మైక్రోసాఫ్ట్‌‌కి మిగిలిన చేదు జ్జాపకాలు

Written By:

మైక్రోసాఫ్ట్ ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచపటంలో తనదైన ముద్రవేసుకున్న మైక్రోసాఫ్ట్.. టెక్నాలజీ రంగంలో ఇప్పటికీ మిగతా కంపెనీలకు సవాల్ విసురుతూనే ఉంది. అప్పటినుంచి ఇప్పటిదాకా మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ప్రతి ఉత్పత్తి కష్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. మైక్రోసాఫ్ట్ నుంచి ఏం కొత్త ప్రొడక్ట్ వస్తుందా అని కష్టమర్లు ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు..అలాంటి మైక్రోసాప్ట్ కు కూడా కొన్నిచేదు అనుభవాలు ఉన్నాయంటే నమ్మగలరా..అవును నిజం.. మైక్రోసాప్ట్ నుంచి వచ్చిన కొన్ని ఉత్పత్తులు కష్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. అవి కనుమరుగయిపోయాయి. అలాంటి ఉత్పత్తులను ఓ సారి చూద్దాం.

Read more: రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ పోర్ట్ రెయిట్ ( Microsoft Portrait)

దీన్ని 1990లో లాంచ్ చేశారు. ఇది లో బిట్ రేట్ వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్ వేర్. స్కైప్ రాకముందు ఇది చాలా పాపులర్. స్కైప్ వచ్చి దీన్ని తొక్కింది. స్కైప్ లో ఇప్పుడు రోజుకు 3 మిలియన్ల నిమిషాలు వీడియో కాలింగ్ నమోదవుతున్నది.

టెర్రసర్వర్ ( Terraserver)

దీన్ని 1997లో లాంచ్ చేశారు. ఇది గూగుల్ మ్యాప్ రాకముందు శాటిలైట్ ఇమేజ్. అయితే గూగుల్ మ్యాప్ రావడంతో ఇది కనుమరుగయింది. చివరకు 1999లో అంటే కెవలం రెండు సంవత్సరాల్లోనే కనుమరుగయింది. ఇప్పుడు అంతా ప్రపంచ పటాన్ని గూగుల్ మ్యాప్ లోనే చూస్తున్నారు.

ఎమ్‌ఎస్‌ఎన్ ( MSN)

దీన్ని 1995లో లాంచ్ చేశారు. ఇదొక ఫస్ట్ సోషల్ నెట్ వర్క్ . ఫేస్ బుక్ రాకముందు ఇదే పెద్ద సంచలనం.అయితే ఎప్పుడయితే ఫేస్ బుక్ బయటకు వచ్చిందో అప్పుడు ఇది కనుమరుగయిపోయింది. చివరకు 2012లో ఇది కంటికి కనిపించకుండా మాయిమైపోయింది. ఇప్పుడు ఫేస్ బుక్ ప్రపంచాన్ని నడిపిస్తోంది.

విండోస్ మొబైల్ (Windows Mobile)

దీన్ని 2000లో లాంచ్ చేశారు. స్మార్ట్ ఫోన్ రంగంలోనే సంచలనం రేపిన్ మొబైల్ ఇది. హై ఎండ్ డివైస్ సిస్టంతో వచ్చిన ఈ విండోస్ మొబైల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని ఓ ఊపు ఊపింది. అయితే తరువాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల రాకతో ఇది పక్కకు వెళ్లిపోయింది. ఆ తరువాత దీన్నే విండోస్ ఫోన్ గా 2012లో తిరిగి లాంచ్ చేసింది.

ట్యాబ్లెట్ పీసీ ( Tablet PC in 2002)

దీన్ని 2002లో లాంచ్ చేశారు. టచ్ స్క్రీన్ తో వచ్చిన మొట్టమొదటి ట్యాబ్లెట్ మైక్రోసాప్ట్ దే. విండోస్ ఎక్స్ పీ మీద రన్ అయి చాలా స్టైలిష్ గా ఉడేంది. బిల్ గేట్స్ దీనిని లాంచ్ చేసిన కొద్ది రోజులకే మళ్లీ ఇది వెన్కి వెళ్లిపోయింది. 2003 నుంచి 2012 మధ్యలో ఒక్క ట్యాబ్లెట్ కూడా రాలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ట్యాబ్లెట్లు దర్శనమిస్తున్నాయి.

మైక్రోసాప్ట్ మెయిల్ (Microsoft Mail)

దీన్ని 1991లో లాంచ్ చేశారు. లోకల్ నెట్ వర్క్ నుండి మేసేజెల్ పంపడం అలాగే రిసీవ్ చేసుకోవడంలో ఈ మెయిల్ దే అగ్రస్థానం. మొట్టమొదటిది కూడా ఇదే. అయితే ఇది ఇప్పుడు కనుమరుగైపోయింది. దీని స్థానంలో ఇంటర్ నెట్ ఈ మెయిల్ అకౌంట్ వచ్చేసింది. అవుట్ లుక్, గూగుల్ ఇప్పుడు మెయిల్ రాజ్యాన్ని ఏలుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ బాబ్

విండోస్ 3.1లో వాడే గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ ఇది. దీన్ని 1992లో లాంచ్ చేశారు. 95లో లాంచ్ అయిన విండోస్ కు ఈ టూల్ ఓ సంచంలనం. అయితే ఇప్పుడు అనేక రకాలైన గ్రాపికల్ ఇంటర్ ఫేస్ లు వచ్చాయి. దాదాపు 1.5 బిలియన్ల గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లు వాడకంలో ఉన్నాయి.

టైమెక్స్ వాచ్ ( Timex DataLink smartwatch)

దీన్ని 1994లో లాంచ్ చేశారు. అయితే దీన్ని మైక్రోసాప్ట్ ఒక్కటే డెవలప్ చేయలేదు. టైమెక్స్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఇది నాసా స్పేస్ ట్రావెల్ లో కూడా కనిపించింది. అయితే ఇది వాణిజ్యపరంగా దీన్ని తీసుకోలేదు. కాని ఇప్పుడు వాచీలు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి.

ఎమ్‌ఎస్‌ఎన్ టీవీ ( MSN TV)

దీన్ని 1996లో లాంచ్ చేశారు. అయితే లాంచ్ చేసిన సంవత్సరంలోనే ఇది 425 మిలియన్ల డాలర్లతో లాంచ్ చేసింది. ఇంటర్ నెట్ కనెక్షన్ తో ఇంటరె నెట్ బ్రౌజింగ్ కోసం దీన్ని ఉపయోగించారు. అయితే స్మార్ట్ టీవీల రాకతో ఇది 2013లో డౌన్ అయింది. ఇప్పుడు శ్యాంసంగ్, ఎల్ జీ, ఆపిల్ మార్కెట్ ని ఏలేస్తున్నాయి.

మైక్రోసాప్ట్ కొరియర్ ( Microsoft Courier)

దీన్ని 2008లో తయారుచేసినా మైక్రోసాప్ట్ దీన్ని 2010కి వచ్చేసరికి ఇది కనుమరుగైపోయింది. ఆ సంవత్సరం యాపిల్ ఐ ప్యాడ్ రాకతో ఇది దీన్ని పక్కనబెట్టారు. దీనిలో కెమెరా తో పాటు ఫోల్డింగ్ లాంటి డిస్ ప్లే ఆప్సన్స్ ఉన్నాయి.

జ్యూన్ మ్యూజిక్ పాస్ ( Zune Music Pass)

దీన్ని 2010లో లాంచ్ చేశారు. ఇదొక మ్యూజిక్ ప్లేయర్. ఆన్ లిమిటెడ్ మ్యూజిక్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఇది మరుగునపడిపోయి దీని స్థానంలో స్పాట్ ఫై, ఆపిల్, గూగుల్ లాంటి వాటిల్లో పైసా ఖర్చు లేకుండా మ్యూజిక్ ను అందిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 11 innovative Microsoft products that failed badly
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot