స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఆదా మార్గాలు

Posted By:

యాపిల్.. బ్లాక్‌బెర్రీ.. సామ్‌సంగ్ వంటి ప్రముఖ కంపెనీలు అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అందిస్తున్నాయి. గూగుల్ ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ 8, నోకియా సింబియాన్, యాపిల్ ఐఓఎస్ వంటి శక్తివంతమైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలతో వస్తోన్న ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు మనిషి ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతున్నాయి.

(ఇంకా చదవండి: ఐఫోన్ 7.. వెలుగులోకి మరికొన్ని పుకార్లు)

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటిరీ ఆయువు పట్టు లాంటిది. ఫోన్ సామర్థ్యాన్ని బట్టి బ్యాటరీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంపొందించే క్రమంలో అటు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇటు యాప్ డెవలపర్లు తమతమ పరిధి మేర కృషి చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సగటున ఒకటి నుంచి రెండు రోజుల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ గడవు తరువాత ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ వైబ్రేషన్‌లను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ స్ర్కీన్‌ను డిమ్ చేయటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

స్ర్కీన్ టైమ్‌అవుట్‌ను తగ్గించు కోవటం ద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది.

ఫోన్ ఇనాక్టివ్‌గా ఉన్న సమయంలో స్విచాఫ్ చేసి ఉంచటం ద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది.

ఫోన్‌లోని అనవసరమైన యాప్స్‌ను క్లోజ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

అవసరంలేని సమయంలో జీపీఎస్ ఫీచర్‌‍ను డిసేబుల్ చేసి ఉంచటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడుతుంది.

అవసరంలేని సమయంలో బ్లూటూత్, వై-ఫై, 3జీ/4జీ వంటి ఫీచర్లను ఆఫ్ చేసి ఉంచండి.

ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ యూఎస్బీ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు.

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.

స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి. అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగంలేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Tips to Conserve Your Smartphone Battery. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot