కళ్లుమూసి తెరిచేలోపు దాడి

Written By:

ఇప్పుడు శాస్ర్తవేత్తలంతా జంతువులను పోలిన రోబోలను తయారుచేస్తున్నారు. దీంతో మనుషుల్లాగే ఉండే రోబోలకు కాలం చెల్లిపోయింది. మరి శాస్ర్తవేత్తలు రోబోలను జంతువుల్లాగా ఎందుకు చేస్తున్నారు...అనేదానికి సమాధానం చెప్పడం ఎవరికైనా తేలికే..ఎందుకంటే జంతువులు వేగంగా పరిగెత్తగలవు అలాగే అవి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. ఎక్కడికైనా దూసుకుపోగలవు.ఇంకా అవి యుద్ధం సమయంలో కంటికి కనిపించకుండానే దాడి చేయగలవు..కళ్లు మూసి తెరిచే లోపు ఇవి దాడి చేయగలవు కూడా. ఈ రోబోలు ఇప్పుడు అందిరినీ అశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. వాటిని చూద్దాం.

Read more: మిలిటరీలో సీక్రెట్ ఆయుధాలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాలమండర్ రోబో

సాలమండర్ రోబో

ఈ రోబో జంతువుల పరిమాణం అలాగే వాటి వెన్నెముకలకు సంబంధించిన చికత్సలకోసం సహాయం చేస్తుంది. ఇది వెన్నెముకలాగా ఉంటుంది. మొత్తం వెన్నెముక మీద 64 మచ్చలు గల ట్రాక్ ఉంటుంది. స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు దీన్ని రూపొందించారు. ఇది క్లిష్ట సమయాల్లో రెస్కూ ఆఫరేషన్లకు కూడా వినియోగించవచ్చు. అలాగే పరిశోధనలకు కూడా బాగా సహాయపడుతుంది.

ఎండ్రకాయను తలపించే రోబో

ఎండ్రకాయను తలపించే రోబో

ఎండ్రకాయను తలపించే రోబో ఇది. దీనిపేరు క్రాబ్ స్టార్. ఇది నీటిలో నివసిస్తూ శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టేస్తుంది. నీటిలో దీని స్థిరత్వం ఇంకా ప్లస్ పాయింట్. టెకాన్ లోని క్రాబ్ స్టార్ మడోలోని నీటిలో కళాఖండాలను పరీక్షిచేందుకు అలాగే వాటిని తవ్వడానికి దీంతోనే పరీక్షలు జరిపారు. ఇది మహసముద్రంలోని అడుగుభాగాన ఉన్న వాటిని బయటిప్రపంచానికి అందించగలదు కూడా..దీన్ని కొరియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఓసియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రూపొందించారు.

ఫెస్టో రోబో

ఫెస్టో రోబో

ఇది జర్మన్ ఆటోమోషన్ సప్లయిర్. రోబోట్లను చూసి ఇనస్పయిరైన ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ఏదో ఓ రోబోను తయారుచేస్తోంది. గతేడాది కంగారుల రూపంలో రోబోను తయారుచేసింది. ఇది కంగారులు ఎలా పరిగెత్తతాయే అలానే పరిగెడతాయి కూడా. ఈ రోబో లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే తాను కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగిపొందడం.

డాగ్ రోబోటిక్

డాగ్ రోబోటిక్

గూగుల్ కంపెనీలో భాగమైన బోస్టన్ డైనమిక్స్ కంపెనీ దీన్ని రూపిందించింది. ఇది చాలా ప్రమాదకరమైంది కూడా. యుఎస్ నౌకాదళంలో వాడుతున్నారు. మొత్తం 160 పౌండ్ల బరువు అలాగే గేమ్ కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్నాయి. గేమ్ కంట్రోలర్ ని లాప్ టాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు కూడా. 500 మీటర్ల దూరం నుంచే దీన్నిఆపరేట్ చేయవచ్చు. అంటే దాదాపు అరకిలో మీటర్ దూరం నుంచే శత్రువుల కంటికి కనిపించకుండా దీనితో వారి మీదకు దాడి చేయించవచ్చు.

కప్ప రోబో

కప్ప రోబో

హార్వర్డ్, UC San Diego, వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజ్ వారు సంయుక్తంగా రూపొందిచిన రోబో ఇది. ఈ రోబో రూపకల్పనలో కప్పలను ఎలా ఎగురుతాయి అనేదానిని పరీక్షించి దీనికి అదే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు.ఇక దీని శరీరం పాములు క్రిమీ లావాల ను పోలి ఉంటుంది. వాటి నుంచి ప్రేరణ పొంది తీసుకున్నారు. అంతే కాకుండా ఈ రోబోకు 3డీ టెక్నాలజీతో కూడాని ధృడమైన భాగాలను కూడా అమర్చారు.

తాబేలు రోబోట్

తాబేలు రోబోట్

పరిశోధకులు సముద్రపు తాబేలు అలాగే సముద్ర జంతువులను చూసి ప్రేరణ పొంది ఈ రకమైన రోబోట్ ను తయారు చేశారు. భూమి మీద అవి ఎలా చాకచక్యంగా తప్పించుకుంటాయి అనేదానిపైన అధ్యయనం కోసం ఈ రకమైన రోబోట్లను తయారుచేశారు. జార్జియా టెక్ శాస్ర్తవేత్తలు దీన్ని రూపొందించారు. అవి రెక్కలతో ఎలా ముందుకు కదులుతాయి ఎంత వేగంగా పరిగెడతాయి అనేదానిపై పరిశోధన కోసం ఈ రకమైన తాబేళ్లను రూపొందించినట్లు తెలుస్తోంది.

బొద్దింక రోబోట్

బొద్దింక రోబోట్

ఈ రోచ్ రోబోట్ ఆర్మీ నేవీ రెస్కూ ఆపరేషన్లలో బాగా ఉపయోగపడుతుంది. ఎంతటి చిన్నసందుల్లోనైనా ఈ రోబోలు దూసుకుపోగలవు. అలాగే పర్యావరణ పర్యవేక్షణ కోసం కూడా ఈ రోబోలను రూపొందిచండం జరిగింని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఎటువంటి అడ్డంకులనైనా క్షణాల్లో దాటేసి శత్రు స్థావరాల రహస్యాలకు ఈ రోబో చేరుకోగలదు. దీన్ని UC బర్కిలీ రీసెర్చర్స్ రూపొందించారు.

ఎమ్ ఐటీ చిరుతపులి రోబోట్

ఎమ్ ఐటీ చిరుతపులి రోబోట్

ఇదొక చిరుతపులిలాగా ఉన్న రోబోట్.నాలుగు కాళ్ల తొలి రోబో కూడా ఇదే. ఇది వేగంగా పరిగెత్తడానికి అలాగే ఏవైనా అడంగా వస్తే జంప్ చేయడానికి వంటి పరీక్షల్లో సహాయపడుతుంది. ఈ రోబో గంటకు 29 మైళ్ల దూరాన్ని పరిగెత్తి ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది కూడా. డాప్రా అనే రీసెర్చి ఇటువంటి రోబోల కోసం నిధులను కూడా అందింస్తోంది.

మరోక చిరుత రోబో

మరోక చిరుత రోబో

ఇది చిరుతా లాంటి మరొక రోబో. MIT చిరుత రోబో లా వేంగా పరిగెత్తగలదు కూడా. గంటకు 28 మైళ్ల వేగం దీని సొంతం. కొరియన్ అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీన్ని రూపొందించారు. ఇది పరిగెత్తే సమయంలో తన కాళ్లను బ్యాలన్స్ చేసుకోడానికి ప్రత్యేకమైన బ్లేడ్లను కూడా అమర్చారు.

తుమ్మెద రోబో

తుమ్మెద రోబో

హర్వర్డ్ యూనివర్సిటీ దీని కోసం దాదాపు ఏడు సంవత్సరాలు కష్టపడింది. అత్యధ్బుతమైన ఈ రోబో కోసం ఎంతో కష్టించి పనిచేశారు యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు. దీని సామర్ధ్యం చాలా పవర్ పుల్. సైనికులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నిఘా సమయంలో అలాగే శత్రువుల రహస్య స్థావరాల ఉనికిని రెస్క్యూ ఆపరేషన్ సమయంలో దీన్ని ఉపయోగించి సమాచారాన్ని సేకరించవచ్చు. ఇది నీటిలో మునిగిపోగలదు అలాగే ఈత కొట్టగలదు కూడా

బిగ్ డాగ్ రోబో

బిగ్ డాగ్ రోబో

బోస్టన్ డైనమిక్స్ ఈ పెద్ద డాగ్ రోబోనూ రూపొందించింది. ఇవి చిన్న చిన్న సందుల్లో బురదమట్టిలోనూ అలాగే మంచు కొండల్లోనూ వేగంగా పరిగెత్తి గమ్యానికి చేరుకోగలవు. ఇవి అటువంటి క్లిష్ట ప్రదేశాల్లో గంటలకు అయిదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ రోబోకి తయారీకి కూడా డాప్రా రీసెర్చి వారు నిధులను అందింస్తున్నారు.దట్టమైన అడవుల్లో అలాగే భయంకరమైన పర్వతాల్లో వీటి ద్వారా శత్రువుల మీద దాడి చేయవచ్చు కూడా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Here's a round-up of 11 robots whose designs were inspired by animals and what they can do
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot