పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

Written By:

పదేళ్ల క్రితం ఈ ఉద్యోగాల పేర్లే తెలియదు.. అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. కాని పదేళ్లలో టెక్నాలజీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసి అనేక రకాలైన ఉద్యోగాలను పుట్టించింది. ఈ పదేళ్ల కాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ ,ఐ ఫోన్ ఇలా కొత్త కొత్త రంగాల్లో ఊహించని ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. అనేక రకాలైన ఉపాధి అవకాశాలకు ఈ ఉద్యోగాలు కొత్త బాటలు పరిచాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ తన 'హ్యూమన్ కాపిటల్ ఇండెక్స్' వార్షిక నివేదికలో పేర్కొంది. పదేళ్ల క్రితం మనం ఊహించని పది ఉద్యోగాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని ఆ నివేదిక తెలియజేసింది. అవేంటో మీరే చూడండి.

అంతుచిక్కని రహస్యం..ఆ గుడిలోకి వెళితే రాయిగా మారిపోతారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

2007 లో ఐఫోన్, ఆ తర్వాత ఆండ్రాయడ్ రావడంతో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఊహించని పరిణామాలతో యాప్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆండ్రాయిడ్స్ గూగుల్ ప్లే 16 లక్షల యాప్స్ ను, ఆపిల్ యాప్ స్టోర్ 15 లక్షల యాప్స్ ను సృష్టించాయని 2015 జూలై నాటి లెక్కలు తెలియజేస్తున్నాయి.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

పదేళ్ల క్రితం ఈ ఉద్యోగాలను మనం ఊహించనే లేదు. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఈ రోజున ఫేస్‌బుక్‌కు 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు చెందిన ట్విట్టర్, ఇన్‌స్టా‌గ్రామ్‌లకు కూడా యూజర్లు ఎక్కువగానే ఉన్నారు.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ఈ ఉద్యోగాలను కూడా మనం ఊహించలేదు. యాప్ ప్రాతిపదికన టాక్సీలను నడిపే ఈ సంస్థ 2009 లో ఏర్పాటైంది. 6,200 కోట్ల డాలర్ల విలువతో ప్రారంభమైన ఈ సంస్థ 2015 నాటికి ఎన్నో దేశాలకు విస్తరించింది.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ఈ వ్యవస్థ రవాణా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. టాక్సీ డ్రైవర్లు, కొరియర్ల ఉద్యాగాలకు ఈ వ్యవస్థ కొరివి పెట్టినా ఇంజనీర్లకు, మెకానిక్లకు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు డిమాండ్ పెంచుతోంది.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ఇంతకుముందు ఎవరైనా తాము క్లౌడ్లో పనిచేస్తున్నామంటే అదేమిటంటూ ఆశ్చర్యపోయే వాళ్లం. గూగుల్ కంపెనీ 2006 లో నిర్వహించిన ఓ సదస్సులో 'క్లౌడ్ కంప్యూటింగ్' అనే పదం పుట్టుకొచ్చింది. అమెరికాలోని సగం వ్యాపార కంపెనీలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ను ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల క్లౌడ్ మేనేజింగ్, ఇంజనీరింగ్, స్ట్రాజజింగ్ రంగాలు కూడా వృత్తిపరమైన హోదాలు కానున్నాయి.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

డాటాను సాఫ్ట్వేర్లోకి ఎక్కించడం ఏడాదికి 40 శాతం పెరుగుతుండడం, డాటాను విశ్లేషించడానికి, దాన్ని ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి ఈ రంగంలో నిపుణుల ఆవశ్యకత పెరుగుతూ వస్తోంది.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ప్రతి సంస్థకు ఇది ఇప్పుడిదో ప్రధాన రంగమై కూర్చుంది. హరిత రంగంలో పనిచేయని సంస్థలైన సరే ఎకో ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకోవడానికి ఇలాంటి వాళ్ల అవసరం పెరిగింది.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

వీడియో షేరింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియా మేనేజ్మెంట్, స్పాన్సర్ కార్యక్రమాల ద్వారా కోట్లాది డాలర్లను ఆర్జిస్తున్న ఈ సంస్థలో వీడియో బ్లాగింగ్ లేదా వ్లోగింగ్ పేరుతో కొత్త కెరీర్ ఉద్యోగాలను సృష్టించింది.

Image: Digiday.com

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ఆధునిక కాలంలో డ్రోన్ల ఆపరేటర్లుకు డిమాండ్ పెరుగుతోంది. పెళ్ళిళ్లకు, పేరంటాలకు డ్రోన్ కెమేరాలను ఉపయోగించడమే కాకుండా, భద్రతాపరమైన చర్యలకు, వివిధ పార్సళ్లను హోం డెలవరి చేయడానికి కూడా వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.

పదేళ్ల క్రితం ఊహించని ఉద్యోగాలు..నేడు రాజ్యమేలుతున్నాయి

ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువ మంది పదేళ్ల క్రితం పాఠశాలకు వెళుతున్నవారై ఉంటారు. కొత్తతరం ఉద్యోగుల విలువలను, అంచనాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ యాజమాన్యానికి సలహాలు, సూచనలు ఇచ్చే వీరి సంఖ్యకూడా ఇప్పుడు పెరుగుతూనే ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 tech jobs that didn’t exist 10 years ago
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot