శాస్ర్తవేత్తల అసహజ మరణాలు..భారత్‌లో అణు‌ సంక్షోభం !

Posted By:

గుండెలు పిండేసే వాస్తవాలు ఇప్పుడు మన కళ్ల ముందుకు వచ్చాయి. యావధ్భారతం షాక్ తో తల్లడిల్లే కఠోర వాస్తవాలు ఇప్పుడు అణు ఇంధన విభాగం నుంచి మన కళ్ల ముందుకు వచ్చాయి. దేశ భధ్రతకు ఆయువు పట్టుగా నిలిచే అణు శాస్ర్తవేత్తల అసహజమరణాలు ఒక్కసారిగా దేశ ప్రజలను కంటతడి పెట్టించాయి. గుండెల్ని పిండేసే ఈ నిజాలు ఇప్పడు భారత రక్షణ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓ వైపు పొరుగు దేశం తన అణ్వస్త్ర పాటవంతో దూసుకుపోతుంటే మన దేశం ఇలా వరస అసహజ మరణాలతో ఇలా ఉండిపోవడం దేశ ప్రజలనే కాదు..భారత రక్షన రంగాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.. గుండెలు పిండేసే నిజాలు చదవండి.

Read more:అణు ఒప్పందంలో పెద్దన్న డబుల్ గేమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అగ్రరాజ్యం అమెరికా వడివడిగా అడుగులు

ఓ వైపు దాయాది దేశం ఏటేటా తన అణ్వస్త్ర పాటవాన్ని పెంచుకుంటూపోతోంది. ఇండియాకు పక్కలో బల్లెంలా తయారైంది. తాజాగా ఆ దేశంలో అణు ఒప్పందం చేసుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారత్ కూడా ఈ దిశగా తన అణ్వస్త్ర పాటవాన్ని పెంచుకోకపోతే ముప్పు తప్పదన్న వాదన వినిపిస్తోంది.

గడిచిని నాలుగేళ్లలో భారత్ కు అనుకోని ఎదురుదెబ్బ

అయితే గడిచిని నాలుగేళ్లలో భారత్ కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రజలు ఆత్మరక్షణాయుధాలను కోల్పోయింది. ఇంకా చెప్పాంటే రక్షణ వ్యవస్థకు మూల స్థంభంగా నిలిచే అణ్వాయుధాలను తయారు చేసే శాస్ర్తవేత్తలను కోల్పోయింది. ఒకరు ఇద్దరు కాదు దాదాపు ఏకంగా 11 మందిని గడిచిన నాలుగేళ్లలో ఇండియా కోల్పోయింది.

అణు శాస్ర్తవేత్తలవి అసహజమరణాలేనన్న కఠోర వాస్తవం

అయితే చనిపోయిన అణు శాస్ర్తవేత్తలవి అసహజమరణాలేనన్న కఠోర వాస్తవం భారత్ ను ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారహక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు అణు శక్తి విభాగం ఇచ్చిన సమాధానం ఈ ఆందోళనకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.

ఎక్కువమంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం

చనిపోయిన 11 మంది అణు శాస్ర్తవేత్తల్లో ఎక్కువమంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం మరింత దిగ్భాంతికి గురి చేస్తోంది.ఓ శాస్ర్తవేత్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఇద్దరు శాస్ర్తవేత్తలు ప్రయోగశాలల్లో జరిగిన పేలుల్లో మరణించారు.

ఎందుకిలా..

ట్రాంబేలోని బార్క్ లో పని చేస్తున్న ఇద్దరు శాస్ర్తవేత్తలు ఉరేసుకుని చనిపోయారు. మరో ఇద్దరు శాస్ర్తవేత్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సైంటిస్ట్ ను ముంబైలోని ఆయన స్వగృహంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించడంలో పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి సాధించలేదు.

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

ముంబైలో బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో అణు శాస్ర్తవేత్తగా పని చేస్తున్న బాబా పాటక్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.ఈయన బైక్ మీద వెళ్తుండగా సహచర శాస్ర్తవేత్త కారు అనుకోకుండా ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించారు.

మాధవన్ అయర్

2012 ఫిబ్రవరి బాబా ఆటో మేటిక్ రీసెర్చ్ లో అణు శాస్ర్తవేత్తగా పని చేస్తున్న మరో సైంటిస్ట్ మాధవన్ అయర్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ముంబైలోని ఆయన ఇంటిలో ఈ దారుణ ఘటన జరిగింది.ఈ ఘటనకు సబంధించి నిందుతులును గర్తించడంలో పోలీసులు ఎటువంటి పురోగతి ఇప్పటిదాకా సాధించలేదు.

కొద్ది రోజులకే మరో షాక్

మాధవన్ అయర్ ని కోల్పోయిన కొద్ది రోజులకే మరో షాక్. ముంబైలోని బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో అణుశాస్త్రవేత్తగా పనిచేస్తున్న టిటాస్ పాల్ ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది..ఈమె వయస్సు కేవలం 27 సంవత్సరాలు.నార్త్ ముంబైలోని ట్రాంబేలోని బార్క్ కాలనీలో నివాసముంటున్నారు. మరో అణు శాస్ర్తవేత్త మాధవన్ అయర్ మరణించిన 10 రోజులకే ఈ యువ శాస్ర్తవేత్త తీరని లోకాలకు వెళ్లారు. ఎందుకున్నది వివరాలు తెలియలేదు.

పేలుడులో ఇద్దరు యువ శాస్ర్తవేత్తలు .

ఇక ముంబైలోని బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ లో జరిగిన పేలుడులో ఇద్దరు యువ శాస్ర్తవేత్తలు మరణించారు. ఈ ఇద్దరు యువ శాస్ర్తవేత్తలు ప్రయోగశాలల్లో తమ ప్రయోగంలో నిమగ్నమై ఉండగా అనుకోకుండా పేలుడు సంభవించింది. వారు ఆ పేలుడు ధాటికి అక్కడికక్కడే మరణించారు చనిపోయిన యువ శాస్ర్తవేత్తల పేర్లు ఉమాంగ్ సింగ్,ప్రీతం బాగ్

బార్క్ సైంటిస్ట్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు

బార్క్ సైంటిస్ట్ ఉమెన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు అలాగే బాబా ఆటేమేటిక్ రీసెర్చ్ లో అణు శాస్త్రవేత్త కూడా జీవితం మీద విర్తకి కలిగిందో ఏమో కాని సూసైడ్ చేసుకున్నారు. ఉమా నర్సింగరావు అనే 64 సంవత్సరాలు సీనియర్ శాస్ర్తవేత్త తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా నార్త్ ముంబైలోని ట్రాంబేలో జరగడం చాలా బాధాకరమైన విషయం.

శాస్ర్తవేత్తల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక.

శాస్ర్తవేత్తల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక.

శాస్ర్తవేత్తల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక.

శాస్ర్తవేత్తల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక.

శాస్ర్తవేత్తల మరణాలపై వీడని మిస్టరీ ..వారి కేసులో పురోగతి.

శాస్ర్తవేత్తల మరణాలపై వీడని మిస్టరీ ..వారి కేసులో పురోగతి.

శాస్ర్తవేత్తల మరణాలపై వీడని మిస్టరీ ..వారి కేసులో పురోగతి.

శాస్ర్తవేత్తల మరణాలపై వీడని మిస్టరీ ..వారి కేసులో పురోగతి.దీనికి సంబంధించిన కాఫీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 11 Indian Nuclear Scientists Died Unnatural Deaths in 4 Years: Government
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot