మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తోన్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే 10 టిప్స్ మీకోసం...
ఇంకా చదవండి: యాపిల్ వాచ్ భారత్‌లో ఎప్పుడు..? ధర ఎంత..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి లాగిన్ అప్రూవల్స్‌ను సెట్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టంగా ఉంటుంది.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
"2-factor authentication"ను యాక్టివేట్ చేసుకునేందుకు Settings -> Security -> 'Login Approvals'లోకి వెళ్లండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొక డివైస్ లో ఓపెన్ చేసి లాగ్ అవుట్ చేయటం మర్చిపాయారు. అయితే ఆ సెషన్‌ను రిమోట్ విధానం ద్వారా సైన్ అవుట్ చేయవచ్చు. అది ఏలా సాధ్యం అంటారా..? మీరు కాకుండా వేరొకరు వాడుతున్నట్లు తెలిస్తే ఆ యాక్టివిటీని ఎండ్ చేసేందుకు Settings -> Security -> 'Where You're Logged In' ఆప్షన్‌లోకి వెళితే సరిపోతుంది.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
కొన్ని సందర్భాలలో చిరాకుపుట్టించే మెసేజులు మన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ పై సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే ఇలా ఎవరు పడితే వాళ్లు మీ టైమ్ లైన్ పై మెసేజ్ లను పోస్ట్ చేయకుండా, మీ టైమ్‌లైన్ కొద్ది మందికి మాత్రమే కనిపించేలా Settings -> Timeline and Tagging ->'Who can add things to my timeline?' ను మార్చుకోండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

మీ ఫేస్‌బుక్ అకౌంట్ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే..?
ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు. ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి. ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది. గూగుల్ యాడ్ బ్లాక్ ప్లస్ ఫీచర్‌ను మీబ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.


Click it and Unblock the Notifications








