Home
News

12 రోజుల బ్యాటరీ లైఫ్, అదిరిపోయే ఆడియోతో Xiaomi స్మార్ట్ గ్లాసెస్ 2 విడుదల.. ధర ఎంతంటే..?

Xiaomi Mijia Smart Audio Glasses 2: ఇటీవల షియోమీ (Xiaomi) సంస్థ 'మిజియా స్మార్ట్ ఆడియో గ్లాసెస్ 2' పేరుతో అదిరిపోయే స్మార్ట్ కళ్లజోడుని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇదివరకున్న మోడల్ కంటే ఇది చాలా స్టైలిష్‌గా ఉంది. బరువు కూడా తక్కువగా ఉంది. చైనాలో మార్చి 26 నుంచి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా అమ్మకాలు మొదలవుతాయి, ధర కేవలం 999 యువాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ.11,790) ఉండటం విశేషం..

బరువు చూస్తే కేవలం 27.6 గ్రాములే, అసలు పెట్టుకున్నట్లే ఉండదు. పాత మోడల్ కంటే ఫ్రేమ్ 30% సన్నగా ఉండటంతో, బరువు ముక్కు మీద పడకుండా హాయిగా అనిపిస్తుంది. రోజంతా పెట్టుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకా ఇందులో ఉన్న విశేషాలేవో తెలుసుకుందాం.

12-Day Battery Life  Killer Audio  Xiaomi Mijia Smart Audio Glasses 2 Price Will Make You Click

* 15,000 సార్లు వంచినా పాడు కాదు..

ఈ కళ్లజోడు ఫ్రేమ్ చాలా దృఢంగా ఉంటుంది. "పియానో స్టీల్ అల్ట్రా-ఫ్లెక్సిబుల్ హింజ్" అనే టెక్నాలజీ వాడారు, దాని వల్ల 15,000 సార్లు వంచినా కూడా ఏమీ కాదు. అలాగే, లెన్సులను ఒంటి చేత్తోనే క్షణాల్లో మార్చేయొచ్చు. అంటే ప్రిస్క్రిప్షన్ లెన్సులు కావాలన్నా, సన్ గ్లాసెస్ లెన్సులు కావాలన్నా ఇట్టే మార్చుకోవచ్చు.

Take a Poll

* సౌండ్ క్వాలిటీ

మిజియా స్మార్ట్ ఆడియో గ్లాసెస్ 2లో నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి, వాటికి తోడు స్మార్ట్ టెక్నాలజీ కూడా ఉంది. దీనివల్ల మీరు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు బయట శబ్దాలు ఏమీ వినిపించకుండా చాలా క్లియర్‌గా ఉంటుంది. అంతేకాదు, ఇందులో ప్రైవసీ మోడ్ ఉంది. అంటే పాటలు వింటున్నా, వీడియోలు చూస్తున్నా పక్కన వాళ్లకి సౌండ్ ఏమీ వినిపించదు.

* బ్యాటరీ లైఫ్

ఇన్వర్స్ సౌండ్ వేవ్స్, యాంటీ-లీకేజ్ మెంబ్రేన్స్ లాంటి టెక్నాలజీ వాడటం వల్ల ఆడియో గ్లాసెస్ నుంచి సౌండ్ బయటికి రాదు. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటలు పాటలు వినొచ్చు, 9 గంటలు మాట్లాడొచ్చు, స్టాండ్‌బైలో పెడితే ఏకంగా 12 రోజులు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

కేవలం గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అత్యవసరంగా బయటికి వెళ్లేటప్పుడు కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, 4 గంటలు పాటలు వినేయొచ్చు. ఈ గ్లాసెస్‌పై దుమ్ము, నీళ్లు పడ్డా ఏమీ కాదు, IP54 రేటింగ్ ఉంది. వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది.

* వాయిస్ నోట్ రికార్డు చేసుకోవచ్చు..

రియల్ టైమ్ ఆడియో బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్ కూడా ఉంది. టక్కున ఏదైనా వాయిస్ నోట్ తీసుకోవాలంటే, టెంపుల్‌ని ఒక్కసారి టచ్ చేస్తే చాలు, రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్లకి తెలియడానికి ఒక లైట్ కూడా వెలుగుతుంది.

స్టైల్ విషయంలో కూడా షియోమీ చాలా కేర్ తీసుకుంది. మెటల్ ఏవియేటర్, హైబ్రిడ్ బ్రోవ్ లైన్, క్లాసిక్ బోస్టన్, హైబ్రిడ్ ఏవియేటర్, డీప్-స్పేస్ టైటానియం ఇలా ఐదు రకాల ఫ్రేమ్ స్టైల్స్‌లో ఈ గ్లాసెస్ వస్తున్నాయి. మీకు నచ్చిన స్టైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ గ్లాసెస్ అనేక ప్రయోజనాలు అందించడమే కాదు మీ స్టైలిష్ లుక్కుని కూడా మెరుగుపరుస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi launches Mijia Smart Audio Glasses 2 with 12-day battery life, sleek design, improved audio, and quick lens swapping. Enjoy enhanced comfort, noise reduction, and fast charging at CNY 999.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X