ఇంటెక్స్ క్లౌడ్ పవర్ ప్లస్, ‘బడ్జెట్ తక్కువ.. బ్యాకప్ ఎక్కువ’

ప్రముశ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ ఇంటెక్స్ తన క్లౌడ్ సిరీస్ నుంచి ‘క్లౌడ్ పవర్ ప్లస్' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.8,599. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ బడ్జెట్ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఫోన్ కొనుగోలు పై రూ.599 విలువ చేసే ఉచిత ఫ్లిప్ కవర్‌ను వినియోగదారులు పొందవచ్చు.
(చదవండి: జూలై 29న ‘విండోస్ 10' వరల్డ్ వైడ్ రిలీజ్ )
ఫోన్ ప్రత్యేకతలు:
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 1176 గంటల స్టాండ్‌బై టైమ్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్- కోర్ మీడియాటెక్ (ఎంటీ6582ఎమ్) ప్రాసెసర్, మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, జీపీఎస్).


Click it and Unblock the Notifications