలియన్ డాలర్లు ఖర్చై ఉండేదట. ఒక్క ర్యామ్ కోసమే 1.44మిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చేదట

స్టీవ్ జాబ్స్ పండ్లను ఇష్టపడతారు కాబట్టే యాపిల్
స్టీవ్ జాబ్స్ పండ్లను ఇష్టపడతారు కాబట్టే యాపిల్ కంపెనీకి యాపిల్ అనే పేరు వచ్చింది.

యాపిల్ ఐఫోన్ కోడ్ నేమ్ ఎమ్68
యాపిల్ ఐఫోన్ కోడ్ నేమ్ ఎమ్68

50 బిలియన్ డాలర్ల క్యాష్
యాపిల్ కంపెనీ వద్ద దాదాపు 150 బిలియన్ డాలర్ల క్యాష్ ఉంది. ఈ సంపదతో ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్, టెల్సా, ట్విట్టర్, డ్రాప్‌బాక్స్, పాండోరా, స్పాటిఫై వంటి ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీలను కొనుగోలు చేయవచ్చు.