మీ గాడ్జెట్‌లను క్లీన్ చేసుకునేందుకు 10 బెస్ట్ చిట్కాలు

Posted By:

పర్సనల్ గాడ్జెట్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఉపయోగించే కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి గాడ్జెట్‌ల పై దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పనితీరు మందగించే ప్రమాదముంది. కంప్యూటర్ విషయానికి వస్తే దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది. ప్రణాళికాబద్ధంగా మీ వ్యక్తిగత గాడ్జెట్‌లను శుభ్రం చేసుకునేందుకు 11 బెస్ట్ చిట్కాలు..

ఇంకా చదవండి: సోనీ ఫోటో కాంటెస్ట్‌లో గెలుపొందిన థ్రిల్లింగ్ ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రత్యేకించి స్ర్కీన్‌లను శుభ్రం చేసేందుకు

ప్రత్యేకించి స్ర్కీన్‌లను శుభ్రం చేసేందుకు స్ర్కీన్ జెల్ స్ప్రే మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ప్రత్యేకమైన ఆల్కహాల్ ఫ్రీ క్లీనర్ సహాయంతో మీ గాడ్జెట్‌లకు సంబంధించి స్ర్కీన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవచ్చు.

డిస్సోజబుల్ స్ర్కీన్ వైప్‌లను

డిస్సోజబుల్ స్ర్కీన్ వైప్‌లను మీ పర్స్‌లో ఉంచటం ద్వారా బయటకు వెళ్లిన సందర్భాల్లో ఫోన్‌ను దుమ్ము, ధూళి నుంచి రక్షించుకోవచ్చు.

కాటన్ ప్యాడ్‌లు కీలక పాత్ర

గాడ్జెట్‌లకు సంబంధించిన స్ర్కీన్‌లను క్లీన్ చేయటంలో కాటన్ ప్యాడ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

మైక్రోఫైబర్ దస్తులు మరింత సున్నితత్వాన్ని సంతరించుకుని ఉంటాయి

మైక్రోఫైబర్ దస్తులు మరింత సున్నితత్వాన్ని సంతరించుకుని ఉంటాయి. కాబట్టి స్ర్కీన్‌లను క్లీన్ చేయటంలో ఇవి తోడ్పడతాయి.

ఎలక్ట్రానిక్ డివైస్‌‍లను క్లిన్ చేసే ముందు

ఎలక్ట్రానిక్ డివైస్‌‍లను క్లిన్ చేసే ముందు తప్పనిసరిగా వాటిని టర్నాఫ్ చేయాలి.

మానిటర్ లేదా స్ర్కీన్ పై లిక్విడ్‌ను డైరెక్ట్‌గా స్ప్రే చేయకండి

మానిటర్ లేదా స్ర్కీన్ పై లిక్విడ్‌ను డైరెక్ట్‌గా స్ప్రే చేయకండి. ఒకవేళ పడాల్సిన లిక్విడ్ మోతాదు కంటే ఎక్కువ స్ప్రే అయినట్లయితే నష్టం వాటిల్లే ప్రమాదముంది.

స్ర్కీన్ సర్పేస్‌లను క్లీన్ చేసేందుకు

స్ర్కీన్ సర్పేస్‌లను క్లీన్ చేసేందుకు ఆల్కహాల్, అమోనియా వంటి ద్రవాలను ఉపయోగించటం సరికాదు. మార్కెట్లో లభ్యమవుతున్న ఆల్కహాల్ ఫ్రీ జెల్ క్లీనర్‌లను మాత్రమే ఉపయోగించండి.

కీబోర్డ్‌లను క్లీన్ చేసే సమయంలో

కీబోర్డ్‌లను క్లీన్ చేసే సమయంలో సాఫ్ట్ బ్రష్‌లను ఉపయోగించండి.

కొన్ని ల్యాప్‌టాప్‌లు

కొన్ని ల్యాప్‌టాప్‌లు రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా బ్యాటరీలను తొలగించి లోపలి దుమ్మును శుభ్రం చేయవచ్చు.

కంప్యూటర్‌లో అధికంగా దమ్ము కనబడే ప్రాంత స్ర్కీన్

శుభ్రత పై కూడా కంప్యూటర్ పనితీరు ఆధారపడి ఉంటుదన్న విషయాన్ని మీరు మరచిపోవద్దు. కంప్యూటర్‌లో అధికంగా దమ్ము కనబడే ప్రాంత స్ర్కీన్. మోనిటర్ పై దుమ్ము ఉన్నట్లయితే కనిపించే విజువల్స్ మసగ్గా అనిపిస్తాయి. కాబటి, మోనిటర్ పై దుమ్ము పడకుండా జాగ్రత్త వహించాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 Secrets to Cleaning Your Tech Devices. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot