గూగుల్ నుంచి ఆదాయం పొందడమెలా..?

  మీరు వెబ్‌సైట్లు, బ్లాగులు మెయింటైన్ చేస్తున్నారా....అందులో ఎంతో క్వాలిటీ కంటెంట్ ఉంది కాని మీకు గూగుల్ నుంచి ఆదాయం రావడం లేదని ఫీలవుతున్నారా..?అయితే గూగుల్ నుంచి మీకు ఆదాయం రావాలంటే ముందుగా గూగుల్ నుంచి యాడ్‌సెన్స్ ఖాతాను తీసుకోవాలి. ఆ ఖాతా మీకు వచ్చిందంటే మీకు గూగుల్ నుంచి ఆదాయం వస్తున్నట్లే లెక్క. అయితే గూగుల్ నుంచి యాడ్‌సెన్స్ ఎలా పొందాలి. దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మీకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి.

  Read more: ఉద్యోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి !

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ప్రైవసీ పాలసీ (Privacy Policy)

  సాధారణంగా ప్రతి ఒక్క బ్లాగర్ చేసే తప్పు ఇక్కడే ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు బ్లాగ్ అప్రూవ్ సాధించానని అయితే ఆదాయం రాలేదని చెబుతుంటారు.అయితే అది నిజమా కాదా అనేది మనకు తెలియకపోయినా గూగుల్ కి తెలిసిపోతుంది. సో గూగుల్ యాడ్ సెన్స్ అప్లయ్ చేసేటప్పుడు సీరియస్ గా ప్రయత్నించండి. నీ బ్లాగులో రీడర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం.;ప్రైవసీ పాలసీ మెయింటెన్ చేయండి. 

  అబౌట్ పేజీ ( About Page)

  ప్రైవసీ పాలసీ తరువాత అత్యంత ముఖ్యమైనది మీ పేజీ గురించి చెప్పడం. మీ పేజీ గురించి చెప్పేటప్పుడు కొంచెం శ్రధ్ధ తీసుకోండి. అనవసర విషయాలు రాయకుండా..బ్లాగు ఎందుకు పెట్టారు. రీడర్స్ కి ఏం అందిస్తారు అనే అంశాలపై మీ పేజీలో పొందుపరచండి.

  కాంటాక్ట్ పేజీ(Contact Us Page)

  మీ బ్లాగును రీడర్స్ సందర్శించినప్పుడు దానికి సంబంధించి రీడర్స్ ఇచ్చే రెస్సాన్స్ చాలా ముఖ్యమైనది. దీనికోసం మీరు రాసిన ఆర్టికల్స్ మీద రీడర్స్ అభిప్రాయాలు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే మీకు తొందరగా యాడ్ సెన్స్ అకౌంట్ వచ్చే అవకాశం ఉంది.

  పేరు, ఈ మెయిల్ (Name/ Email Verification)

  మీ పేరు అలాగే ఈ మెయిల్ చాలా ముఖ్యమైనవి. ఈ మెయిల్ ద్వారా గూగుల్ టీమ్ మీకు వెరిఫికేషన్ కు సంబంధించిన అంశాలను పంపే అవకాశం ఉంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇవ్వడం మంచిది

  వయస్సు (Age Verification)

  వయస్సు కూడా సరిగ్గా రాయలేకపోతే మీకు అకౌంట్ వచ్చే అవకాశం ఉండదు.మీ కరక్ట్ డేటా ఆఫ్ బర్త్ తో యాడ్ సెన్స్ కు అప్లయి చేయాలి. 18 సంవత్సరాల కింద ఉన్నవారికి అకౌంట్ రాదు.

  మినిమమ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ (Minimum Number of Posts)

  అయితే గూగుల్ యాడ్ సెన్స్ కు అప్లయి చేసే ముందు ఎన్ని పోస్ట్ లు ఉండాలనే విషయంపై సరిగా క్లారిటీ లేదు. మినిమం 400 పోస్టులు పోస్ట్ చేసిన తరువాత కూడా గూగుల్ యాడ్ సెన్స్ ను తీసుకోలేము.అయితే కొంతమంది తక్కువ పోస్ట్ లతోనే సాధించే అవకాశం ఉంది. 50 పోస్టుల తరువాత ఓ సారి మీరు అప్లయి చేసి చూడండి. అయితే ఒక్కో పోస్టులో 500 పదాలు ఉండాలి.

  డిజైన్ (Design)

  బ్లాగ్ డిజైన్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మీరు ఏ కంటెంట్ పోస్టు చేయాలనుకుంటన్నారో దానికి సంబంధించి ఖచ్చితత్వాన్ని పాటించాలి. గూగుల్ టీమ్ ఇల్లీగల్ స్టోరీలు,ఇతర సైట్లలో కాపీ కొట్టిన స్టోరీలను అప్పుడే గుర్తిస్తుంది. అయితే ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో ఉండే కంటెంట్ 200 పదాల కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడే మీకు యాడ్ సెన్స్ వచ్చే అవకాశం ఉంది.

  ప్రొవైడింగ్ వాల్యూ (Providing Value)

  మీరు రీడర్స్ కి కంటెంట్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి వాల్యుబుల్ కంటెంట్ అందించాలి. అందులో ఏ మాత్రం తేడా వచ్చిన మీకు యాడ్ సెన్స్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

  టాప్ లెవల్ డొమైన్(Top Level Domain)

  మీరు మీ సొంత డొమైన్‌లతో యాడ్‌సెన్స్‌కి అప్లయి చేస్తే తొందరగా సాధించే అవకాశం ఉంది.అది టాప్ లెవల్లో ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. డాట్ కామ్ తో స్టార్టయ్యే డొమైన్ లకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. యాడ్ సెన్స్ వచ్చిన తరువాత మీ బ్లాగును టాప్ లోకి తీసుకుపోవాల్సి ఉంటుంది.

  ఇతర యాడ్ నెట్‌వర్క్‌లు (Other Ad Networks)

  గూగుల్ నుంచే కాకుండా ఇతర సైట్ల నుంచి కూడా ఆదాయం పొందే మార్గం ఉంది. Chitika, Clicksor లాంటి వాటిల్లో కూడా మీరు ఆదాయం కోసం అన్వేషించవచ్చు.అయితే మీరు గూగుల్ యాడ్ సెన్స్ కు అప్లయి చేసే సమయంలో మీ బ్లాగులో ఎటువంటి యాడ్ లు లేకుండా చూసుకోండి.

  పెయిడ్ ట్రాఫిక్ (Paid Traffic)

  ఇవన్నీ చేసినా మీకు గూగుల్ యాడ్‌సెన్స్ రాలేదంటే అంతటితో అయిపోలేదు. ఎక్కువ మొత్తంలొ మీకు పే చేసే కొన్ని సైట్లు కూడా ఉన్నాయి. వాటికి అప్లయ్ చేయాలంటే గూగుల్ కు కష్టపడినట్లు కష్టపడనవసరం లేదు. అయితే వాటికి మీరు కొంత పే చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

  ఇన్ఫో లింక్స్ (Infolinks)

  70 శాతం రెవిన్యూను మీకందించే అవకాశం ఉంది. ఇందులో మీరు ఓ సారి ట్రై చేయవచ్చు. దీనికోసం మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు. http://www.infolinks.com/join-us/?aid=2421608

  మీడియా.నెట్ (Media.net)

  ఇది కూడా మీకు ఆదాయం ఇచ్చే మరొక సైట్

  బిడ్ వర్టిజైర్ (BidVertiser)

  ఇది కూడా మీకు ఆదాయం ఇచ్చే మరొక సైట్

  చిటికా (Chitika)

  ఇది కూడా మీకు ఆదాయం ఇచ్చే మరొక సైట్

  ఆన్‌లైన్ ప్రపంచంలో అనేక మార్గాలు

  మీకు బ్లాగ్ ఉంటే ఓ సారి గూగుల్ యాడ్ సెన్స్ కోసం అప్లయ్ చేయండి. అయితే కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంటే గూగుల్ నుంచి త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయినా గూగుల్ నుంచి అకౌంట్ రాలేదంటే మీరు నిరుత్సాహ పడకుండా ఇతర మార్గాలను అన్వేషించండి. ఆన్‌లైన్ ప్రపంచంలో అనేక మార్గాలున్నాయి. ఆల్ ది బెస్ట్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write 12 Things to Do Before Applying for Google Adsense
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more