సాఫ్ట్‌వేర్ల జీతాల లిస్ట్ ఇదే !

Written By:

ఎవర్నైనా నీవు పెద్దయ్యాక ఏమవుతావు అంటే వారు టక్కున చెప్పే సమాధానం నేను సాఫ్ట్ వేర్ ని అవుతానని. ఎందుకంటే ఆ రంగంలో జీతాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. ఓ పదేళ్లు సాఫ్ట్ వేర్ రంగంలో కష్టపడితే లైఫ్ లాంగ్ బతికేయవచ్చు అని ఆలోచించే వారు చాలామందే ఉంటారు. అయితే సాఫ్ట్ వేర్ జీతాలు ఎలా ఉంటాయి. మిగతా ఉద్యోగాలతో పోల్చుకుంటే వారి జీతాలు ఏ స్థాయిలో ఉంటాయనేది చాలా మందికి తెలియదు.అయితే మీకు ఇక్కడ సాఫ్ట్ వేర్ అంటే ఏమేమి పొజిషన్లు ఉంటాయి. ఏ పొజిషన్ లో వారికి ఎంత జీతం ఉంటుంది అనే దాన్ని ఇస్తున్నాం ఓ సారి చూసేయండి.

Read more: పీకే వ్యాఖ్యలతో లబోదిబోమంటున్న స్నాప్ డీల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్

సాఫ్ట్ వేర్ రంగంలో అత్యధిక జీతం తీసుకునే వారి జాబితాలో సాఫ్ట్ వేర్ అర్కిటెక్ ఉద్యోగి మొదటి వరుసలో ఉంటారు. ఇతను యావరేజ్ గా సంవత్సరానికి 130,981 డాలర్ల వేతనాన్ని అందుకుంటారు.

సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ మేనేజర్

ఇది జీతాల్లో నంబర్ టూ పొజిషన్. ఇతను యావరేజ్ జీతం సంవత్సరానికి 123,747 డాలర్లు ఉంటుంది.

సొల్యూషన్ ఆర్కిటెక్

ఇది మూడవ పొజిషన్ ఇతను యావరేజ్ గా సంవత్సరానికి 121,522 డాలర్ల వేతనాన్ని అందుకుంటాడు.

ఎనాలటిక్స్ మేనేజర్

ఇది తరువాత అత్యధిక జీతం అందుకునే ఉద్యోగం. సంవత్సర యావరేజ్ వేతనం 115,725 డాలర్లు

ఐటీ మేనేజర్

ఇది అయిదవది. ఇతని యావరేజ్ జీతం 115,725 డాలర్లు ఉంటుంది.

ప్రొడక్ట్ మేనేజర్

ఇది నాన్ టెక్ జాబ్. అయితే టెక్నాలజీలో మేజర్ రోల్ పోషించవలిసి ఉంటుంది. ఇతను సంవత్సరానికి యావరేజ్ గా 113,959 డాలర్లు అందుకుంటారు.

డాటా సైంటిస్ట్

ఇది చాలా హాట్ తో కూడుకున్న జాబు.వీరి జీతం యావరేజ్ గా 105,395 డాలర్లు ఉంటుంది.

సెక్యూరిటీ ఇంజనీర్

ఐటీలో ఇది అత్యంత పవర్ పుల్ జాబ్. సంస్థను సేఫ్టేగా ఉంచేది ఇతనే. ఇతని జీతం యావరేజ్ గా 102,749 డాలర్లు ఉంటుంది.

క్యూఏ ఇంజనీర్

క్వాలీటి ఇంజనీర్ అని కూడా అంటారు. ఇతని యావరేజ్ గా సంవత్సరానికి 101,330 డాలర్లు అందుకుంటాడు.

కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజనీర్

ఈ లిస్ట్ లో తరువాత స్థానం ఇతనిదే. సంవత్సారానికి యావరేజ్ గా 101,154 డాలర్లు అందుకుంటాడు.

డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్

ఇతను సంవత్సరానికి యావరేజ్ గా అందుకునే జీతం 97,258 డాలర్లు

యుఎక్స్ డిజైనర్

ఇతను కూడా 96,855 డాలర్లు యావరేజ్ గా అందుకుంటారు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఇతని యావరేజ్ సాలరీ 96,392 డాలర్లు

సేల్స్ ఇంజనీర్

ఇతని యావరేజ్ శాలరీ 90,899 డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 14 highest-paying tech jobs of 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot