అణు ఒప్పందంలో పెద్దన్న డబుల్ గేమ్

Written By:

పెద్దన్న అమెరికా తనదైన శైలిలో డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా అదే తరహా ఒప్పందాన్ని పాకిస్తాన్ తో కూడా కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. ఈ నెలలో పాక్ ప్రధాని నవాజ్ షరీప్ యూఎస్ పర్యటన నేపధ్యంలో ఈ డీల్ కుదరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు పత్రిక తెలిపింది. కాగా పాక్ అణు కార్యక్రమాలను నియంత్రించేందుకు ఈ డీల్ కు అమెరికా మొగ్గు చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read more:ప్రపంచాన్నే టార్గెట్ చేసిన పాకిస్తాన్

వాస్తవిక అవసరాలకు మాత్రమే అణు పరిజ్ఙానాన్ని వాడాలని ఇండియా నుంచి అణు ప్రమాదం ఉందని చెబుతూ ఆయుధాలు తయారు చేయకుండా ఉండాలన్న షరతులపై సాంకేతికతను అందిస్తామని అమెరికా స్పష్టం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. కాగా తొలి దశలో పాకిస్తాన్ పై ఉన్న 48 ఎన్ ఎస్జీ దేశాల నిషేధాన్ని ఎత్తి వేస్తారని సమాచారం.ఆపై అణు సాంకేతికత,అత్యాధునిక పరికరాలను అందిచంనుంది. ఇప్పటికే అణ్వస్ర్త పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసి అణ్వాయుధాలను సమకూర్చకున్న పాకిస్తాన్ అమెరికా ఇచ్చే పరిజ్ఙానంతో మరిన్ని విధ్వంసక ఆయుధాలు తయారు చేయవచ్చన్న అనుమానాలను తోసి పుచ్చలేం. అమెరికా గతంలో చేసుకున్న ఒప్పందాలు తీరు ఎలా ఉందో చూడండి.

Read more: రణ రంగం.. పాక్ వెనుక చైనా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కోడై కూసిన అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. 2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు "పౌర అణు ఒప్పందం" పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు అప్పుడు వార్తలు రాశాయి.

పాకిస్తాన్ ఒప్పందాన్ని ..

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. పాకిస్ధాన్ తనకు కూడా అటువంటి ఒప్పందం కావాలని అమెరికాని కోరితే అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.

భారతదేశంలో 17,500 కోట్ల డాలర్ల అణు మార్కెట్

భారతదేశంలో 17,500 కోట్ల డాలర్ల అణు మార్కెట్ ఉందని జనరల్ ఎలక్ట్రిక్, వెస్టింగ్ హౌస్ కంపెనీల అంచనా. నష్టపరిహార చట్టం వల్ల భారతీయ అణుమార్కెట్‌లోకి ప్రవేశించలేకపోతున్నామని అమెరికన్ అణు పరిశ్రమ ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.ఈ నేపథ్యంలోనే భారత్ - అమెరికా అణు ఒప్పందం కుదిరింది.

అమెరికా కంపెనీలు గుర్రు

అణు ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా అమెరికా కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. అణు విద్యుత్‌ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే యంత్రాలు సరఫరా చేసిన విదేశీ కంపెనీలు సైతం నష్టపరిహారం చెల్లించాలన్న నిబంధనపై ఈ కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

యుఎస్‌ కంపెనీలు ఫిర్యాదు

ఈ నిబంధన ఉన్నంత వరకు భారత్‌లో అణు కేంద్రాలు ఏర్పాటు చే సే ప్రసక్తేలేదని అమెరికాకు చెందిన జిఇ కంపెనీ చైర్మన్‌ జెఫ్‌ ఇమ్మెల్ట్‌ ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నిర్ణయా లు తీసుకోవడంలో అధికార యంత్రాంగం బాగు చేసే సమస్య అలాగే ఉందని యుఎస్‌ కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి.

రూ.16,250 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు కాంట్రాక్టుకు ఆమోదం

ఈ విమర్శలతో ప్రధాని మోదీ ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు ప్రారంభింది. అమెరికా పర్యటనకు ముందే అమెరికా నుంచి దాదాపు రూ.16,250 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు కాంట్రాక్టుకు ఆమోదం తెలిపింది.

అమెరికా ఆయుధ కంపెనీలు భారత మార్కెట్‌పై పెద్ద ఆశలు

నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నా అమెరికా ఆయుధ కంపెనీలు భారత మార్కెట్‌పై పెద్ద ఆశలు పెట్టుకున్నాయి. వచ్చే పదేళ్లలో భారత్‌ దాదాపు రూ.65 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు దిగుమతి చేసుకునే అవకాశం ఉండడం ఈ కంపెనీలను ఆకర్షిస్తోంది.

ఎన్.ఎస్.జి అనే దాని గురించి ఓ సారి తెలుసుకోవాలి

ఈ నేపథ్యంలో ఎన్.ఎస్.జి అనే దాని గురించి ఓ సారి తెలుసుకోవాలి. ఇది అణు పదార్ధాలు, పరికరాలు తయారు చేయగల దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్ధ. ఇదొక పెత్తందారీ గ్రూపు. దీనిలో 46 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు అణు పదార్ధాలు గానీ, పరికరాలు గానీ ఎన్.ఎస్.జి కి బైట ఉన్న దేశాలకు అమ్మాలంటే ఆ దేశాలు ఎన్.పి.టి (Nuclear Non-Proliferation Treaty) ఒప్పందంపై సంతకాలు చేసి ఉండాలి.

సంతకం

అలా సంతకం చేయనట్లయితే అటువంటి దేశాలకు అణు పదార్ధాలు, పరికరాలు సరఫరా చేయడానికి వీల్లేదు. ఎన్.పి.టి పై సంతకం చేయడంతోనే ఆటోమేటిక్‌గా ఆ దేశాలకు అణు పరికరాలను అమ్మరు. సంతకం చేసిన తర్వాత ఆ దేశాలు కొనదలచుకున్న అణు పదార్ధాలుగానీ, అణు పరికరాలుగానీ దేనికి ఉపయోగపెడుతున్నదీ ఎన్.ఎస్.జి కి చెప్పాల్సి ఉంటుంది.

ఎన్.పి.టి అంతా అమెరికా కనుసన్నల్లో..

అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికైతే అణు పరికరాలు, పదార్ధాలను అమ్మవు. శాంతియుత ప్రయోజనాలకోసం మాత్రమే ఉపయోగిస్తానంటేనే అమ్మడానికి అంగీకరిస్తాయి.అయితే ఈ ఎన్.పి.టి అంతా అమెరికా కనుసన్నల్లో నడుస్తుందన్నది జగమెరిగిన సత్యం.

ణు గూండాయిజం

ఇక అమెరికా, తాను మిత్ర దేశాలుగా చెప్పుకునే దేశాలపైన కూడా ఈ అణు గూండాయిజం చేస్తుంది. తన బద్ధ శత్రువైన ఇరాన్‌ను ఐ.ఎ.ఇ.ఎ ను అడ్డు పెట్టుకుని అమెరికా ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరాన్ వాస్తవానికి ఎన్.పి.టిపై సంతకం చేసిన దేశం.

విద్యుత్ ఉత్పత్తి కోసం అణు కర్మాగారాలను..

యురేనియం శుద్ధి చేసే టెక్నాలజీని ఇరాన్, పాకిస్ధాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ద్వారా సంపాదించుకుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం అణు కర్మాగారాలను నిర్మించుకుంది. వైద్య ప్రయోజనాల కోసం కూడా అణు రియాక్టర్లను నిర్మిస్తున్నామని అది చెబుతోంది. కాని ఇరాన్ అణ్వస్త్ర రాజ్యంగా మారుతుందేమోనని అమెరికా, యూరప్‌లు భయపడుతున్నాయి.

ఇరాన్ అణు వసతుల సమాచారాన్ని సేకరించి అమెరికాకి ..

ఎన్.పి.టినీ, ఐ.ఎ.ఇ.ఎ ని అడ్దు పెట్టుకుని ఇరాన్ అణు వసతులన్నింటినీ చెకింగ్ పేరిట తన గూఢచారులను కొందరిని చొప్పించింది. వారు ఇరాన్ అణు కర్మాగారాలని చెక్ చేసే పేరిట ఇరాన్ అణు వసతుల సమాచారాన్ని సేకరించి అమెరికాకి అందించారు. ఇది పసిగట్టిన ఇరాన్ వారిని దేశం నుండి వెళ్ళగొట్టడమే కాక ఐ.ఎ.ఇ.ఏ ఇన్‌స్పెక్టర్లు దేశంలోకి రావడానికి అనుమతిని నిరాకరించింది.

ఇరాన్ ఒప్పు కోలేదు

ఇన్‌స్పెక్షన్ పేరిట అమెరికా తరపున గూఢచర్యం చేస్తే ఏదేశం ఒప్పుకుంటుంది? ఇరాన్ ఒప్పు కోలేదు. ఈ సంగతుల్ని దాచిపెట్టి ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తున్నదంటూ ప్రచారం చేసి ఐక్యరాజ్య సమితి చేత ఆంక్షలు విధింప జేసింది అమెరికా.

ఆంక్షలు విధించడం వెనక అసలు కారణం

ఆంక్షలు విధించడం వెనక అసలు కారణం అమెరికా, యూరప్‌లు చెప్పేది కాదు. శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే, ఇరాన్‌కి అణు ఇంధనానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందటానికి వీల్లేదు. అణు ఇంధనం ఐన యురేనియం శుద్ధి చేయగల పరిజ్ఞానం ఇరాన్ కి తెలియకూడదు.

అమెరికా గూఢచారి సంస్ధ సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్

యురేనియం శాంతియుత ప్రయోజనాలకోసమైతే 20 శాతం శుద్ధి చేస్తే సరిపోతుంది. అదే అణ్వాయుధాలు తయారు చేయడానికైతే 90 శాతం శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ఆ 20 శాతానికి మించి శుద్ధి చేసిన దాఖలాలు ఇంతవరకూ లేవు. ఆ విషయం అమెరికా గూఢచారి సంస్ధ సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ లు తేల్చి చెప్పాయి.

అణు బాంబు తయారు చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు

ఇరాన్ అణు బాంబు తయారు చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుందని మొస్సాద్ ప్రకటించింది. గూఢచార సంస్ధలు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయదలుచుకున్నదని ఆరోపిస్తూ, అమెరికా యూరోప్ లు భద్రతా సమితి చేత నాల్గవసారి ఆంక్షలు విధింపజేశాయి.

‘స్టక్స్‌నెట్’ అనే వైరస్‌ని ప్రవేశ పెట్టాయి

సి.ఐ.ఏ, మొస్సాద్ లు అంత నమ్మకంగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుందని ఎలా చెప్పగలిగాయి? ఎలాగంటే ఇరాన్, అణు కర్మాగారాలలో ఉన్న కంప్యూటర్లలో మొస్సాద్, సి.ఐ.ఏలు రహస్యంగా ‘స్టక్స్‌నెట్' అనే వైరస్‌ని ప్రవేశ పెట్టాయి.

ఈ వైరస్ శక్తివంతమైన వినాశనకారి

ఈ వైరస్ శక్తివంతమైన వినాశనకారి. ముఖ్యంగా పరిశ్రమల్లో వినియోగించే కంప్యూటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన వైరస్ ఇది. సీమన్స్ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ పరికారలపైన ఇది ఇంకా శక్తివంతంగా పని చేస్తుంది. కంప్యూటర్ ప్రోగ్రాంలను నిర్వీర్యం చేస్తుంది.

కంప్యూటర్లలో 60 శాతం ఇరాన్ కంప్యూటర్లే

ప్రపంచంలో ఈ వైరస్ బారిన పడిన కంప్యూటర్లలో 60 శాతం ఇరాన్ కంప్యూటర్లే. 18 శాతం ఇండోనేషియా కంప్యూటర్లు కాగా, 8.5 శాతం కంప్యూటర్లు ఇండియాకి చెందినవి కావడం గమనార్హం. 

ఇండియా అణ్వస్త్ర రాజ్యంగా మారడం ..

ఇండియా అణ్వస్త్ర రాజ్యంగా మారడం మొదటినుండీ అమెరికా వ్యతిరేకిస్తున్న సంగతిని గుర్తుంచుకుంటే ఈ వైరస్ బారిన ఇండియా కూడా పడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write What a US-Pakistan nuclear deal could mean for India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot