ఇండియన్ ఆర్మీ సెల్‌ నంబర్లపై ఉగ్రవాదుల కన్ను

Written By:

ఇండియాలో నరమేధం సాగించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఐఎస్ఐ ప్రధానంగా ఇండియా ఆర్మీనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇండియన్ ఆర్మీ అధికారుల ఫోన్ నంబర్లను రహస్యంగా సేకరించే పనిలో ఉగ్రవాదులు బిజీగా ఉన్నారని సమాచారం. ప్రధానంగా ఇండియా భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఉగ్రవాదులు ఈ రకమైన ఎత్తుగడలకు తెరలేపడంతో ఇప్పుడు భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భద్రతాదళాలను అప్రమత్తం చేశాయి. కళ్లు బైర్లు గమ్మే నిజాలను చదవండి.

Read more: పాత ఫోటోతో చీపురుకట్టను ఆడేసుకున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారతదేశంపై దాడులకు పాక్ నిఘా సంస్థ

ఆపరేషన్ ఆర్మీ '! భారతదేశంపై దాడులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ..అనధికారికంగా పెట్టిన పేరు. మన సైనిక స్థావరాల నుంచి సైనికుల వ్యక్తిగత వివరాల దాకా .. ఏ ఒక్క అంశాన్నీ ఐఎస్‌ఐ వేగులు వదిలిపెట్టడం లేదు.

ఆర్మీ అధికారులకు సంబంధించిన వ్యక్తిగత మొబైల్ నంబర్లను

ఆర్మీ అధికారులకు సంబంధించిన వ్యక్తిగత మొబైల్ నంబర్లను పొందేందుకు తాజాగా వారు ప్రయత్నిస్తున్నట్టు తెలియడంతో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. సరిహద్దులకు ఆనుకొని ఉన్న రాష్ర్టాలను, ముఖ్యంగా రాజస్థాన్లోని ఆర్మీ కేంద్రాలను, జవాన్లను అప్రమత్తం చేశాయి.

ముక్కూముఖం తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ

ముక్కూముఖం తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఇవ్వొద్దని ఆర్మీ అధికారులకు రాజస్థాన్ పోలీసు శాఖ గట్టిగా సూచించింది. అపరచితుల నుంచి ఫోన్ కాల్స్‌కు కూడా దూరంగా ఉండాలని కోరింది.

గత ఏడాది చివర్లో ఆర్మీ సిబ్బంది మొబైల్ నంబర్లు

గత ఏడాది చివర్లో ఆర్మీ సిబ్బంది మొబైల్ నంబర్లు ఇవ్వాలంటూ బీఎస్‌ఎన్ఎల్ కార్యాలయానికి వరసగా ఫోన్లు వచ్చాయి. బీఎస్‌ఎన్ఎల్ అధికారులు ఆరా తీయగా ... అవన్నీ పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఐఎస్‌ఐ కుట్ర వెల్లడయింది.

రాజస్థాన్లోని పోఖ్రాన్ సమీపంలో సైనిక విన్యాసాలు

ఆ సమయంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ సమీపంలో సైనిక విన్యాసాలు సాగాయి. ఈ సంధర్భంగా పోఖ్రాన్ సబ్ డివిజన్లోని ఆర్మీ సిబ్బందికి కొత్త మొబైల్ నంబర్లు ఇచ్చారు. వాటిని అపహరించడానికి ఐఎస్‌ఐ ప్రయత్నించింది. వ్యక్తి, ప్రాంతం తెలియకుండా ఉండేందుకు..ఇంటర్నెట్ కాల్స్ ద్వారా బీఎ్సఎన్ఎల్ ఖాతాల విభాగాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరపగా .. ఆ కాల్స్ పాక్ నుంచి వచ్చినట్టు తేలింది.

ఆర్మీ అధికారులకు ఇంటర్నెట్ కాల్స్ చేయడం ద్వారా

ఆర్మీ అధికారులకు ఇంటర్నెట్ కాల్స్ చేయడం ద్వారా ల్యాండ్ లైన్ నంబర్లను సేకరించాలని పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలు తమ మెదడుకు పదునుపెట్టాయి. రాజస్థాన్ లోని బీఎస్‌ఎన్ఎల్ ఆపీసుకు పదుల సంఖ్యలో పాకిస్తాన్ నుంచి కాల్స్ వచ్చాయని జిల్లా టెలికాం అధికారి యోగేష్ భాస్కర్ తెలిపారు.

అప్పుడు ఆర్మీ సిబ్బంది ల్యాండ్ ఫోన్ నెంబర్ల కోసం

అప్పుడు ఆర్మీ సిబ్బంది ల్యాండ్ ఫోన్ నెంబర్ల కోసం ఐఎస్ఐ ఏజెంట్లు పాకిస్తాన్ నుంచి బిఎస్ఎన్ఎల్ సిబ్బందికి ఫోన్లు చేశారు. ఐఎస్ఐ ఏజెంట్లు చాలా తెలివిగా బిఎస్ఎన్ఎల్ ఎకౌంట్స్ విభాగానికి ఫోన్లు చేశారు. ఆర్మీ అధికారులు, ఉద్యోగుల ఫోన్ బిల్లుల వివరాలు అడిగారు.

కాగా వారు పాకిస్తాన్ నుంచి కాల్ చేసినా

కాగా వారు పాకిస్తాన్ నుంచి కాల్ చేసినా, అది ఢిల్లీ నుంచి వచ్చినట్టు రికార్డ్ అయింది. ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, అనుమానం వచ్చి ఆరా తీస్తే అది పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్ అని తేలిపోయింది.

కాల్ వచ్చింది పాక్ నుంచి అని తెలియని ఓ ఉద్యోగి

అయితే, కాల్ వచ్చింది పాక్ నుంచి అని తెలియని ఓ ఉద్యోగి మాత్రం ఒకటి రెండు నెంబర్లను వారికి తెలిపాడు. ఇప్పటికీ ఐఎస్ఐ ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయం తెలిసిన ఆర్మీ బిఎస్ఎన్ఎల్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆర్మీకి చెందిన వారెవరూ తమ కాంటాక్ట్ వివరాలను ఎవరికీ తెలపవద్దని ఆదేశించారు.

రక్షణ శాఖకు చెందిన ఫోన్ నెంబర్లను సేకరించడానికి

రక్షణ శాఖకు చెందిన ఫోన్ నెంబర్లను సేకరించడానికి ఉగ్రవాద సంస్థ ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసింది. వారు చాలా కాలంగా అదే పనిలో ఉన్నారని తాజాగా వెల్లడైంది. దీంతో, మరిన్ని దాడులకు పాక్ కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా

పోఖ్రాన్ లో సైనిక విన్యాసాలు గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన విషయం విదితమే. పాకిస్తాన్ ఎంతకు తెగిస్తుందో దీని ద్వారా ఇట్టే తెలిసిపోతుంది.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద మూకలు

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాద మూకలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఎన్‌ఎస్‌జీ కమోండో లెప్టినంట్ కల్నల్ ఈకే నిరంజన్ తో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు.

అది జరిగిన వెంటనే మళ్లీ అదే చోట

అది జరిగిన వెంటనే మళ్లీ అదే చోట భారత భద్రతాదళ స్థావరాలపై ఈ ఉగ్రవాద మూకలు విరుచుకుపడ్డాయి. ఇంత జరిగినా భారత ప్రభుత్వం శాంతి స్థాపన అంటూ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ISI SOUGHT TO FISH OUT DEFENCE PHONE NUMBERS FROM BSNL EMPLOYEES
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot