మొబైల్ ఫోన్‌లు.. మారిన బతుకులు

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన మొబైల్ ఫోన్ లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేసాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్‌ఫోన్‌లు నేటి ఆధునిక సమాజం పై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయంటే..? కూర్చున్న చోట నుంచే ప్రపంచాన్ని వీక్షించేంత. స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా సభ్య సమాజంలో సంభవించిన పెను మార్పులను ఇప్పుడు చూద్దాం...

ఇంకా చదవండి: స్మార్ట్‌ఫోన్‍‌ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లలోని గూగుల్ మ్యాప్స్ ఫీచర్ సహాయంతో గమ్యస్థానాల ఆచూకీని సెకన్ల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాం.

స్మార్ట్‌ఫోన్‌లు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేయటంతో కూర్చున్న చోట నుంచే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా నచ్చిన వస్తువులను కొనుగోలు చేయగలుగుతున్నాం.

స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న కాల్, టెక్స్ట్, ఈ-మెయిల్, సోషల్ మీడియా వంటి కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా ప్రపంచానికి నిరంతరం అందుబాటులో ఉండగలుగుతున్నాం.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వివిధ అంశాలకు సంబంధించిన అప్‌డేట్‌లను వివిధ సోర్సుల ద్వారా స్మార్ట్ ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నాం.

పాటలు వింటూ.. వీడియోలోను స్ట్రీమ్ చూస్తూ.. ఆన్ లైన్ గేమ్స్ ను ఆస్వాదిస్తూ చక్కనైన వినోదాన్ని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా పొందగలుగుతున్నాం.

గంటల తరబడి క్యూలో నిలుచొనే అవసరం లేకుండా డబ్బు చెల్లింపు మొదలుకుని, సినిమా టికెట్ కొనుగోలు వరకు అన్ని లావాదేవీలను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే నిర్వహించుకోగలుగుతున్నాం.

స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచ చరిత్రకు సంబంధించి ఏ విషయాన్ని అయినా సెకన్ల వ్యవధిలో తెలుసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌‍ల కోసం అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లు నిజంగా అద్భుతం. వీటి ద్వారా నిరంతరం మన మిత్రులకు కనెక్ట్ అయి ఉండొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 ways mobile devices are changing society. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot