యాపిల్ వాచ్ భారత్‌లో ఎప్పుడు..? ధర ఎంత..?

|

అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇటీవల విడుదల చేసిన యాపిల్ వాచ్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు శుక్రవారం (10.04.2015) నుంచి ప్రారంభమయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్ ఇంకా జపాన్ దేశాల్లో బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేసిన వారికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి వాచ్‌లను పంపిణి చేస్తామని యాపిల్ వెల్లడించింది. ఆయా దేశాల్లోని యాపిల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంచిన యాపిల్ వాచ్‌లను పరిశీలించి తద్వారా తమకు నచ్చిన వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి: మీ ఫోన్ చార్జింగ్ బాగుండాలంటే..?

యాపిల్ వాచ్ భారత్‌లో ఎప్పుడంటే..?

యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. భారత విపణిలో ప్రాథమిక మోడల్ యాపిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.30,000 పై చిలుకు ఉండొచ్చని ఓ అంచనా. గోల్డ్, అల్యూమినియం ఇంకా స్టీల్ వేరియంట్‌లలో యాపిల్ తన వాచ్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

యాపిల్ స్మార్ట్‌వాచ్ గురించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ విప్లవాత్మక ఆవిష్కరణల్లో యాపిల్ వాచ్ ఒకటి. స్టీవ్ జాబ్స్ కలలు కన్న టెక్నాలజీలలో ఇది కూడా ఒకటి!

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్‌ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

ఈ వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో డిజైన్ చేసినట్లు కంపెనీ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు. మరో వేరియంట్ యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ తెలిపిన వివరాల మేరకు యాపిల్ వాచ్ వాయిస్ కమాండ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో ఏర్పాటు చేసిన యాపిల్ పే అనే పేమెంట్ అప్లికేషన్‌ను ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బిల్లులను సౌకర్యవంతంగా అలానే సురక్షితంగా చెల్లించవచ్చు.

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. మ్యాగ్నటిక చార్జర్ ఆధారంగా యాపిల్ వాచ్‌ను చార్జ్ చేసుకోవచ్చు. 18 గంటల బ్యాకప్‌తో

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్ గురించి మీకు తెలియాల్సిన విషయాలు..?

యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. వినియోగదారుడి ఫిట్నెస్‌తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్‌కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
13 things you didn’t know about the Apple Watch. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X