ఈ 10 యాప్స్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదుర్సే!!

Posted By:

మీరు కొత్తగా కొనుగోలు చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డీఫాల్ట్ గానే అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. వాటికంటే మెరుగైన ఫీచర్లను మీరు ఆసిస్తున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక ఉచిత అప్లికేషన్‌లు మీ ఆండ్రాయిడ్ డివైస్ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఓ లుక్కేయండి మరి....

ఇంకా చదవండి: విశ్వ రహస్యాల పై కొనసాగుతోన్న ప్రయోగాల పరంపర

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇమేజ్ గ్యాలరీ యాప్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చే గ్యాలరీ యాప్స్ నాణ్యమైన పనితీరును ప్రదర్శించినప్పటికి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు థర్డ్ పార్టీ అప్లికేషన్‌లు ఇమేజ్ గ్యాలరీకి మరిన్ని హంగులను అద్దుతున్నాయి. ఉదాహరణకు క్విక్‌పిక్. ఈ ఇమేజ్ గ్యాలరీ యాప్ మల్టిపుల్ వ్యూ ఆప్షన్స్, కలర్ థీమ్స్, క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్, వై-ఫై ట్రాన్స్ ఫర్, పాస్‌వర్డ్ లాకుడ్ సెక్యూర్ ఫోల్డర్స్, బుల్ట్‌ఇన్ ఎడిటర్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఆఫర్ చేస్తుంది.

 

ఈ-మెయిల్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చే జీమెయిల్ యాప్ ఇంకా ప్రత్యేక ఇమెయిల్ యాప్స్ ప్రాథమిక కార్యాచరణను మాత్రమే అందిస్తాయి. ఈ డీఫాల్ట్ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా క్లౌడ్ మ్యాజిక్ పేరుతో ఓ ప్రత్యేకమైన యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోంది. జీమెయిల్, అవుట్ లుక్, ఎక్స్‌ఛేంజ్, ఐమ్యాప్, ఐక్లౌడ్, గూగుల్ యాప్స్ వంటి 5 రకాల అకౌంట్ల‌ను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. యునిఫైడ్ ఇన్‌బాక్స్, పాస్‌వర్డ్ లాక్, పుష్ నోటిఫికేషన్స్, కస్టమ్ ఫోల్డర్ సింక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.

 

క్యాలెండర్

ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ క్యాలెండర్ యాప్ అత్యుత్తమంగా పనిచేస్తుంది. మీరింకా అదనుపు ఫీచర్లు కోరుకుంటున్నట్లయితే SolCalendar యాప్‌ను ప్రయత్నించిండి.

 

కెమెరా

గూగుల్ తన సొంత కెమెరా యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఫోటోస్పియర్ , 360 డిగ్రీ పానోరమా, వీడియో రికార్డింగ్ సమయంలోనే కావల్సిన ఫోటోలను క్యాప్చర్ చేసుకోవటం, లెన్స్ బ్లర్ ఫీచర్ వంటి ప్రత్యేకతలు ఈ యాప్ లో ఉన్నాయి.

 

కాంటాక్ట్స్

గూగుల్ ప్లే స్టోర్‌‍లో లభ్యమవుతోన్న 6 Degrees, Addappt అనే యాప్స్ మీ ఫోన్ కాంటక్ట్స్‌కు మరిన్ని కొత్త హంగులను అద్దుతాయి.

 

డైలర్

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మరో యాప్ ట్రూడైలర్ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చిన డైలర్‌తో పోలిస్తే వేగవంతమైన సెర్చ్‌ను ఆఫర్ చేస్తుంది.

 

కీబోర్డ్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ‘స్విఫ్ట్ కీ' అనే అప్లికేషన్ 70 థీమ్‌లతో కూడిన అడ్జస్టబుల్ సైజ్ కీబోర్డ్‌లను మీకు ఆఫర్ చేస్తుంది.

 

ఫైల్ మేనేజర్

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ యాప్ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చే బేసిక్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 ways to make Android phones even more awesome. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot