వెబ్‌సైట్‌లో డబ్బు సంపాదించే మార్గాలివే

|

ప్రతిరోజూ మనం ఇంటర్నెట్ ముందు గంటల తరబడి గడుపుతాం.ఇంకొందరయితే రోజుల తరడబి ఇంటర్నెట్ ముందే గడిపేస్తుంటారు. అయితే వారంతా ఏదో సంపాదిస్తున్నారా అంటే అది చూసే గడిపే వారికి తెలియాలి. చాలామంది ఇంటర్నెట్ ను ఫేస్ బుక్ అలాగే మెయిల్ ఛాటింగ్ వీటి కోసమే ఎక్కువ వాడుతుంటారు. అయితే ఇంటర్నెట్ లో మీకు తెలియకుండానే ఆదాయాన్ని అందించే మార్గాలు చాలానే ఉన్నాయి వాటన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more :మతి పోగొడుతున్న శ్యాంసంగ్ డిస్కౌంట్లు

ప్రకటనలు

ప్రకటనలు

ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన ఆదాయం. చాలా పురాతనమైనది. దీనికి సంబంధించిన ఆదాయం ఆయా కంపెనీల నుంచి మీకు వస్తుంది. యాహూలో డిస్ ప్లే యాడ్స్ అలాగే గూగుల్ సెర్చ్ యాడ్స్ యూ ట్యూబ్ లో వీడియో యాడ్స్ ఇలా ఒక్కో రకమైన దానిలో ఒక్కో రకమైన ఆదాయం వస్తుంది.

ఫ్రీమియం మోడల్

ఫ్రీమియం మోడల్

చాలా రకాలైన వెబ్ సర్వీసులు చేసే పనే ఇది. ఎంత మంది కావాలంటే అంత మందికి కంటెంట్ చేరవేయడం. దాన్ని పొందాలంటే పేమెంట్ చేయాలని షరతులు పెట్టడం. కస్టమర్లకు మాత్రమే కావల్సిన, అవసరమైన సమాచారం అందిస్తారు. చాలా రకాలైన సాస్ ప్రాడక్టులు ఇదే రకమైన పద్దతిని అవలంభిస్తున్నాయి.

ఈ కామర్స్
 

ఈ కామర్స్

90వ దశకంలో ఉన్నట్లు భారీ మాల్స్ లో అతి పెద్ద దుకాణాలు పెట్టి చేసే రిటైల్ వ్యాపారం పూర్తిగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ ధరల మంటలను తగ్గిస్తూ అమెజాన్ లాంటి ఈకామర్స్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి పన్నుపోట్లు లేకుండా జనానికి చవకైన ధరకు అన్ని రకాల వస్తువులను చేరవేశాయి.

అఫిలియేట్ మార్కెటింగ్

అఫిలియేట్ మార్కెటింగ్

బ్లాగ్స్‌లో హై ట్రాఫిక్ ఉండటం వల్ల సైన్ ఐన్ కి అఫ్లియేషన్ చేసుకోవడం, కంటెంట్ ను వారికి మాత్రమే అందించడం జరుగుతోంది. యూజర్లు లింక్ ని ఫాలో అయితే పబ్లిషర్ కు కమిషన్ అందుతుంది. అఫ్లియేషన్ సైట్ కు యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే వారిని వేరే సైట్ కు అమ్ముకునే అవకాశం ఉంటుంది. లింక్ ను వేరే సైట్ వైపు మార్చి దీన్ని సుసాధ్యం చేస్తారు. ఇటీవల మోటో జీ పై మంచి రివ్యూలు రావడంతో దాన్ని ఫ్లిప్ కార్ట్ లో పోస్టు చేసి అక్కడ అమ్మకాలను సాగించారు. ఇలా సైట్ కు ప్రత్యేక కమిషన్ వస్తుందన్నమాట.

సబ్‌స్క్రిప్షన్ మోడల్

సబ్‌స్క్రిప్షన్ మోడల్

న్యూస్ పేపర్లు, జిమ్, మ్యాగజైన్ లు ఇవన్నీ సబ్ స్క్రిప్షన్ మోడల్ కిందకు వస్తాయి. ఇది చాలాకాలంగా నడుస్తోన్న వ్యాపారమే. డిజిట్ డొమైన్ , సాఫ్ట్‌వేర్లపై కొన్నాళ్ల క్రితం వరకూ లైసెన్సింగ్ మోడల్ ఆదిపత్యాన్ని చూపించేది. నెమ్మదిగా ఇది సబ్ స్క్రిప్షన్ వైపు మళ్లింది. సాధారణంగా యూసేజి ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు. కొన్ని చార్జీలు మరీ ఎక్కువ అవుతుండటం సబ్ స్క్రిప్షన్ తెరపైకి వచ్చింది.

కంటెంట్ సర్వీసు

కంటెంట్ సర్వీసు

వివిధ రకాలైన సబ్ మోడల్స్ .. సాఫ్ట్ వేర్ యాజ్ సర్వీసు

లైసెన్సింగ్

లైసెన్సింగ్

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చాలా సాధారణ మోడల్ ఇది. సాస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ లాగానే అనిపించినా ఇది మరో రకం. యూసేజ్‌కి మాత్రమే లైసెన్సింగ్ తీసుకోవడం. ఇది మేధో సంపత్తి హక్కు కాబట్టి సాధారణంగా కాలపరిమితి కలిగి ఉంటుంది. టెర్రిటరీ, ప్రాడక్ట్‌లో రకాలు, వాటి వాల్యూమ్ పై ఆధారపడి ఉంటుంది.

డేటా అమ్మకం

డేటా అమ్మకం

నెట్ ప్లాట్‌ఫాం వాడుకున్నందుకు మీరు డబ్బులు చెల్లించకపోయినా వాళ్లకు మాత్రం మీ నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. హై క్వాలిటీ, ప్రత్యేక మైన డేటాలు డిజిటల్ ఏజ్ లో చాలా ప్రాధాన్యం కలిగినవి. చాలా సంస్థలు థర్డ్ పార్టీకి డేటాని అమ్మడానికి సిద్ధపడుతున్నాయి. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల సర్వీసులకు మనమెలాంటి చెల్లింపులు చేయం. మీ డేటాని గొప్పదైన, దుర్భేద్యమైనదిగా చూపించి వాళ్లు ప్రకటనలు పొందుతాయి. ఈ లెక్కన చూస్తే మీరు వాళ్ల సేవలను ఉపయోగించుకోవడం లేదు. మిమ్మల్నే వాళ్లు వాడుకుంటున్నారు.

స్పాన్సర్షిప్, డొనేషన్స్

స్పాన్సర్షిప్, డొనేషన్స్

చాలా రకాల సర్వీసులు ప్రభుత్వ రంగ సంస్థలు స్పాన్సర్ చేస్తాయి. మేజర్ ఫండ్ లు నేరుగా సాయపడతాయి. దీనికి ఉదాహరణంగా ఖాన్ అకాడమీ నడిచేది గేట్స్ ఫౌండేషన్, గూగుల్ ఇచ్చిన ఫండ్స్ తోనే. వికీపీడియా లో కూడా ఎక్కువ, తక్కువ తేడా లేకుండా ఫండ్స్ ఇవ్వడం పరిపాటిగా మారింది.

బిల్డ్ టు సెల్

బిల్డ్ టు సెల్

ఇది కౌంటర్ ఇనిషియేటివ్. ఇది బెస్ట్ రెవెన్యూ మోడలని చెప్పలేం. ప్రధానంగా ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండవు. చాలా కంపెనీలు ట్రాక్షన్ ను బిల్డ్ చేసినప్పటికీ దానితో ఎలా సొమ్ముచేసుకోవడమో తెలియడం లేదు. బాగా బిల్డ్ చేసుకొని ఏదో ఒక మంచి రోజు చూసి అమ్మేయడమే. ఆరోజు కోసం ఎదురు చూడాల్సిన ఉంటుంది. ఆరోజు వస్తే మంచిది రాకపోతే అలా ఎదురు చూపులు తప్పవు.

Best Mobiles in India

English summary
here write 10 Ways To Actually Make Money From a Website!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X