కిక్కు కావాలంటే ఈ యాప్స్ ఉండాల్సిందే

Written By:

కొత్త ఏడాది అప్పుడే వచ్చేసింది. ఇప్పుడు అంతా కొత్త లక్ష్యాలు అలాగే ఆరోగ్యం పట్ల చాలా అవసరం తీసుకోవాల్సి ఉంటుంది. మెనూ ఏం తీసుకోవాలి అలాగే మన ఆరోగ్యం చాలా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అనేదానిపై బాగానే కసరత్తు చేస్తుంటాం కదా.. అయితే అటువంటి వాటికి స్మార్ట్ పోన్ యాప్స్ ఉంటే మనం చాలా బాగా ఫీలవుతాం కూడా..మరి మీరు వాటిని సులభంగా పూర్తి చేసేందుకు మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇప్పుడు కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో చూద్దాం.

Read more: ఇండియన్ ఆర్మీ సెల్‌ నంబర్లపై ఉగ్రవాదుల కన్ను

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రెల్లో (Trello)

మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలు అలాగే పూర్తి చేయవలిసిన పనుల జాబితాలు ఇందులో ఉంటాయి. వీటన్నింటినీ ఈ యాప్ లో మీరు క్రమపద్దతిలో అంటే లిస్ట్ రూపంలో పెట్టుకోవచ్చు. . డాటా మొత్తం క్లౌడ్లో సేవ్ అవుతుంది. ఇందులో కావాలనుకుంటే కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను ఇన్వైట్ చేయవచ్చు. చెక్ లిస్ట్స్ పెట్టుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

బ్రైట్‌నెస్ట్ (BrightNest)

ఇంటిని అందంగా అలంకరించుకోవాలా? ఇంట్లో సామగ్రిని ఆకట్టుకునే విధంగా సర్దుకోవాలా? అయితే బ్రైట్‌నెస్ట్ యాప్‌ను ఎంచుకోండి. సింపుల్ క్లీనింగ్ ట్రిక్స్ నుంచి ఇంటీరియర్ డిజైన్ ఐడియాల వరకు అన్నీ యాప్ లో లభిస్తాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఎపిక్యూరియస్ (Epicurious)

మీరు రకరకాల రుచులను ఆస్వాదించాలా? నోరూరించే రెసిపీలను ఎలా తయారుచేయాలో తెలుసుకోవాలా? అయితే ఎపిక్యూరియస్ ను దర్శించండి. ఇందులో ప్రముఖ చెఫ్ లు అందించిన 30 వేల రెసిపీలున్నాయి. ఇక యూజర్స్ అందించిన రెసిపీల సంఖ్య ఒక లక్ష. మీకు ఏ రెసిపీ కావాలో వెతకడం కూడా సులభం. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

వీక్ మెను ( Epicurious)

కొత్త ఏడాది హెల్త్ విషయంలో మరింత ప్లాన్ గా ఉండండి. ఇందుకోసం మీకు 'వీక్ మెను' యాప్ బాగా ఉపకరిస్తుంది. ఈ యాప్ సహాయంతో వీక్ మెనూ ప్లాన్ ను తయారు చేసుకోవచ్చు. ఒక రోజులో ఆరు రెసిపీల వివరాలు యాడ్ చేసుకోవచ్చు. గడిచిన వారం మెనూ ప్లాన్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

మై ఫిటినెస్‌పాల్ (MyFitnessPal)

ఫిట్నెస్కున్న ప్రాధాన్యం తెలిసిందే. కొత్త ఏడాది ఫిట్నెస్ పై మరింత ఏకాగ్రత పెట్టాలనుకుంటే 'మై ఫిటినెస్‌పాల్ ను ఎంచుకోండి. డైట్, ఎక్సర్ సైజ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఫుడ్ డాటాబేస్ అందుబాటులో ఉంది. మీ ఫేవరేట్స్, మీల్స్, మల్టిపుల్ ఫుడ్స్ ను సేవ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డ్యుయోలింగో ( Duolingo)

ఈ ఏడాది కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇందుకు మీకు 'డ్యుయోలింగో' యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో గేమ్ స్టయిల్ లెస్సన్స్ ఉంటాయి.ఈ యాప్ సహాయంతో కొన్ని వారాల్లోనే ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు మాట్లాడటం నేర్చుకోవచ్చు. దీన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

కోచ్.మి (Coach.me)

ఫిట్నెస్ సాధించడం ఈ ఏడాది మీ గోల్ అయితే 'కోచ్.మి' యాప్ని స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేయండి. ఇందులో త్రీ లెవెల్స్ కోచింగ్ లభిస్తుంది. సెల్ఫ్ కోచింగ్ స్టేజ్లో ప్రొగ్రెస్ ను ట్రాక్ చేయవచ్చు. రివార్డులు పొందవచ్చు. మీరు అనుకున్నది సాధించ డానికి ఈ యాప్ బాగా ఉపకరిస్తుంది. మీకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా మాస్టర్ కావడానికి ఉపయోగపడుతుంది.

హొప్పర్ (Hopper)

కొత్త ఏడాది ట్రావెల్ ప్లానింగ్ చేస్తున్నారా? టూర్ ప్లానింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏ సమయంలో తక్కువ ధరలో ఫ్లయిట్స్ అందుబాటులో ఉన్నాయో ఈ యాప్ చెబుతుంది. మీకు ఆసక్తి ఉన్న ఫ్లయిట్స్ ను సెలక్ట్ చేసుకుని ప్రైస్ మారిన ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోవచ్చు. ఎప్పుడు బుక్ చేసుకోవాలో సలహా ఇవ్వమని కోరవచ్చు. ఇది ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

కాయక్ (Kayak)

మల్టీసిటీ ఫ్లయిట్స్, హోటల్స్ను బుక్ చేసుకోవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. ఫ్లయిట్ వివరాలు ట్రాక్ చేయడానికి, రెంటల్ కార్లను బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాప్ మల్టీబుకింగ్ ప్లాట్ ఫామ్గా పనికొస్తుంది.

బాన్జర్నల్( Bonjournal )

ట్రావెలింగ్ లోని సంఘటనలను జ్ఞాపకాలుగా భద్రపరచుకోవాలంటే ఈ యాప్ ఉండాల్సిందే. మీ హాలిడే ట్రిప్లో ప్రతి సంఘటనను డైరీలో నోట్ చేసుకోవచ్చు. ఫొటోలు యాడ్ చేసుకోవచ్చు. మీకు బాగా సంతృప్తినిచ్చిన అంశాలను రాసుకోవచ్చు. వాటిని పీడీఎఫ్ ఫైల్స్గా మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

హెడ్ స్పేస్ ( Headspace)

ఎప్పుడూ ఒత్తిడితో జీవించడమేనా? కాసేపైనా రిలాక్స్గా లేకపోతే ఎలా? కొత్త ఏడాదిలో రిలాక్సేషన్ కోసం సమయం వెచ్చించండి. రిలాక్స్ కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ యాప్. ఇందులో పది నిమిషాల సమయంతో మెడిటేషన్ సెషన్ సీరి్సలున్నాయి. ఇవి మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

మూడ్ నోట్స్ ( Moodnotes)

ఇది మీ మూడ్స్ ఎలా ఉంటాయో ఇందులో పొందుపరుచుకోవచ్చు. మీ డైలీ వారి కార్యక్రమాల్లో మీ మూడ్స్ ని ఇందులో భద్రపరుచుకోవచ్చు. అంటే మీరు ఆనందంలో ఉన్నా కాని బాధలో ఉన్నాకాని ఆ పీలింగ్స్ ని ఇందులో షేర్ చేసుకోవచ్చు.

పాజ్ (PAUSE)

కొత్త ఏడాదిలో లక్ష్యాలను చేరుకోవాలంటే చేసే పనిపై ఫోకస్ ఉండాలి. ఒత్తిడి, ఆందోళన దరిచేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం పాజ్ యాప్ ఉపయోగపడుతుంది. ఆందోళనగా ఉన్నప్పుడు ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా రీఫ్రెష్ అవుతారు.

మరింత సమాచారం కొరకు..

ఇండియన్ ఆర్మీ సెల్ నంబర్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.gizbot.com/news/isi-sought-to-fish-out-defence-phone-numbers-from-bsnl-013026.html 

బామ్మతో ఫేస్ బుక్ అధినేత ఛాటింగ్ లే చాటింగ్ లు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.gizbot.com/news/dating-tips-for-young-girls-from-mark-zuckerberg-be-the-nerd-013024.html

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజకీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write As 2016 quickly comes around, so do the New Year’s resolutions and plans for the year ahead. From realistic to outlandishly hopeful and everything in between, these apps should help make things a little easier.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot