ఉద్యోగ సమాచారాన్ని అందించే టాప్‌టెన్ వెబ్‌సైట్లు

Written By:

ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఇందులో మన దేశంలో అయితే నిరుద్యోగ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పట్టా తీసుకుని బయటకు రాగానే ఇక జాబుల కోసం వేట మొదలుపెడతాం. అయితే జాబును ఎలా సాధించాలి. మీరు ఎలా ముందుకెళితే సక్సెస్ అవుతారు. జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి లాంటి అంశాలు చాలామందికి తెలియవు. ఏ దారిలో వెళితే మీరు ఉద్యోగం కొట్టొచ్చు అనేది కూడా తెలియదు. అయితే ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగానికి సంబంధించిన వెబ్‌సైట్లను పరిచయం చేస్తున్నాం. వీటిలో మీరు మీకు సంబంధించిన జాబ్‌ను సెర్చ్ చేసి సక్సెస్ అవ్వండి.

Read more: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ టీసీఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లింక్డ్ ఇన్ (linked in)

ఎన్నో కంపెనీలు, వాటి ఉద్యోగులు, ఉద్యోగాల సమూహాల జాబితా ఈ వెబ్ సైట్. దీనిలో మీరు మొదటగా రిజిస్టర్ చేసుకున్నాక మీకు నచ్చిన వాళ్ళ ప్రొఫైల్ని ఆ వ్యక్తి పేరు ద్వారా, కంపెనీ పేరుతో, లేదా ఎంచుకున్నరంగం ద్వారా వెతికి చూసి వాళ్ళతో కనెక్ట్ అవ్వొచ్చు. తద్వారా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, వివిధ కంపెనీ గ్రూప్స్ లేదా ఏ ఇతర గ్రూప్స్‌లో అయినా జాయిన్ అవ్వొచ్చు.

ఇన్‌డీడ్ (indeed)

ఇదొక గూగుల్ లో ఓ సెర్చ్ ఇంజిన్ . ఇందులో అనేక రకాల కంపెనీల నమోదై ఉంటాయి. మీరు ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నారో ఆ రంగంలో సెర్చ్ చేయవచ్చు.

సింప్లీ‌హైర్డ్ (SimplyHired.com)

ఇందులో కూడా మీకు సంబంధించిన అనేక రకాలైన జాబులు ఉంటాయి.

ఐడియా లిస్ట్ (Idealist.com)

ఇందులో మిలియన్లకు పైగానే రిజిస్టర్ అయి ఉన్నారు. మన దేశంలోని జాబుల సమాచారం మొత్తం ఇందులో ఉంటుంది.

గ్లాస్‌డోర్ (Glassdoor.com)

ఇది కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తోంది. మీ కెరిర్ కు సంబంధించిన అనేక రకాల జాబులను ఇది అందిస్తుంది. సీనియర్ల సలహాలను వారి అనుభవాలు కూడా మీకు ఇందులో అభిస్తాయి 

మోన్‌స్టెర్ (Monster.com)

ఇది అత్యంత పాతదైన ఆన్‌లైన్ జాబ్ బోర్డు. 1996లో దీనిని స్థాపించారు. 50 దేశాల్లో ఉంది. కొన్ని కోట్ల జాబులు ఇందులో ఉన్నాయి.

ఇంటెర్న్‌షిప్ డాట్. కాం (Internships.com)

ఇంటెర్న్‌షిప్ లో చేరేవారికి ఈ పేజీ చాలా బాగా ఉపకరిస్తుంది. ఇందులో ప్రాజెక్ట్ కు సంబంధించిన అనేక అంశాలు. కంపెనీల డిటేయిల్స్ ఉంటాయి. 

యుఎస్‌ఎ జాబ్స్ (USAJobs.com)

ఇది యుఎస్‌ఎ లోని గవర్నమెంట్ అఫిషియల్ సైట్. ఇందులో వేల జాబులు ఉంటాయి. అమెరికా ఢిపెన్స్ కు సంబంధించిన జాబ్స్ సైడం ఇందులో ఉంటాయి.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal Careers site)

ఈ సైట్ కూడా జాబుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకందిస్తూ ఉంటుంది.

కెరిర్ బుల్డర్ (CareerBuilder.com)

ఇందులో మీ రెజ్యూమ్ పోస్ట్ చేశారంటే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. నచ్చినదానిని సెలక్ట్ చేసుకోవచ్చు

డైస్.కాం ( Dice.com)

ఈ సైట్ లో మీరు ఏ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించిన ఉద్యోగ సమాచారం ఉంటుంది

లింక్ అప్ . కాం ( LinkUp.com)

ఇది కూడా అనేక ఉద్యోగ అవకాశాలను మీకందించే వేదిక

స్పెషాల్టి జాబ్ సైట్ ఫర్ యువర్ ఫ్రొపెషన్ (Specialty job site in your area)

ఇందులో కూడా మీరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగానికి చెందిన జాబులు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి.

ఫేస్‌బుక్ (Facebook)

దీనిని వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా రకాలుగా వినియోగిస్తారు. ఈ మధ్య ఫేస్బుక్ ని కెరీర్ కోసం కూడా ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా కంపెనీలు ఇప్పటికే టాలెంట్ అభ్యర్థుల వేటకి ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నాయి. వాళ్ల కంపెనీల గురించి వ్యాపారం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ టాలెంట్ ఆకర్షిస్తున్నాయి. ఫ్రొపెషనల్ నెట్ వర్కింగ్ కి మీరు వేరే ప్రొపైల్ వాడినట్లయితే ఫలితం ఉంటుంది.

ట్విట్టర్ (twitter)

చిన్న చిన్న మెసేజ్‌లను అతి త్వరగా ఇతరులకు చేర్చే పక్షిలాంటిది. బ్లాగ్ ను చాలా చిన్నగా చేసి మెసేజ్‌లను ఇతరులతో పంచుకునే వెబ్‌సైట్ అని చెప్పవచ్చు.ఇందులో జాబ్స్ గురించిన సమాచారం మీరు తెలుసుకోవచ్చు.

బ్లాగ్ (blog)

నచ్చిన విషయాలు రాసుకునే వెబ్‌పేజీ .మీకు నచ్చిన రంగంలోని విషయాలకి సంబంధించిన వివరాలని మీరు తెలుసుకొని మీ అభిప్రాయాలను స్వతహాగా రాయండి. వీటిలో టాగ్లు అనే కాలమ్ చాలా కీలకమైనది. ఎందుకనగా ఈ ట్యాగ్లో ఇచ్చే KEYWORDS వల్లే మీ బ్లాగ్ అలాంటి KEYWORDS ఇచ్చి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీబ్లాగ్ సెర్చ్ లిస్టులో ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీ ఉద్యోగానికి కీలకంగా మారే అవకాశం ఉంది.

ఉద్యోగ వెబ్‌సైట్లు

ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇంకా అనేక వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన రంగం ఏదో తెలుసుకుని మీరు దూసుకెళ్లడమే మిగిలి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The 10 Best Websites For Your Career
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot