రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

Written By:

మీరు గాలిలో అలా అలా చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా.... రెక్కలు లేకున్నా గాలిలో ఎగరాలని తాపత్రయపడుతున్నారా.. మనం ఎప్పుడో ఓ డైలాగ్ సినిమాల్లో చూసుంటాం అదే. ఒక్కసారి పిలువు... రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతాను...' అనే డైలాగ్‌ను మనం అనేక సినిమాల్లో విన్నాం.

Read more: అత్యవసర పరిస్థితుల్లో 'సూపర్ ఐడియా'

రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

కానీ నిజ జీవితంలో అందుకు సాధ్యం కాదు. అయితే సింగపూర్‌కు చెందిన పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఈ 'యంత్రం'తో ఏకంగా గాలిలో ఎగురుతూ వెళ్లవచ్చు. 'నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)'కు చెందిన పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు 'స్నో స్టార్మ్‌'గా పిలవబడే ఫ్లైయింగ్ మెషీన్‌ను నూతనంగా తయారు చేశారు.

Read more: మార్స్ పైకి లేఖ: రూ. 12 లక్షలు ఖర్చు

రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

ఇది 70 కిలోల బరువుండే వ్యక్తిని దాదాపు 5 నిమిషాల వరకు గాలిలో తీసుకెళ్తుంది. ఇందులో మోటార్లు, ప్రొపెల్లర్స్, ల్యాండింగ్ గేర్ వంటివి ఉన్నాయి. 6 భుజాలతో షట్కోణాకృతి (హెగ్జాగోనల్) మాదిరిగా దీని ఫ్రేం ఉంటుంది. ఈ ఫ్రేంను అల్యూమినియం బీమ్స్, కార్బన్ ఫైబర్ ప్లేట్స్, ట్యూబ్స్, కెవ్లార్ రోప్స్‌తో తయారు చేశారు.

రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

మొత్తం 24 మోటార్లను ఇది కలిగి ఉంటుంది. 52.8 కిలోవాట్ల పవర్‌నిచ్చే 3 రీచార్జబుల్ బ్యాటరీలను ఇందులో అమర్చారు.దీన్ని ఎవరైనా సులభంగా ఆపరేట్ చేస్తూ గాలిలో ఎగిరేలా తీర్చిదిద్దుతున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం కొద్ది నిమిషాల పాటే గాలిలోకి ఎగిరినా త్వరలో పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసి ఎక్కువ సేపు గాలిలో ఎగిరేలా అభివృద్ధి చేయనున్నారు.

రెక్కలు లేకుండా ఆకాశంలో చక్కర్లు

వచ్చే ఏడాది చివరికల్లా ఈ 'ఎగిరే మెషిన్‌'ను వాణిజ్య పరంగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more about:
English summary
Here Write Fly With Electric-Powered Personal Flying Machine Soon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot