తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10ను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా 199 దేశాల్లో విడుదల చేయునున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సోమవారం వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ తన మునుపటి ఓఎస్ విండోస్ 8ను మార్కెట్లో విడుదల చేసి దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం రిటైల్ ధరకు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఏ విధమైన వివరాలను వెల్లడించలేదు.
(చదవండి: టెక్నాలజీ.. కొత్త కొత్తగా!!)
నాలుగు లక్షల మంది సూచనలు, సలహాల మేరకు విండోస్ 10ను రూపొందించామని, ప్రస్తుతం విండోస్ 7, విండోస్ 8.1 వర్షన్‌లను ఉపయోగించుకుంటున్న తమ వినియోగదారులు విండోస్ 10ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తన అధికారిక బ్లాగ్ స్పాట్‌లో పేర్కొంది. తాము రూపొందించిన కొత్త ఓఎస్ వినియోగదారులను మరింత సంతృప్తి పరుస్తుందని మైక్రోసాఫ్ట్ థీమా వ్యక్తం చేస్తోంది.
(చదవండి: మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్)
ఆధునిక స్మార్ట్ మొబైలింగ్, స్మార్ట్ కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌పోన్‌లు, ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్స్, హోలో లెన్స్, వైర్‌లెస్ గ్రాఫిక్ హెడ్‌సెట్ వంటి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులన్నింటిని సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలోని పలు ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
(చదవండి:ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు)
విండోస్ 10లో పొందుపరిచిన స్టార్ట్ మెనూ కొత్త లుక్‌లో మరింత యూజర్ ఫ్రెండ్లీగా దర్శనమిస్తుంది. ఈ సరికొత్త స్టార్ట్ మెనూ సాంప్రదాయ అలానే మోడ్రన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. విండోస్ 10 యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై మల్టిపుల్ డెస్క్‌టాప్‌లను ఓపెన్ చేసుకుని వాటిలో కావల్సిన విండోలను ఓపెన్ చేసుకుంటూ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఓపెన్ చేసి ఉన్న విండోలను తిలకించేందుకు ప్రత్యేక బటన్ సాధారణంగా విండోస్ యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు Alt+Tab షార్ట్‌కట్‌ను వినియోగిస్తుంటారు. అయితే, విండోస్ 10 యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బటన్‌ను విండోస్ 10 టాస్క్‌బార్‌లో పొందుపరిచింది. ఈ టాస్క్ స్విచర్ మల్టీ టాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. విండోస్ 10లోని స్టార్ట్ మెనూతో సమీకృతం చేయబడిన సరికొత్త యూనివర్సల్ సెర్చ్ ఫీచర్ ద్వారా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లతో పాటు వెబ్‌లోని అంశాలను శోధించవచ్చు. మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజన్ ‘బింగ్' వెబ్‌సెర్చ్‌కు తోడ్పడుతుంది. విండోస్ 10లో ఏర్పాటు చేసిన స్నాప్ వ్యూ ఫీచర్ ద్వారా ఏకకాలంలో నాలుగు అప్లికేషన్‌లను స్ర్కీన్ పై ఓపెన్ చేసుకుని లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మోడ్రన్ అప్లికేషన్‌లతో పాటు సాంప్రదాయ (ట్రెడిషనల్) అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ స్టోర్ విండోస్ 10 ఆధారిత డెస్క్‌టాప్, టాబ్లెట్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 యూజర్లు తమకు కావల్సిన యాప్‌లను ఈ స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. విండోస్ 10లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన కాంటినుమ్ ఫీచర్ 2 ఇన్ 1 విండోస్ డివైస్‌లకు మరింత ఉపయుక్తంగా నిలస్తుంది. మీరు ఉపయోగించే మోడ్‌ను బట్టి ఉపయోగానికి అనువుగా స్ర్కీన్ రూపం మారుతుంటుంది. విండోస్ 10లో ఏర్పాటు చేసిన కమాండ్ ప్రాంప్ట్ సరికొత్త ఫీచర్లతో అలరిస్తుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ సిరి, గూగుల్ నౌలకు పోటీగా మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ద్వారా కోర్టానా పేరుతో సిరికొత్త వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను పరిచయం చేస్తోంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కోసం ఎడ్జ్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో పోలిస్తే మరింత వేగవంతంగా స్పందించే ఈ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ నేషనల్ టూల్, డిస్ట్ర్రాక్షన్ ఫ్రీ రీడింగ్ మోడ్, వాయిస్ అసిస్టెంట్ యాప్ ఫర్ విండోస్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని డివైజ్‌లలో ఈ ఎడ్జ్ బ్రౌజర్ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.