గూగుల్ ఉద్యోగులకు మాత్రమే తెలిసిన కోడ్స్

Posted By:

గూగుల్...ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఉద్యోగులుండే సంస్థ. దాదాపు 40 వేల మందికి పైగా ఉద్యోగాలను అందించిన సంస్థలో చేరాలని భావించకుండా ఉండే టెక్కీ కనిపించడమంటే అతిశయోక్తికాదు.అయితే ఆ కంపెనీలో చేరిన తరువాత అక్కడ వాళ్లు మాత్రమే మాట్లాడే కొన్ని పదాలు ఉంటాయి.అవి వేేవరికి అర్ధం కావు. ఆ కంపెనీలో చేరినవారికి మాత్రమే పరిచయమయ్యే కొన్ని పదాలున్నాయి. వీటి గురించి తెలియాలన్నా తెలుసుకోవాలన్నా గూగుల్ లో ఉద్యోగం పొందాల్సిందే. అవేంటంటే...

Read more: ఫేస్‌బుక్‌లో మీకు తెలియని ఆప్సన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లెక్స్ :

దీన్నే గూగుల్ ప్లెక్స్ అని కూడా పిలుచుకుంటారు. విశాలమైన పర్వత దశ్యాలకు అభిముఖంగా ఉన్న క్యాంపస్ ఇది.దీన్ని ఉద్యోగులు ముద్దుగా ప్లెక్స్ అని పిలుస్తుంటారు.

జీబైక్:

గూగుల్ క్యాంపస్ లో ఉద్యోగులు రవాణాకు వాడే సైకిళ్ల పేరిది. మీరెప్పుడైనా ఏదైనా గూగుల్ క్యాంపస్ సందర్శిస్తే ,రంగురంగుల్లో ఉన్న ఈ సైకిల్ బైక్ లు ఆకర్షిస్తాయి.

స్టాన్:

గూగుల్ ప్లెక్స్ కు మీరు వెళితే స్టాన్ కనిపిస్తుంది. ఇది గూగుల్ సొంత టీ రెక్స్ అస్థిపంజరాకృతి.ఉద్యోగుల మైండ్ లో గూగుల్ ఎన్నడూ డైనోసార్ కాబోదని చెప్పేందుకు దీన్ని నిలిపారట.

నూగ్లర్ :

మీరు గూగుల్ కు కొత్త వారైతే మిమ్మల్ని న్యూగ్లర్ అని పిలుస్తారు. వాడుక పరిభాషలో న్యూగ్లర్ అన్నమాట.కార్యాలయంలో కొత్తవారిని గుర్తించేందుకు వీరికి ఓ టోపీని ఇస్తారు. దీంతో వారు న్యూగ్లర్ అని మిగతా వారికి తెలుస్తుంది.

గేగర్ల్స్:

ఎల్జీబీటీ వారి మద్దతుదారులను గే గర్ల్స్ అని పిలుస్తారు. గూగుల్ లో సుమారు 40 మంది ఈతరహా ఉద్యోగులున్నారు. సంస్థ ఛీఫ్ ఇంటర్నెట్ ఎవాంజలిస్ట్ వింట్ సెర్ఫ్ కూడా గే గర్లేనట.

క్పూగ్లర్

గూగుల్ లో ఉద్యోగం వద్దని రాజీనామా చేసి వెళ్లేవారికి పెట్టుకున్న పేరిది. ఎక్స్ గూగులర్ అన్న పదాన్ని కలిపి క్పూగ్లర్ ను పుట్టించారు. తొలి క్పూగ్లర్ పేరు డగ్ ఎడ్వర్డ్స్.గూగుల్ లో ఎంప్లాయి నెంబర్ 59

గూగుల్ జీస్ట్ :

గూగుల్ లో ఉద్యోగుల అభిప్రాయాలు,మేనేజర్ల పనితీరు గురించి చేసే సర్వేకు పెట్టుకున్న పేరిది. సంస్థలోని 90 శాతం మంది ఉద్యోగులు మానవ వనరుల విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు గూగుల్ జీస్ట్ లో భాగంగా సమాధానమిస్తారు.

పెర్ఫ్:

వివిధ సందర్భాల్లో ఉద్యోగులు ఓ చోట చేరిన వేళ తన కళను ప్రదర్శించే పెర్ఫార్మర్లను పిలుచుకునే పేరిది.

టీజిఫ్:

వారాంతం వచ్చిందంటే అందుకు సంకేతంగా ఉద్యోగులు టీజిఫ్ (ధ్యాంక్స్ గాడ్ ఇట్స్ ప్రైడే) అంటారట.ప్రతి గురువారమూ గూగుల్ క్యాంపస్ లలో సాయంత్రం వేళ టీజీఫ్ జరుగుతుంటుంది. ఇక్కడే న్యూగ్లర్ కు టోపీలను అందిస్తారట.

టెక్ స్టాప్:

గూగుల్ ఐటీ విభాగానికి పెట్టుకున్న పేరు.కోడ్ నేమ్ ఇది. టెక్ స్టాప్ ఉద్యోగులే గూగుల్ కార్యాలయాల్లోని కంప్యూటర్లను అమర్చడం.వాటి పని తీరు పర్యవేక్షిస్తుండటం చేస్తుంటారు.

గట్స్:

గూగుల్ యూనివర్సల్ టికెటింగ్ సిస్థం ఇది.కంపెనీలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఆన్ లైన్లో ఉంచి దానికో టికెట్ నంబర్ ఇచ్చి పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గట్స్ ఉపకరిస్తుంది.

20 %టైమ్:

గూగుల్ లో చేయాల్సిన ని కాకుండా ఉద్యోగి తనకు నచ్చిన పని చేసుకునేందుకు 20 శాతం సమయాన్ని కేటాయిస్తారు.ఓ ఉద్యోగి 20 % టైమ్ లో ఉన్నారంటే అసలు పని కాకుండా ఇంకో పనిలో ఉన్నట్లు.సాధారణంగా ఉద్యోగులు ఈ 20 శాతం సమయంలో జీ మెయిల్,గూగుల్ న్యూస్,యాడెసెన్స్ వంటి గూగుల్ ప్రొడక్టుల చుట్టూ తిరుగుతారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 15 words only Google employees understand
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot